S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/23/2018 - 00:53

న్యూఢిల్లీ, జనవరి 22: ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కంపెనీ అయిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) నగదు, షేర్ల మార్పిడి ఒప్పందం ద్వారా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్)ను స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియ పూర్తయితే హెచ్‌పీసీఎల్ దేశంలో మూడో అతిపెద్ద చమురు శుద్ధి కంపెనీగా అవతరిస్తుంది.

01/23/2018 - 00:52

ముంబయి, జనవరి 22: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్ లాభాల్లో ముగిశాయి. విదేశీ నిధులు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్‌లోకి తరలి రావడంతో పాటు దేశీయ మదుపరులు ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లకు పూనుకోవడంతో మార్కెట్ కీలక సూచీలు సోమవారం సరికొత్త రికార్డు గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ, టీసీఎస్ వంటి బ్లూచిప్ కంపెనీల షేర్లు ఎక్కువగా మదుపరులను ఆకర్షించాయి.

01/23/2018 - 00:50

దావోస్, జనవరి 22: భారత్ పట్ల విశ్వసనీయత సన్నగిల్లుతోందా? అన్న ప్రశ్నకు సర్వేలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ప్రజల విశ్వసనీయత చూరగొన్న దేశాల జాబితాలో ప్రత్యేకస్థానంలో ఉండే భారత్, గత ఏడాదితో పోలిస్తే మాత్రం కిందకు దిగజారిందని తాజా సర్వే స్పష్టం చేస్తోంది.

01/23/2018 - 00:50

హైదరాబాద్, జనవరి 22: మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియాకు చెందిన అనేకమంది పారిశ్రామికవేత్తలు అసక్తిగా ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జి. వివేక్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల పరిస్థితుల గురించి కొరియాలో పారిశ్రామికవేత్తలకు వివరించినట్లు ఆయన చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన సౌకర్యాల గురించి వివరించినట్లు తెలిపారు.

01/23/2018 - 00:49

న్యూఢిల్లీ, జనవరి 22: భారత బ్యాంకింగ్ వ్యవస్థపై స్థూల నిరర్ధక ఆస్తుల భారం మరింత పెరగనుంది. ఈ మార్చి చివరి నాటికి ఈ మొత్తం రూ.9.5 లక్షల కోట్లకు పెరగనున్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం మార్చి చివరి నాటికి రూ.8 లక్షల కోట్లున్న ఈ మొత్తం ఏడాది వ్యవధిలో భారీగా పెరుగుతున్నాయని ఒక నివేదిక వెల్లడించింది.

01/23/2018 - 00:49

లక్నో, జనవరి 22: వివాదాస్పద హిందీ చలనచిత్రం ‘పద్మావత్’ను ఉత్తరప్రదేశ్‌లో నిషేధించాలని కర్ణిసేన పోషకుడు లోకేంద్రసింగ్ కల్వీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఇక్కడ సోమవారం కలిసిన సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాను యుపీలో విడుదల చేస్తే థియేటర్లలో ప్రజలే ‘జనతా కర్ఫ్యూ’ను అమలు చేస్తారని ఆయన ప్రకటించారు.

01/23/2018 - 00:47

కాకినాడ, జనవరి 22: ఏపీలో త్వరలో నిరుద్యోగులకు భృతి కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను జిల్లాల అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. సంబంధిత అధికారులు జిల్లాల్లో యువత, విద్యావంతుల నుండి సలహా సూచనలను స్వీకరిస్తోంది. విద్యావంతుల అభిప్రాయాలు, సలహాలు, సూచనల మేరకు అవసరమైన మార్పులుచేసి భృతి కల్పనకు చట్టరూపం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

01/23/2018 - 00:46

సత్యవేడు/తడ, జనవరి 22: అమెరికాకు చెందిన వివిధ రకాల రుచులు, సువాసన పరిమళాలు తయారుచేసే ఇంటర్నేషనల్ ఫ్లేవర్స్ అండ్ ఫ్రాగ్నెన్సన్ (ఐఎఫ్‌ఎఫ్) నూతన పరిశ్రమ నిర్మాణానికి సోమవారం శ్రీసిటీలో భూమిపూజ జరిగింది. శ్రీసిటీ ఎండీ రవీంద్రసన్నారెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని ఐఎఫ్‌ఎఫ్ పరిశ్రమ ప్రతినిధులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

01/22/2018 - 01:12

న్యూఢిల్లీ, జనవరి 21: ఎగుమతులు పుంజుకోవడానికి, ఉద్యోగాల కల్పనను పెంచడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజెడ్‌లు) ప్రస్తుతం అనుభవిస్తున్న ఆదాయపు పన్ను ప్రోత్సాహకాలను కొనసాగించాలని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గట్టిగా భావిస్తోంది. ఎస్‌ఈజెడ్‌లపై ప్రస్తుతం విధిస్తున్న కనీస ప్రత్యామ్నాయ పన్నును కూడా ఎత్తివేయాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాసింది.

01/22/2018 - 01:11

హైదరాబాద్, జనవరి 21: తెలంగాణ ఐటీ రంగం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఐటీ ఎగుమతులు రూ.97వేల కోట్లకు చేరనున్నాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా మూడేళ్లలో రూ.30 వేల కోట్ల మేర ఐటి ఎగుమతుల విలువ పెరిగింది. ప్రస్తుతం దేశంలో ఐటి రంగంలో బెంగళూరు ప్రథమ స్థానంలో, మహారాష్ట్ర ద్వితీయ స్థానంలో, తెలంగాణ (హైదరాబాద్) మూడో స్థానంలో ఉన్నాయి.

Pages