S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/22/2018 - 01:08

న్యూఢిల్లీ, జనవరి 21: యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి వంటి బ్లూచిప్‌లు మూడో త్రైమాసికంలో (క్యూ3లో) ఆర్జించే లాభాలతో పాటు డెరివేటివ్‌ల కాలపరిమితి ముగింపు సోమవారం నుంచి మొదలయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ సరళిని ప్రభావితం చేయనున్నాయని నిపుణులు పేర్కొన్నారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవం వస్తున్నందున ఆ రోజున స్టాక్ మార్కెట్లు పని చేయవు.

01/22/2018 - 01:05

హైదరాబాద్, జనవరి 21: వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19)లో నేషనల్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) 45 మిలియన్ టన్నుల ముడి ఇనుము (ఐరన్ ఓర్) ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35 లక్షల మిలియన్ టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి అవుతుందని అంచనావేశారు. ఎన్‌ఎండిసి తొలుత రూపొందించిన లక్ష్యం ప్రకారం 2017-18 లో 37 మిలియన్ టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి చేయాల్సి ఉంది.

01/22/2018 - 01:03

భీమవరం, జనవరి 21: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్భ్రావృద్ధిలో ఆక్వారంగం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతానికి ఈ రంగమే జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచుతోంది. దేశవ్యాప్తంగా ఏటా సుమారు రూ.37,871 కోట్లు విలువైన ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా ఒక్క ఏపీ నుంచే రూ.17 వేల కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయి.

01/21/2018 - 01:14

ముంబయి, జనవరి 20: చమురు శుద్ధి సంస్థ హెచ్‌పీసీఎల్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం వాటా 51.11 శాతాన్ని రూ. 36,915 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్టు ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) శనివారం వెల్లడించింది. ఈ వాటాలపై పది శాతానికి పైగా ప్రీమియం చెల్లిస్తున్నట్టు పేర్కొంది.

01/21/2018 - 01:13

ముంబయి, జనవరి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో వారం పుంజుకున్నా యి. కీలక సూచీలు కొత్త మైలురాళ్లను అధిగమించాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ ఈ వారం 919.19 పాయింట్లు పుంజుకొని, సరికొత్త జీవనకాల రికార్డు స్థాయి 35,511.58 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కూడా ఆల్-టైమ్ హై 10,894.70 పాయింట్ల వద్ద స్థిరపడింది.

01/20/2018 - 02:34

హైదరాబాద్, జనవరి 19: హైదరాబాద్ మార్కెట్లోకి శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రెండవ జనరేషన్ ఆడి క్యు 5 కారును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆడి హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వీమాట్లాడుతూ 2009 నుంచి తమ సంస్ధ కార్లు మార్కెట్లో ఉనద్నాయని, భారతీయుల హృదయాలను గెలుచుకున్నామన్నారు. కొత్త ఆడి క్యు కారు విలువ రూ..53.25 లక్షలని చెప్పారు.

01/20/2018 - 01:23

ముంబయి, జనవరి 19: మూడో త్రైమాసికంలో బ్లూచిప్‌లు సాధించిన మంచి లాభాలు, 23 వస్తువులు, 54 సేవలపై పన్ను రేట్లను తగ్గించడం సహా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి తీసుకున్న హేతుబద్ధీకరణ నిర్ణయాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు దన్నుగా నిలిచాయి.

01/20/2018 - 01:22

అమరావతి, జనవరి 19: రాష్ట్రాన్ని బ్లాక్ చైన్ టెక్నాలజీ క్యాపిటల్ ఆఫ్‌ది వరల్డ్‌గా తీర్చడమే తన లక్ష్యమని ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ లక్ష్య సాధన కోసమే ప్రభుత్వం కోవలెంట్ ఫండ్‌తో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఈ మేరకు ఒప్పంద అవగాహన జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ కోవలెంట్ ప్రతినిధులను రియల్ టైం గవర్నెన్స్‌కు తీసుకువెళ్లి, దాని పనితీరు వివరించారు.

01/20/2018 - 01:19

విజయవాడ, జనవరి 19: రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఆఫ్-కోర్సు టోటె సెంటర్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

01/20/2018 - 01:19

విజయవాడ, జనవరి 19: ఎయిడెడ్, జూనియర్, డిగ్రీ, ఓరియంటల్ కళాశాలలు, అలాగే పంచాయతీరాజ్, మున్సిపల్ ఎయిడ్ పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ చేసే నాటికి అర్ధ వేతన సెలవులు నగదుగా మార్చుకునేలా కాలేజియేట్ ఎడ్యుకేషన్ ప్రత్యేక కమిషనర్ సుజాతశర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Pages