S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/25/2018 - 00:55

విజయవాడ, జనవరి 24: రాష్ట్రంలో వ్యాపారులకు జీఎస్‌టీ సంబంధిత సేవలు అందించేందుకు సువిధ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మాస్టర్స్ ఇండియా సీఈఓ నిశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం విజయవాడలోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా సువిధ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన 34 సంస్థల్లో తమది ఒకటి అన్నారు.

01/25/2018 - 00:54

విశాఖపట్నం, జనవరి 24: వచ్చేనెల 23 నుంచి మూడు రోజులపాటు జరిగే అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు స్మార్ట్‌సిటీ విశాఖ మరోసారి వేదిక కానుంది. సదస్సుకు నగరంలోని ఏపీఐఐసీ గ్రౌండ్ సిద్ధమవుతోంది. సదస్సుకు ప్రపంచంలో ఉండే 40 దేశాలకు చెందిన ఐదు వేలమందికి పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆయా దేశాలకు చెందిన ప్రతినిధులు కోరిన వౌలిక వసతులు ఏపీలో కోరినచోట కల్పించేందుకు ఈ సదస్సులో కీలకమైన చర్చ జరగనుంది.

01/25/2018 - 00:54

అమరావతి, జనవరి 24: ‘ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక రంగం అభివృద్ధి, తయారీ రంగం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నాం. నూతన పాలసీలు తీసుకొచ్చాం, రాయితీలు కల్పిస్తున్నాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా ఉన్నాం. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులు త్వరితగతిన ఇస్తున్నాం’ అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.

01/25/2018 - 00:53

న్యూఢిల్లీ, జనవరి 24: అతిసార వ్యాధిని అరికట్టేందుకు భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన ‘రోటావాక్’ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నుంచి ఫ్రి క్వాలిఫికేషన్ గుర్తింపు లభించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ప్రతినిధులు బుధవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడారు. సంస్థ సీఎండీ కృష్ణా ఎల్లా మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అర్హత పొందిన భారత కంపెనీ తమదేనని వెల్లడించారు.

01/25/2018 - 00:52

హైదరాబాద్, జనవరి 24: దేశంలోకి దిగుమతయ్యే కాగితం, కాగితం గుజ్జు, కాగితంబోర్డులపై పదిశాతం కస్టమ్స్ సుంకాన్ని మళ్లీవిధించాలని, దీని వల్ల దేశీయ కాగితం పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని అసోచామ్ కేంద్రాన్ని కోరింది. దేశంలో కాగితం మార్కెట్ సైజు 14.4 మిలియన్ టన్నులు ఉందని అసోచామ్ పేర్కొంది. 2020 నాటికి ఈ డిమాండ్ 20 ఎంటిపిఏకు చేరుకుంటుందన్నారు.

01/24/2018 - 00:24

న్యూయార్క్, జనవరి 23: కార్మిక చట్టాలు, భూసేకరణ వంటి రంగాల్లో సంస్కరణలు చేపడితే, పది శాతం వృద్ధిరేటును సాధించడం భారత్‌కు అసాధ్యమేమీ కాదని నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మొదటి మూడేళ్ల పాలనలో ఆర్థిక వృద్ధిరేటు 7.5 శాతానికి చేరుకుందని ఆయన గుర్తుచేశారు.

01/24/2018 - 00:22

ముంబయి, జనవరి 23: దేశీయ స్టాక్‌మార్కెట్లలో సంచలనాల పరంపర కొనసాగుతోంది. గత వారం రోజులుగా దూకుడు మీదున్న సూచీలు ఈ వారం కూడా అదే జోరును కొనసాగిస్తున్నాయి. అంతకంతకూ దూసుకుపోతూ లభాల తీరాలను తాకుతున్నాయి.

01/24/2018 - 00:21

అమరావతి, జనవరి 23: దశాబ్దాలుగా నీరు లేక నిస్తేజమైన రాయలసీమ నేడు జలవనరులతో కళకళలాడుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ రూపురేఖలు మార్చి పారిశ్రామికాభివృద్ధికి బాటవేసిందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.

01/24/2018 - 00:18

అమరావతి, జనవరి 23: గత ఏడాది ఈడీబీతో అవగాహన ఒప్పం దం చేసుకున్న మిడ్‌టెక్ ఇన్నోవేషన్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు దావోస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 50 సంస్థలతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ చేసుకుంది. 150 కంపెనీలను ఏపీకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తొలిదశలో 60 సంస్థలను తీసుకువచ్చేందుకు సంప్రదింపులు పూర్తిచేశామని సంస్థ ప్రతినిధులు చెప్పారు.

01/24/2018 - 00:18

వాషింగ్టన్, జనవరి 23: అమెరికాలో మూడురోజులుగా ‘మూతపడిన ప్రభుత్వం’ తిరిగి మంగళవారం నాడు యథాస్థితికి చేరుకుంది. దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్రవ్య బిల్లుపై సంతకం చేయడంతో ‘షట్‌డౌన్’కు తెరపడింది. తాజా పరిణామాన్ని ఆయన ‘గొప్ప విజయం’గా అభివర్ణించుకున్నారు. నిర్ణీత కాలవ్యవధిలోగా ద్రవ్య వినిమయ బిల్లు సెనేట్ ఆమోదం పొందలేక పోవడంతో ఈనెల 19న అర్ధరాత్రి సమయంలో అమెరికా ప్రభుత్వం మూతపడింది.

Pages