S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/10/2017 - 00:07

న్యూఢిల్లీ, నవంబర్ 9: దేశ రాజధానితో పాటు ఆ చుట్టుపక్క ప్రాంతాల్లో ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫయర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఢిల్లీతో పాటు ఎన్‌సిఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిని దాటిపోతోందన్న హెచ్చరికలే ఇందుకు కారణం. ఈ హెచ్చరికలతో బెంబేత్తుతున్న ప్రజలు ఎయిర్ ప్యూరిఫయర్లను కొనుగోలు చేసేందుకు పరుగులు తీస్తున్నారు.

11/10/2017 - 00:05

హైదరాబాద్, నవంబర్ 9: ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించే అరుదైన అవకాశం తెలంగాణ రాష్ట్రానికి వచ్చినందున ప్రతిభను చాటుకుని పని చేసి విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఈ సదస్సు నిర్వహణలో పాల్గొంటున్న అన్ని శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పని చేసి సదస్సుకు అవసరమైన ఏర్పాట్లు అద్భుతంగా చేపట్టాలని అన్నారు.

11/10/2017 - 00:05

ముంబయి, నవంబర్ 9: వరుసగా రెండు సెషన్లు పడిపోయిన షేర్ల ధరలు గురువారం తిరిగి పుంజుకున్నాయి. శుక్రవారం జరుగనున్న వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం పట్ల ఉన్న ఆశావాద దృక్పథం దన్నుగా బీఎస్‌ఈ సెనె్సక్స్ మళ్లీ పైకి ఎగబాకింది.

11/10/2017 - 00:04

గోదావరిఖని, నవంబర్ 9: పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజక వర్గానికి మహర్దశ రాబోతోందని... అనతి కాలంలోనే ఇక్కడ 6500 కోట్ల రూపాయలతో విదేశీ సంస్థ ఆధ్వర్యంలో మెగా పరిశ్రమ నిర్మాణం కాబోతోందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్ తెలిపారు. గురువారం గోదావరిఖని పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

11/10/2017 - 00:01

న్యూఢిల్లీ, నవంబర్ 9: యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి తప్ప ఉపాధి కోసం అందరిచుట్టూ తిరిగేవారిలా తయారు చేయకూడదని ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. భారతీయ యువశక్తి ట్రస్టు రజతోత్సవం సందర్భంగా గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, గ్రామీణ పారిశ్రామికవేత్తలను తయారు చేయటం ద్వారా దేశంలోని గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చివేయాలని పిలుపునిచ్చారు.

11/09/2017 - 23:59

న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ ఇండియా ఎంతో ప్రజాదరణ పొందిన తమ కాంపాక్ట్ ఎస్‌యువి ‘ఎకోస్పోర్ట్’ని సరికొత్త హంగులతో గురువారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో లభ్యమయ్యే ఈ అప్‌డేటెడ్ వెర్షన్ ధరను రూ.7.31 లక్షల నుంచి రూ.10.99 లక్షలుగా నిర్ణయించారు.

11/09/2017 - 00:30

న్యూఢిల్లీ, నవంబర్ 8: భారత వ్యాపార వర్గంలో ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో ఆశావాదం సన్నగిల్లింది. దీంతో ‘వ్యాపార ఆశావాదం’ (బిజినెస్ ఆప్టిమిజం) సూచీలో భారత్ ఏడో స్థానానికి దిగజారింది. జూన్‌తో ముగిసిన క్రితం త్రైమాసికంలో వ్యాపార ఆశావాదం సూచీలో రెండో స్థానంలో ఉన్న భారత్, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏడో స్థానానికి పడిపోయిందని ఓ సర్వే వెల్లడించింది.

11/09/2017 - 00:27

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రయాణికుడిపై ఇండిగో విమానయాన సంస్థ ఉద్యోగుల దాడి ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. రాజీవ్ కతియాల్ అనే ప్రయాణికుడిని కింద పడేసి ఇండిగో ఉద్యోగులు దుర్మార్గంగా ప్రవర్తించారు. కిందకు తోసేసి పిడిగుద్దులు అలాగే మెడపట్టుకుని నొక్కేశారు. ఈ వీడియో క్లిపింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇండిగో సిబ్బంది దాష్టీకంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

11/09/2017 - 00:25

ముంబయి, నవంబర్ 8: దేశీయ మార్కెట్లలో వరుసగా రెండో రోజు బుధవారం కూడా అమ్మకాల జోరు కొనసాగింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ బుధవారం 152 పాయింట్లు పడిపోయి వారం రోజుల కనిష్ట స్థాయి 33,218.81 పాయింట్లకు చేరింది. లోహపు, చమురు- సహజ వాయువు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థిరాస్థి రంగాల షేర్లలో విస్తృత స్థాయిలో అమ్మకాలు జరగడం వల్ల సెనె్సక్స్ భారీగా పడిపోయింది.

11/09/2017 - 00:25

న్యూఢిల్లీ, నవంబర్ 8: విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం (ఫెరా) నిబంధనలను ఉల్లంఘించిన కేసులో సమన్లు స్వీకరించకుండా తప్పించుకుంటున్న విజయ్ మాల్యాను ప్రకటిత అపరాధి (ప్రొక్లెయిమ్డ్ అఫెండర్)గా ప్రకటించే ప్రక్రియకు ఢిల్లీలోని ఒక కోర్టు బుధవారం శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 18లోగా తన ముందు హాజరు కావడానికి కోర్టు మాల్యాకు చివరి అవకాశం ఇచ్చింది.

Pages