S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/12/2017 - 00:17

న్యూఢిల్లీ, నవంబర్ 11: అమెరికన్ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్ న్యూజెర్సీలోని న్యూఆర్క్, భారత రాజధాని న్యూఢిల్లీ మధ్య నడుపుతున్న తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరమైన స్థాయికి చేరిందన్న హెచ్చరికలతో పాటు ప్రస్తుతం అక్కడ వాతావరణం సరిగా లేకపోవడమే ఇందుకు కారణం.

11/11/2017 - 00:42

న్యూఢిల్లీ, నవంబర్ 10: వాహన తయారీదారుల్లో సంతోషాన్ని నింపడంలో ప్రస్తుత పండుగల సీజన్ విఫలమైంది. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో నాలుగు మాసాల తర్వాత గత నెలలో తొలిసారి ప్రయాణికుల వాహనాల (ప్యాసింజర్ వెహికల్స్) అమ్మకాలు స్వల్పంగా తగ్గడమే ఇందుకు కారణం.

11/11/2017 - 00:41

విజయవాడ, నవంబర్ 10: ఎలక్ట్రికల్ వాహనాల స్మార్ట్ చార్జింగ్, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో నూతన ఆవిష్కరణలకు ఏపీ వేదిక కానుందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి లోకేష్ అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ మొబిలిటీ స్టేక్ హొల్డర్ల సమావేశం శుక్రవారం జరిగింది. ఈసందర్భంగా ఆయన ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కంపెనీలు, బ్యాటరీ తయారీ కంపెనీలతో భేటీ అయ్యారు.

11/11/2017 - 00:39

ముంబయి, నవంబర్ 10: వినియోగ వస్తువులపై భారీ యెత్తున పన్నురేటును తగ్గిస్తూ జిఎస్‌టి మండలి తీసుకున్న నిర్ణయం శుక్రవారం మార్కెట్లపై సానుకూల ప్రభావాన్ని కనబర్చింది. వివిధ దశల్లో ఊగిసలాడిన బిఎస్‌ఇ సెనె్సక్స్ స్వల్పంగా 63.63 పాయింట్లు బలపడి 33,314.56 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 12.80 పాయింట్లు పుంజుకుని 10,321.75 పాయింట్ల వద్ద ముగిసింది.

11/11/2017 - 00:38

హైదరాబాద్, నవంబర్ 10: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ ఇండియా తన కొత్త ఎకోస్పోర్ట్‌ను హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. శుక్రవారం నాడిక్కడ జరిగిన కొత్త కారు ఆవిష్కరణ సందర్భంగా ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడు, ఎండి అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ వినోదం, శక్తియుత, అనుంధానితమైన కార్ల ఉత్పత్తి నుంచి టిఐవిసిటి పెట్రోల్ వెర్షన్, డిటిసిఐ డీజిల్ వెర్షన్‌తో కూడిన కొత్త మోడల్‌ను ఆవిష్కరించినట్లు చెప్పారు.

11/11/2017 - 00:36

న్యూఢిల్లీ, నవంబర్ 10: పునర్వినియోగ ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు మరిన్ని బహుళపక్ష సంస్థలు, అభివృద్ధి బ్యాంకులు ఐఎస్‌ఎ (అంతర్జాతీయ సౌర విద్యుత్ కూటమి)తో చేతులు కలపాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఉద్ఘాటించారు.

11/11/2017 - 00:36

న్యూఢిల్లీ, నవంబర్ 10: ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని, దీంతో ఇప్పటివరకూ 22.5 లక్షల హెక్టార్లు సేంద్రియ సాగుబడిలోకి వచ్చాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ స్పష్టం చేశారు. గ్రేటర్ నోయిడాలో గురువారం ఆయన ‘ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్-2017’ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

11/11/2017 - 00:34

విజయవాడ, నవంబర్ 10: రాష్ట్రంలో వేరుశనగకు క్వింటాల్‌కు 4450 రూపాయల మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా వేరుశనగ సాగు చేస్తారని, పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు వీలుగా ఏపీ ఆయిల్ ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేసేందుకు నిర్ణయించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు.

11/11/2017 - 00:33

న్యూఢిల్లీ, నవంబర్ 10: భారత మొబైల్ ఫోన్ల మార్కెట్‌లో పోటీ రోజు రోజుకూ మరింత ఉద్ధృతమవుతోంది. ప్రముఖ ఆన్‌లైన్ వ్యాపార (ఇ-కామర్స్) సంస్థల్లో ఒటైన ఫ్లిప్‌కార్ట్ కూడా ఇప్పుడు భారత మొబైల్ ఫోన్ల మార్కెట్‌లోకి ప్రవేశిస్తోంది.

11/10/2017 - 04:08

న్యూఢిల్లీ, నవంబర్ 9: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)కు సంబంధించి వ్యాపారవేత్తలు, వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించబోతోంది. అత్యధిక స్థాయిలో అమ్ముడవుతున్న 28 శాతం పన్ను పరిధిలోకి వచ్చే వస్తువుల్లో 200కు పైగా వస్తువులపై పన్నులను తగ్గించే అవకాశం కనిపిస్తోంది.

Pages