S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/21/2017 - 00:38

ముంబయి, నవంబర్ 20: ఈ సంవత్సరం జూలై ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), నిరుటి పెద్ద నోట్ల రద్దు దేశంలో ద్రవ్య చలామణికి సంబంధించిన సమస్యలను సృష్టించడమే కాకుండా నగరాలలో పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపిందని, ఫలితంగా నగరాల ర్యాంకింగ్ దిగజారిందని ఒక నివేదిక వెల్లడించింది.

11/21/2017 - 00:36

హైదరాబాద్, నవంబర్ 20: నగరంలోని హైటెక్స్ వేదికగా ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు ఫౌల్ట్రీ ఎక్స్‌పో జరుగనుంది. ఇండియన్ ఫౌల్ట్రీ ఇక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపిఈఎంఏ) ఆధ్వర్యంలో ఈ ఎక్స్‌పో నిర్వహించనున్నారు. ఫౌల్ట్రీ రంగంలో అభివృద్ధి, ఉత్తమ నిర్వహణ, ఆధునాతన పరిజ్ఞానంతో కోళ్ల ఆరోగ్య పరిరక్షణ, మేత తయారీ తదితర అంశాలపై ఈ వేదికగా సుధీర్ఘంగా చర్చించనున్నారు.

11/21/2017 - 00:36

అక్టోబర్‌లో జరిగిన కార్ల అమ్మకాలలో దేశీయ దిగ్గజ సంస్థ మారుతి ఆల్టో అమ్మకాల్లో అగ్రస్థానానికి ఎగబాకింది. డిజైర్, బాలెనో అమ్మకాల్లో రెండు మూడు స్థానాలు సాధించాయ. మిగతా ఏడు స్థానాలు పైన తెలిపిన గ్రాఫ్‌లో చూడవచ్చు.

11/20/2017 - 00:34

న్యూఢిల్లీ, నవంబర్ 19: తక్కువ పన్నులు, ఎక్కువ ప్రభుత్వ వ్యయం కారణంగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లోటు పెరుగుతుందని అమెరికాకు చెందిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. అయితే పన్ను చెల్లించేవారి సంఖ్యను విస్తరించడంతో పాటు వ్యయ సమర్థతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రానున్న కాలంలో బడ్జెట్ లోటు తగ్గుతుందని వివరించింది.

11/20/2017 - 00:33

న్యూఢిల్లీ, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక డివిడెండ్ చెల్లించాలని రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ)ను అడగడం లేదని, కేవలం ఆర్‌బీఐ వద్ద అదనంగా ఉన్న రూ. 13వేల కోట్లను ఇవ్వాలని మాత్రమే అడుగుతోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ తెలిపారు. 2017 జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ ఆగస్టులో ప్రభుత్వానికి రూ. 30,659 కోట్ల డివిడెండ్ చెల్లించింది.

11/20/2017 - 00:31

వరంగల్, నవంబర్ 19: నాటుసారా తయారు చేసే వృత్తిని మానివేసిన గిరిజనులకు ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ కింద ఆర్థిక సహాయం అందించటంలో బ్యాంకర్లు విఫలమవుతున్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని చెప్పారు.

11/20/2017 - 00:29

హైదరాబాద్, నవంబర్ 19: బోధన్‌లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని పునరుద్దరించాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌కు లేఖ రాశారు. నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడమే కాకుండా అక్రమ లే ఆఫ్‌ను ఎత్తివేసి కార్మికులకు రావాల్సిన రెండున్నరేళ్ల జీతాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

11/20/2017 - 00:29

బాన్సువాడ రూరల్, నవంబర్ 19: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసమే ప్రభుత్వం నీలి విప్లవం కార్యక్రమం కింద ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిందని, పెరిగిన చేపలను అమ్ముకునే హక్కు కేవలం మత్స్యకారులకు మాత్రమే ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం పాత బాన్సువాడలో బోయి సంఘం కమ్యూనిటీ హాలును ప్రారంభించిన అనంతరం ఆయన వారినుద్దేసించి ప్రసంగించారు.

11/20/2017 - 00:25

న్యూఢిల్లీ, నవంబర్ 19: దేశంలో ప్రైవేటు రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక పెద్దగా లేనట్లే. దేశీయ కంపెనీలు వేతనాల వ్యయాన్ని నియంత్రించడానికి కీలక ప్రాధాన్యత ఇస్తుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో మిగిలిన కాలంలో కొత్త ఉద్యోగాల కల్పన పెద్దగా ఉండబోదని అసోచామ్ ఆదివారం పేర్కొంది.

11/20/2017 - 00:24

హైదరాబాద్, నవంబర్ 19: భారతీయ ఆరోగ్య బీమా చరిత్రలో తొలిసారిగా ఒక వినూత్న ఆవిష్కరణ ‘ఎనీ టైం హెల్త్(ఎటిహెచ్)’ను ప్రవేశపెడుతున్నట్లు మాక్స్ బుపా తెలిపింది. ఆరోగ్య బీమా పొందాలనుకునే వారి ఆరోగ్య పరిస్థితులను కేవలం 180 సెకండ్లలో అంచనా వేసి తద్వారా ఆరోగ్య బీమా పొందేందుకు వీలుగా ప్రారంభించిన కొత్త ఆవిష్కరణ ఎటిహెచ్ అని మాక్స్ బుపా ఎండి, సిఈఓ ఆశిష్ మెహరోత్రా పేర్కొన్నారు.

Pages