S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/20/2017 - 00:23

హైదరాబాద్, నవంబర్ 19: ప్రభుత్వ ఆదేశాలమేరకు ప్యాకేజ్‌డ్ వస్తువులను నిర్ణీత ఎంఆర్‌పి ధరలకే వ్యాపారులు విక్రయిస్తున్నారా అన్న అంశంపై నిరంతరం నిఘా ఉంచాలని తూనికలు, కొలతల శాఖ కంప్ట్రోలర్ సివి అనంద్ ఆదేశాలు జారీ చేశారు.

11/19/2017 - 01:12

బోధన్, నవంబర్ 18: ఎన్నో సంవత్సరాల తరబడి శ్రమిస్తూ ఎంతో మందికి తీపిని పంచిన చక్కెర కర్మాగారం కార్మికులు నేడు చేదు మెతుకులతో కాలం వెల్లదీయాల్సి వస్తోంది. రెండేళ్లుగా చేయడానికి ఉద్యోగం లేక, చేతిలో పైసా లేక ఆర్థిక ఇబ్బందులతో పస్తులుంటున్నారు. తమను ఎవ్వరైనా ఆదుకుంటారేమో కనీసం విఆర్‌ఎస్ నోటిఫికేషనైనా వస్తుందా అని నిలువెల్లా ఎదిరి చూస్తున్నారు.

11/19/2017 - 01:10

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడంతో పాటు అంతర్జాతీయంగా సానుకూల పవనాలు వీస్తుండటంతో బంగారానికి గిరాకీ పెరిగింది. దీంతో శనివారం పుత్తడి ధర భారీగా పెరిగింది. గత రెండు రోజుల వ్యవధిలో రూ.175 తగ్గిన 10 గ్రాముల బంగారం ధర శనివారం ఒకే రోజు 325 రూపాయల మేరకు పెరిగి 30,775 రూపాయలకు చేరుకుంది. అలాగే వెండి ధర కూడా పుంజుకుని రూ.41 వేల మార్కును దాటింది.

11/19/2017 - 01:09

కొచ్చి, నవంబర్ 18: దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల నుంచి బయటపడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తప్పుడు భ్రమల్లో చిక్కుకోరాదని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘మూడీస్’ భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను పెంచడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

11/19/2017 - 01:05

ముంబయి, నవంబర్ 18: దేశాలకు క్రెడిట్ రేటింగ్‌లు ఇచ్చే విషయంలో అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ పాటిస్తున్న పద్ధతులన్నీ తప్పుల తడకగా ఉన్నాయంటూ కొద్ది నెలల క్రితం తీవ్రస్థాయిలో విమర్శించిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు అదే సంస్థ భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను పెంచడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం పరిహసించారు.

11/19/2017 - 01:03

హైదరాబాద్, నవంబర్ 18: ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌కు మూడు అవార్డుల లభించాయి. ఇటీవల న్యూ ఢిల్లీలో జరిగిన గ్రే ట్ ఇండియా ఐస్‌క్రీం అండ్ ఫ్రోజెన్ డెసర్ట్ కంటెస్ట్ 2017లో మూడు విభాగాల్లో అవార్డులు లభించాయి. స్టాండర్ట్ వెనీలా కేటగిరిలో సిల్వర్, చాకోలెట్ కేటగిరిలో సిల్వర్, సోర్బెట్ కేటగిరిలో సిల్వర్ అవార్డులు లభించినట్లు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది.

11/19/2017 - 01:02

హైదరాబాద్, నవంబర్ 18: హైదరాబాద్ నుంచి ఢిల్లీకి జజీరా ఎయిర్‌వేస్ సర్వీస్‌ను ప్రారంభించారు. కువైట్‌కు చెందిన జజీరా ఎయిర్‌వేస్ తక్కువ ఖర్చుతో కూడిన నిత్యం తిరిగే విమానాలను ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన స్పందన అనంతరం 2018 మొదట్లో కొచ్చి, ముంబయి, అహ్మదాబాద్‌కు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని జజీరా సిఈఓ రోహిత్ రామచంద్రన్ ఈ సందర్భంగా తెలిపారు.
ముగిసిన ‘స్కిల్స్ 2017’

11/19/2017 - 01:01

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశంలో నూనె గింజలు సాగుచేస్తున్న రైతులతో పాటు రిఫైనర్లకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ముడి పామాయిల్‌పై ప్రస్తుతం 15 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 30 శాతానికి, రిఫైన్డ్ పామాయిల్‌పై 25 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 40 శాతానికి పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

11/18/2017 - 00:58

న్యూఢిల్లీ, నవంబర్ 17: అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘మూడీస్’ 13 ఏళ్ల తర్వాత భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను బీబీఏ-3 నుంచి బీబీఏ-3కి పెంచడం పట్ల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ఆర్థిక, సంస్థాగత సంస్కరణలకు లభించిన విశిష్టమైన గుర్తింపుగా ఆయన దీనిని అభివర్ణించారు.

11/18/2017 - 00:56

న్యూఢిల్లీ, నవంబర్ 17: కొద్ది రోజుల క్రితం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోని దాదాపు 200 వస్తువుల రేట్లను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం తాజా ధరలతో కూడిన స్టిక్కర్లను ఆయా వస్తువులపై అతికించేందుకు సదరు కంపెనీలకు డిసెంబర్ నెలాఖరు వరకు అనుమతి ఇచ్చింది.

Pages