S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/14/2017 - 00:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: బ్యాంకు ఖాతాలు, పాన్‌తో ‘ఆధార్’ను అనుసంధానం చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పొడిగించింది. ఇప్పటి వరకూ బ్యాంకు ఖాతాలు, ఇతర ఆర్థిక లావాదేవీలకు పాన్, ఆధార్ అనుసంధానం చేసుకోని వారికి ఈ వెసలుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

12/14/2017 - 00:52

వృద్ధి రేటు అంచనాలను ఏడీబీ తగ్గించడంతో పడిపోయిన సూచీలు
175 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్ * 10,200 దిగువకు దిగజారిని నిఫ్టీ

12/14/2017 - 00:51

హైదరాబాద్, డిసెంబర్ 13: రాష్ట్రంలో రైతులకు 2017-18 సంవత్సరానికి సంబంధించి 5.87 లక్షల క్వింటాళ్ల విత్తనాన్ని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వ్యవసాయ శాఖ కార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. బుధవారం ఇక్కడి ఫ్యాప్సీ భవనంలో జరిగిన తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ రెండో సర్వసభ్య సమావేశం జరిగింది.

12/14/2017 - 00:51

వాషింగ్టన్, డిసెంబర్ 13: హెచ్1బి వీసాపై యూఎస్‌లో ఉద్యోగాలు సంపాదించుకున్న ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పని చేసుకోవచ్చని యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ వెల్లడించింది. నాన్-ఇమ్మిగ్రాంట్ కోటా కిందకు వచ్చే హెచ్1బి వీసా ద్వారా ప్రత్యేకమైన వృత్తి నిపుణులు, సాంకేతిక నిపుణులు అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకోవడం తెలిసిందే.

12/14/2017 - 00:50

కొత్తగూడెం, డిసెంబర్ 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటు చేయనున్న ఉక్కు పరిశ్రమతో జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుంది. సుమారు రూ 5వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 1.5 మిలియన్ టన్నుల సామర్థ్యం కల్గిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పచ్చజెండా ఊపటంతో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారు.

12/14/2017 - 00:49

విజయనగరం, డిసెంబర్ 13: రాష్ట్రంలో మైనింగ్ తవ్వకాలకు సంబంధించి నిర్లక్ష్యం వహించే మైనింగ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర గనులశాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు హెచ్చరించారు. బుధవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక, మాంగనీస్, గ్రానైట్ తదితర క్వారీల్లో తప్పక నిబంధనలు పాటించాలన్నారు.

12/14/2017 - 00:49

హిందూపురం, డిసెంబర్ 13: కొరియాకు చెందిన కియా కారు బుధవారం అనంతపురం జిల్లాకు చేరుకుంది. కొరియాలో తయారైన కియా కంపెనీ కారును అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీఏ కార్యాలయంలో బుధవారం రిజిస్ట్రేషన్ చేయించారు. కియా మోటార్స్ ఇండియా లిమిటెడ్ పేరిట సంస్థ ప్రతినిధి వినోద్‌కుమార్ కారును రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు. కియా కారుకు ఏపీ 02 బీపీ 2454 నెంబరు కేటాయించారు.

12/14/2017 - 00:48

విజయవాడ, డిసెంబర్ 13: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వ శాఖల్లో దుబారా ఖర్చు మాత్రం ఆగటం లేదు. రాష్ట్రంలోని మొత్తం మూడున్నర లక్షల మంది ఉద్యోగుల్లో పర్యవేక్షణాధికారులైన 88 వేల మందికి ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సెల్‌ఫోన్ సౌకర్యం కల్పించింది.

12/14/2017 - 00:47

విజయవాడ, డిసెంబర్ 13: గన్నవరం విమానాశ్రయ విస్తరణ పూర్తయ్యాక, అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడించారు. విజయవాడలో ఆయన బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ విస్తరణ వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నెల 19 నుంచి గన్నవరం నుంచి ముంబయికి డైరెక్టు విమాన సర్వీసును ప్రారంభిస్తున్నామన్నారు.

12/13/2017 - 00:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: మిరప ఎగుమతుల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను మూడు నెలల్లో పరిష్కారిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ రాధా మోహన్ సింగ్ హామీ ఇచ్చారు.

Pages