S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/13/2017 - 00:20

ముంబయి, డిసెంబర్ 12: అంతర్జాతీయ సంకేతాలు, కొనుగోళ్ల మద్దతుతో తొలుత మూడు సెషన్లలో లాభాల జోరు కొనసాగించిన మార్కెట్ సూచీలు మంగళవారం నాడు దారుణంగా చతికిలపడ్డాయి. విశ్వవిపణిలో చమురు ధరలు పెరగడం కూడా మార్కెట్‌పై ప్రభావానికి కారణమైంది. ఫెడ్ సమావేశం, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూడా మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరించారు.

12/13/2017 - 00:19

విశాఖపట్నం, డిసెంబర్ 12: గిరిజనులు పండించే కాఫీని మరింతగా ప్రోత్సహించి, దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి గిరిజన సహకార సంస్థ (జిసిసి) తీసుకున్న నిర్ణయంతో కాఫీ గింజలకు గిట్టుబాటు ధర లభించింది. గత రెండేళ్ళుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంతో గిరిజన రైతులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందగలుగుతున్నారు. జిసిసి ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం అపెక్స్ కమిటీని నియమించింది.

12/13/2017 - 00:18

గౌహతి, డిసెంబర్ 12: వివిధ నైపుణ్యాల్లో ఏటా లక్షమంది యువతకు శిక్షణ ఇవ్వాలని సమాజసేవలో పేరెన్నికగన్న టాటా ట్రస్ట్ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా అయిదేళ్లపాటు ఈ కార్యమ్రం కొనసాగుతుంది. గత ఏడాది ఇరవై వేల మంది యువతీ యువకులకు శిక్షణ ఇచ్చినట్లు ‘టాటా ట్రస్టు’ అధిపతి (ఈశాన్య విభాగం) విశ్వనాథ్ సిన్హా మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో తెలిపారు.

12/13/2017 - 00:18

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణలో అమాయక యువతపై ఫార్మా కంపెనీలు సాగిస్తున్న క్లినికల్ ప్రయోగాలపై చర్యలు తీసుకోవాలని టి.టిడిపి నాయకులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ నేతృత్వంలో పలువురు నాయకులు మంగళవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యదర్శిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.

12/13/2017 - 00:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: రాజకీయ పార్టీలకు విరాళాల విషయంలో సంస్కరణలు తెచ్చే దిశగా ప్రవేశపెట్టాలనుకుంటున్న ‘ఎలక్టోరల్ బాండ్ల’ చెల్లుబాటును పదిహేను రోజులకు పరిమితం చేయాలని కేంద్రం భావిస్తోంది. 2017-18 బడ్జెట్‌లో ప్రకటించిన ‘ఎలక్టోరల్ బాండ్ల’కు సంబంధించి మార్గదర్శకాలను ఇప్పటికే ఖరారు చేసినా, విధి విధానాలకు తుది రూపం ఇచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ తుది కసరత్తు చేస్తోంది.

12/13/2017 - 00:17

హైదరాబాద్, డిసెంబర్ 12: ఈ నెల 14,15 తేదీల్లో ఇక్కడ కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార టెక్నాలజీ, తెలంగాణ ప్రభుత్వం, ఇజ్రాయేల్ కాన్సులేట్ జనరల్ , టి హబ్ సైబర్ సొసైటీ ఆఫ్ ఇండియా, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా తదితర సంస్ధల ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై రెండు రోజుల సదస్సు జరుగుతుంది.

12/13/2017 - 02:55

ముంబయి, డిసెంబర్ 12: గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధర మంగళవారం నాడు మరింతగా తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ ముగియడం, శుభకార్యాలకు ‘మూఢం’ అడ్డుతగలడంతో బంగారు నగల కొనుగోళ్లకు డిమాండ్ తగ్గింది. మంగళవారం నాటి మార్కెట్‌లో గ్రాముకు 180 రూపాయలు తగ్గడంతో నాలుగు నెలల కనిష్ఠానికి బంగారం ధర క్షీణించింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో పది గ్రాముల బంగారం ధర రూ. 29,400లుగా పలుకుతోంది.

12/13/2017 - 00:15

కేసముద్రం, డిసెంబర్ 12: ‘కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న’ చందంగా ఈనామ్ అమలు కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మార్కెట్ ప్రాభవం రోజురోజుకు తగ్గుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రత్యక్ష పద్ధతి ద్వారా రైతుల నుంచి దళారులు, అడ్తీదారుల ప్రమేయం లేకుండా నేరుగా వ్యాపారులు వేలం పాటల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు ఖరీదు చేసే విధానం అమలులో ఉండేది.

12/12/2017 - 00:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఆసియాన్ దేశాలతో సముద్ర, గగనతల, రోడ్డు మార్గాలలో అనుసంధానాన్ని పెంపొందించేందుకు భారత్ ఒక బిలియన్ డాలర్ల (రూ. వంద కోట్ల) రుణం ఇవ్వడానికి ప్రతిపాదించిందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఇక్కడ తెలిపారు.

12/12/2017 - 00:53

ముంబయి, డిసెంబర్ 11: ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న సానుకూల ధోరణితో సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మదుపరులు కొనుగోళ్లకు పూనుకోవడం వల్ల మార్కెట్ల ప్రధాన సూచీలు రెండూ కూడా పైకి ఎగబాకాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 205 పాయింట్లు పుంజుకొని 33,456 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 10,300 స్థాయికి పైన స్థిరపడింది.

Pages