S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/24/2018 - 00:17

గోదావరిఖని, జనవరి 23: సింగరేణి బొగ్గు పరిశ్రమలో రక్షణ చర్యలపై మరింత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఎస్‌కె దత్తా సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి జవహార్ లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో మంగళవారం రాత్రి సింగరేణి 50వ వార్షిక రక్షణ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

01/24/2018 - 00:17

విజయవాడ, జనవరి 23: ఏబీబీ అధ్యక్షుడు చున్యున్ గుతో ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో సమావేశమయ్యారు.
సౌర, పవన, హైబ్రిడ్ విద్యుత్ రంగాల్లో ఏపీ అనుసరిస్తున్న నూతన విధానాలను, అమరావతిలో కాలుష్య రహిత విద్యుత్ వాహనాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు.

01/24/2018 - 00:16

విజయవాడ, జనవరి 23: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో సుజ్లాన్ గ్రూప్ సీఎండీ తుల్సి తంతి దావోస్‌లో మంగళవారం సమావేశమయ్యారు. పవన, సౌర, గ్యాస్ ఆధారిత విద్యుత్ రంగాల్లో తమ భవిష్యత్ విస్తరణ ప్రణాళికల గురించి ముఖ్యమంత్రికి తుల్సి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తమ సంస్థకు గ్యాస్ కేటాయింపుల అంశాన్ని పరిష్కరించిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువచ్చారు.

01/24/2018 - 00:16

విజయవాడ, జనవరి 23: గ్లోబల్ ఫార్మా కంపెనీ రోషే ప్రతినిధి క్రిస్టోఫె ఫ్రాంజ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్‌లో దీర్ఘకాలంగా తమ కార్యకలాపాలు సాగిస్తోందని అయితే తమ కార్యకలాపాలను మరింత విస్తరించదల్చామని రోషే ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం తాము అత్యున్నత ఎలక్ట్రానిక్ మెడికల్ హెల్త్ రికార్డుల తయారీపై అధ్యయనం చేస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు.

01/24/2018 - 00:15

విజయవాడ, జనవరి 23: గ్రామాల్లో అన్ని వౌలిక వసతులు కల్పించి పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడ రూరల్ జక్కంపూడి-షాబాద్ బీసీ కాలనీలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారిగా జక్కంపూడిలో ఎకనామిక్ సిటీ నిర్మంచనున్నామన్నారు.

01/24/2018 - 00:15

విజయవాడ, జనవరి 23: అమరావతిలో ఫ్యూచరిస్టిక్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. దావోస్‌లో సీఎంను ఆయన మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి చేస్తున్న కృషిని అభినందించారు.

01/24/2018 - 00:14

విజయవాడ, జనవరి 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పే పాల్ వైస్ ప్రెసిడెంట్ రిచార్డ్ నాష్ వెల్లడించారు. దావోస్‌లో ఆయనతో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత సమస్యలు అధిగమించేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని వివరించారు.

01/24/2018 - 00:14

అమరావతి, జనవరి 23: దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏజిల్ లాజిస్టిక్స్ సీఈఓ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ తరక్ సుల్తా అల్ ఎస్సా, డైరక్టర్ ఉగెన్ మెన్ వ్యాపార విస్తరణకు ప్రణాళికలతో ఉన్నామని ముఖ్యమంత్రికి వివరించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నామని, ముఖ్యంగా సాంకేతికంగా ముందున్న ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించామని బాబు దృష్టికి తీసుకువెళ్లారు.

01/23/2018 - 01:00

చిత్రం..ఢిల్లీలో సోమవారం జరిగిన ఆసియాన్-ఇండియా బిజినెస్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్ మీట్ సందర్భంగా
ఆయా దేశాల ప్రతినిధులతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు

01/23/2018 - 00:58

దావోస్, జనవరి 22: సమసమాజం స్థాపనకు ఘనమైన పథకాలను అమలు చేస్తున్నామని పాలకులు ఎంతగా గొప్పలు చెబుతున్నప్పటికీ భారత్‌లో ఆర్థిక అసమానతల తీరు ఆందోళనకరంగానే ఉంది. దేశంలో సంపద ఎక్కువ భాగం అత్యంత ధనవంతులైన కొద్దిమంది వద్దే కేంద్రీకృతమై ఉందని ‘ఆక్స్‌ఫామ్’ తాజా సర్వేలో తేటతెల్లమైంది. గత ఏడాది భారత్‌లో జరిగిన సంపద సృష్టిలో 73 శాతం కేవలం ఒక శాతం మంది వద్ద ఉందని ఆ సర్వేలో తేలింది.

Pages