S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/26/2018 - 00:54

అమరావతి, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్ర గ్రూప్ మరింత శక్తిమంతంగా తన ఉనికిని చాటాలని వ్యాపార, సేవా కార్యక్రమాలను విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దావోస్‌లో మహీం ద్ర సంస్థ గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్ర ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు.

01/26/2018 - 00:54

సికిందరాబాద్, జనవరి 25: ప్రజల్లో ఎం తో ఆదరణ కలిగిన విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. విజయ డెయిరీ కార్మికులు, ఉద్యోగులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

01/26/2018 - 00:53

విశాఖపట్నం, జనవరి 25: యువత ఉపాధి అవకాశాల కోసం కాకుండా ఉద్యోగాలిచ్చే పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు విస్తృత కార్యక్రమాలు అమలు చేస్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి వై. సుజనా చౌదరి అన్నారు.

01/26/2018 - 00:51

విజయవాడ, జనవరి 25: భారతదేశంలో గృహాలు.. ఇతర వాణిజ్య సముదాయ భవనాల నిర్మాణ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానా న్ని సముపార్జించుకున్న గ్లోబల్ లీడర్ లిక్సిల్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్‌లోని తన ప్లాంట్లను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దేందుకు దాదాపు 65 మిలియన్ల (రూ.ఆరున్నర కోట్లు) పెట్టుబడులకు సిద్ధమవుతున్నది.

01/26/2018 - 00:50

హైదరాబాద్, జనవరి 25: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న టిఎస్ ఐపాస్ విధానం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పారిశ్రామిక రంగంలో విశేష స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పెంపొందించేందుకు చేపట్టిన టిఎస్ ఐపాస్‌కు పెట్టుబడులుపోటెత్తాయి. టిఎస్ ఐపాస్ అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్ట్ఫికేషన్ సిస్టమ్.

01/25/2018 - 01:01

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రభుత్వరంగ బ్యాంకులకు మరింతగా జవసత్వాలు కల్పించేందుకు కేంద్రం మరో అడుగు ముందుకేసింది. మార్చి 31లోగా దాదాపు లక్ష కోట్ల వరకూ ప్రభుత్వరంగ బ్యాంకులకు ఉద్దీపన పథకంలో భాగంగా అందచేయాలని సంకల్పించింది. వృద్ధిరేటును పునరుద్ధరించడంతోపాటు రానిబాకీల సమస్యను పరిష్కరించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేసింది.

01/25/2018 - 00:57

ముంబయి, జనవరి 24: వరసగా ఆరో రోజు కూడా స్టాక్ మార్కెట్ల జోరు కొనసాగింది. బుధవారం కూడా సెనె్సక్స్, నిఫ్టీలు బెంచ్‌మార్క్‌ను అధిగమించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్‌చేంజి ‘సెనె్సక్స్’ 22 పాయింట్ల లాభపడి 36,161 వద్ద ముగిసింది. నిఫ్టీ మొదట 14 పాయింట్లు వెనకబడినా ఆ తర్వాత 2 పాయింట్లు లాభపడి 11,086 వద్ద స్థిరపడింది.

01/25/2018 - 00:56

అమరావతి, జనవరి 24: మార్చి నెలాఖరులోగా సంఘటిత రంగంలోని కార్మికులందరికీ ఈపీఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలను కల్పించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ, ఫ్యాక్టరీల విభాగాలపై అధికారులతో ఆయన సమీక్షించారు.

01/25/2018 - 00:56

విజయవాడ, జనవరి 24: పాస్‌పోర్టు సేవలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా మరో ఐదు పోస్ట్ఫాసుల్లో సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు విజయవాడలోని రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ డీఎస్‌ఎస్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

01/25/2018 - 00:55

అమరావతి, జనవరి 24: రాష్ట్భ్రావృద్ధిలో భాగంగా విద్యుత్ పొదుపు కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు మరో అడుగు ముందుకు పడింది. అన్ని ప్రభుత్వ భవనాలను ఎనర్జీ స్టార్ భవనాలుగా రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ పవర్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్‌ఎల్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతులు కలిపాయి.

Pages