S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/15/2017 - 01:37

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఆహార పదార్థాలు, ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో టోకు ధరల సూచీ ఆధారంగా లెక్కగట్టే ద్రవ్యోల్బణం గత ఆరునెలల్లో గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 2.60 శాతం, అక్టోబర్‌లో 1.27 శాతం ఉన్న ఈ ద్రవ్యోల్బణం 2017 అక్టోబర్‌లో 3.5 శాతానికి చేరుకుంది. ఏప్రిల్ నెలలో గరిష్ఠ స్థాయిలో 3.85 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది.

11/15/2017 - 01:37

ముంబయి, నవంబర్ 14: భారతదేశంలో ఆహార సర్వీసుల పరిశ్రమ అనూహ్య రీతిలో విస్తరించే అవకాశాలు మెరుగవుతున్నాయని తాజాగా ఓ నివేదికలో స్పష్టమైంది. రానున్న ఐదేళ్ల కాలంలో ఆహార సర్వీసుల మార్కెట్ 5.52 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ఫిక్కీ-టెక్నోపాక్ సంస్థ జరిపిన ఈ సర్వేలో స్పష్టమైంది. అంటే వార్షికంగా పదిశాతం చొప్పున భారతదేశ ఆహార సర్వీసుల మార్కెట్ విస్తరించే అవకాశం ఉందని ఈ నివేదిక విశే్లషించింది.

11/15/2017 - 01:36

న్యూఢిల్లీ, నవంబర్ 14: ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ సేతురత్నం రవి బిఎస్‌ఇ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన బీరేంద్ర స్వరూప్ స్థానే ఆయన ఈ పదవిని చేపట్టారు. రవి నియామకానికి సెబి ఆమోదం తెలిపిందని బిఎస్‌ఇ ఓ ప్రకటనలో వెల్లడించింది. అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఆస్తుల నిర్వహణ, కంపెనీల్లో ఇప్పటివరకు సేతురత్నం రవి ఎన్నో కీలక పదవులు నిర్వహించారని పేర్కొంది.

11/15/2017 - 01:36

న్యూఢిల్లీ, నవంబర్ 14: భారతీయులకు వీసా నిబంధనలను వచ్చే జనవరి 1వ తేదీ నుంచి సడలించాలని, తమ దేశంలో తాత్కాలిక విడిది కోసం వచ్చేవారికి ‘బహుళ ప్రవేశ వీసా’లను జారీ చేయాలని జపాన్ నిర్ణయించింది. పర్యాటకులకు, వ్యాపారులకు, తరచూ వచ్చే సందర్శకుల కోసం ఈ సడలింపులు ఉంటాయని ఇక్కడి జపాన్ రాయబార కార్యాలయం మంగళవారం తెలిపింది.

11/15/2017 - 01:35

హైదరాబాద్, నవంబర్ 14:తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి కృషి చేసిన రియల్టర్లకు కానె్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) త్వరలో క్రియేట్-2017 అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు జి రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రామచంద్రారెడ్డి వెల్లడించారు.

11/15/2017 - 01:35

గుంటూరు, నవంబర్ 14: ప్రైవేటు వడ్డీవ్యాపారంపై ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది..నిబంధనలు కఠినతరం చేయటంతో పాటు నిర్దేశించిన వడ్డీ రేట్లను మాత్రమే వసూలు చేయాలని.. అధిక వడ్డీ వసూలుచేస్తే జైలుశిక్ష, జరిమానా విధించే విధంగా ఆంధ్రప్రదేశ్ వడ్డీ వ్యాపారుల చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును మంగళవారం డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప శాసనసభలో ప్రవేశపెట్టగా దానిని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

11/15/2017 - 01:34

రాజమహేంద్రవరం, నవంబర్ 14: ప్రమాదాలు చెప్పిరావు.. అలక్ష్యం వహిస్తే అమ్యూలమైన ప్రాణాలు మూల్యం చెల్లించాల్సిందే.. అందుకే అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా నదీ ప్రయాణాల్లో ఇది మరింత అవసరం. తాజాగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీపట్నం వద్ద కృష్ణాగోదావరి సంగమ ప్రాంతంలో జరిగిన బోటు ప్రమాదం గోదావరి జిల్లాల్లో ప్రకంపనలు సృష్టించింది. బోటు ప్రయాణాలకు గోదావరి నది అత్యంత ప్రసిద్ధి.

11/13/2017 - 00:31

న్యూఢిల్లీ, నవంబర్ 12: దేశంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో 2019 మార్చి నాటికి హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు దాదాపు రూ.34 వేల కోట్లతో చేపట్టబోతున్న భారత్‌నెట్ రెండవ, తుది దశ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. టెలికామ్ శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.

11/13/2017 - 00:29

హైదరాబాద్, నవంబర్ 12: ‘బంగారు తెలంగాణ’ సాధనకోసం బ్యాంకులు కూడా సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో బ్యాంకులు యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఉన్నతాధికారులతో ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు పర్యాయాలు చర్చలు జరిపారు.

11/13/2017 - 00:28

గుర్గావ్, నవంబర్ 12: ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు వీలుగా వాటికి మరింత మూలధనాన్ని సమకూర్చి దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వాలని కేంద్రం నిర్ణయించిందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఆదివారం ఇక్కడ జరిగిన ‘పిఎస్‌బి మంథన్’లో ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)ల అధిపతులను ఉద్ధేశించి ప్రసంగిస్తూ జైట్లీ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

Pages