S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/13/2017 - 00:26

న్యూఢిల్లీ, నవంబర్ 12: అక్టోబర్ నెలకు సంబంధించిన ద్రవ్యోల్బణ గణాంకాలు, అలాగే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న చమురు ధరల ధోరణులు ఈ వారం భారత స్టాక్ మార్కెట్లపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

11/13/2017 - 00:25

న్యూఢిల్లీ, నవంబర్ 12: దేశంలోని జౌళి, వస్త్రాల తయారీ రంగాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో విస్తృతమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఎఫ్‌ఐఇఓ (్భరత ఎగుమతిదారుల సమాఖ్య) స్పష్టం చేసింది.

11/13/2017 - 00:25

ముంబయి, నవంబర్ 12: దేశ వాణిజ్య రాజధానిగా పేరు పొందిన ముంబయి నగరంలో ఈ వారం ఆసియా బ్యాంకర్ల సంఘం (ఏబీఏ) 34వ వార్షిక సమావేశం జరుగనుంది. ఏబిఎ సమావేశానికి ముంబయి ఆతిథ్యమివ్వనుండటం ఇదే తొలిసారి.

11/12/2017 - 00:26

విశాఖపట్నం, నవంబర్ 11: ఔషధాల్లో మిశ్రమంగా వాడే, దీర్ఘకాలిక వ్యాధులను సైతం నయం చేసే తేనెకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. అదీ గిరిజన బ్రాండ్ తేనెకు మరింతగా గిరాకీ ఉంది. ప్రస్తుతం వెయ్యి మెట్రిక్ టన్నులకు మించి తేనె డిమాండ్ ఉంది. అయితే, దీనిని గిరిజనుల నుంచి సేకరించేందుకు గిరిజన సహకార సంస్థ (జిసిసి) ప్రత్యేక చర్యలు చేపట్టింది.

11/12/2017 - 00:25

జమ్ము, నవంబర్ 11: వస్తు సేవా పన్ను (జిఎస్టీ) మోదీ ప్రభుత్వ సున్నితత్వానికి నిదర్శనమని, సామాన్యుల ప్రయోజనాలను ఆశించే ఈ కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విరివిగా పాల్గొనడాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ‘ఆయన ఎంతగా పర్యటిస్తే బిజెపి అంతగా బలపడుతుంది’ అని వ్యాఖ్యానించారు.

11/12/2017 - 00:24

న్యూఢిల్లీ, నవంబర్ 11: దేశంలోని వివిధ ప్రాంతాలకు పాలను సరఫరా చేయడంతో పాటు పాల ఉత్పత్తులను తయారు చేస్తున్న సంస్థల్లో అతిపెద్దదైన అమూల్ డెయిరీ ఇప్పుడు భారతీయ రైల్వేల ద్వారా మరింత ఎక్కువ మందికి చేరువ అవుతోంది. ఇందుకోసం ఆ సంస్థ సామాజిక మాధ్యమాలను సైతం ఎంతో చక్కగా ఉపయోగించుకుంటోంది.

11/12/2017 - 00:23

హైదరాబాద్, నవంబర్ 11: ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో భాగంగా అందించే ప్రఖ్యాత హింద్ రతన్ అవార్డు-2018కు కోదాడకు చెందిన యువ ఎన్‌ఆర్‌ఐ సుధీర్ జలగం ఎన్నికయ్యారు. విదేశాల్లో భారత దేశ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంచేందుకు పాటుపడిన ఎన్‌ఆర్‌ఐలకు ఈ అవార్డును అందిస్తారు. ఈ మేరకు ఎన్‌ఆర్‌ఐ వెల్ఫేర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి శనివారం సుధీర్ జలగంకు లేఖ అందింది.

11/12/2017 - 00:21

ఇల్లందు, నవంబర్ 11: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి సంస్థలో కూడా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధిక బొగ్గు ఉత్పత్తి కోసం ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ యాంత్రీకరణ విధానాలతో ఫలితాలు వస్తున్నందున ఆ దిశలో యాజమాన్యం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కోట్ల విలువచేసే భారీ యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు.

11/12/2017 - 00:19

న్యూఢిల్లీ, నవంబర్ 11: ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరడం పర్యాటక రంగాన్ని దెబ్బతీయడం ఖాయమని అసోచామ్ స్పష్టం చేసింది. సాధారణంగా ప్రతి ఏటా నవంబర్, డిసెంబర్ మాసాల్లో విదేశీ పర్యాటకులు అధిక సంఖ్యలో భారత్‌కు వస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది ‘గోల్డెన్ టూరిస్ట్ సర్క్యూట్’గా పేరు పొందిన ఢిల్లీ, ఆగ్రా, జైపూర్‌లను సందర్శిస్తుంటారు.

11/12/2017 - 00:17

బీజింగ్, నవంబర్ 11: చైనాలో శనివారం ‘సింగిల్స్ డే’ పేరుతో నిర్వహించిన వార్షిక ఆన్‌లైన్ షాపింగ్ ఫెస్టివల్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ ఫెస్టివల్‌లో వినియోగదారులు తొలి మూడు నిమిషాల వ్యవధిలోనే 1.5 బిలియన్ డాలర్ల వస్తువులను కొనుగోలు చేయడంతో చైనా ఇ-కామర్స్ దిగ్గజం ‘అలీబాబా’ అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది.

Pages