S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/09/2017 - 00:24

‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లో జిసీసీ ప్రత్యేక ఆకర్షణవిశాఖపట్నం, నవంబర్ 8: అరకు కాఫీకి ప్రపంచ దేశాల్లో ఆదరణ పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశం నలుమూలలకే పరిమితమైన అరకు కాఫీ సువాసన ఇపుడు ప్రపంచ దేశాల్లో కూడా వెదజల్లబోతోంది. ఢిల్లీ ఇండియా గేట్ వద్ద ఈ నెల 3,4,5, తేదీల్లో నిర్వహించిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లో జిసిసి బ్రాండ్‌తో కూడిన అరకు కాఫీ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.

11/09/2017 - 00:22

బెంగళూరు, నవంబర్ 8: పెద్దనోట్లను రద్దు చేసిన నవంబర్ 8వ తేదీని తమ పార్టీ ‘నల్లధనం వ్యతిరేక దినం’గా పాటిస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని భాజపా నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. నల్లధనాన్ని వ్యవస్థీకృతం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నందున దేశంలో రెండు రాజకీయ సంస్కృతుల మధ్య సమరం సాగుతోందని ఆయన బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు.

11/09/2017 - 00:21

హైదరాబాద్, నవంబర్ 8: ఇప్పటి వరకు ఆధార్‌తో ముడి పడిన డిజిటల్ జీవన్ ప్రమాణ్ పత్రాలను సమర్పించిన పెన్షనర్ల వద్ద నుంచి భౌతిక రూపంలోనే రైఫ్ సర్ట్ఫికెట్‌ను స్వీకరించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపిఎఫ్‌ఒ) ప్రధాన కార్యాలయం నిర్ణయించింది. ఇప్పడది అనివార్యం కాదని తెలిపింది.

11/09/2017 - 00:21

ఇటానగర్, నవంబర్ 8: ‘అవినీతికి పర్యాయపదమైన’ కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ప్రజల గురించి ఆలోచించడానికి బదులు- ఈ దేశాన్ని దారుణంగా లూటీ చేసిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పెద్దనోట్లను రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం ఇక్కడి గంగామార్కెట్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

11/09/2017 - 00:20

న్యూఢిల్లీ, నవంబర్ 8: పెద్దనోట్ల రద్దు నిర్ణయం నైతికమైతే కోట్లాది మంది ప్రజలకు కష్టాలు ఎందుకు దాపురిస్తాయని కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. నోట్లరద్దుకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ నిర్ణయం వల్ల కోట్లాది మంది ఉపాధి కోల్పోయారన్నారు.

11/09/2017 - 00:20

ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉద్యోగ వెబ్‌సైట్ ‘ఇండీడ్’ వెల్లడించిన తాజా అధ్యయనం నివేదిక ప్రకారం సేవా రంగంలో 75.2 శాతం ఉద్యోగాలలో ఫ్లెక్సిబల్ వర్క్ ఎరేంజ్‌మెంట్స్ ఉన్నట్లు పేర్కొంది. గ్రేటర్ నొయిడా ప్రాంతంలో 93 శాతం ఉద్యోగాలు ఫ్లెక్సిబల్, లేదంటే పార్ట్‌టైం తరహాలో ఉంటున్నాయి. ఉద్యోగాల కల్పనలో సేవారంగమే ముందుందని స్పష్టం చేసింది.

11/09/2017 - 00:19

హైదరాబాద్, నవంబర్ 8: డిజిటల్ ఇండియా కార్యక్రమానికి ప్రేరణ అందించేందుకు వీలుగా ‘స్కిల్స్ 2017’ అంతర్జాతీయ సదస్సును ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు లైఫ్ స్కిల్స్ అండ్ లైలీహుడ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సిరీస్ నిర్వాహక కమిటీ తెలిపింది. గ్రామీణ సాధికారిత కోసం ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

11/08/2017 - 01:05

హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆస్ట్రేలి యా పారిశ్రామికవేత్తలు ఆసక్తి వ్యక్తం చేసారు. సచివాలయంలో మంగళవారం ఐటీశాఖ మంత్రి కె తారకరామారావును ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ షాన్ కెల్లీ, ఇండియా ఏకనామిక్ స్ట్రాటేజీ ప్రాజెక్టు లీడర్ పీటర్ వర్గీస్‌తో కూడిన బృందం కలిసింది. విద్య, వ్యవసాయం, పర్యాటకం వంటి రంగాల్లో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియా బృందం తెలిపింది.

11/08/2017 - 01:03

న్యూఢిల్లీ, నవంబర్ 7: వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి కొత్త టెలికం విధానానికి తుది రూపం ఇవ్వడానికి టెలికం శాఖ (డీవోటీ) కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి ఈ కొత్త టెలికం విధానం ముసాయిదా విడుదల చేసి, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుంది. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్ సిన్హా మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.

11/08/2017 - 01:01

న్యూఢిల్లీ, నవంబర్ 7: భారత్‌లో సంపన్నుల సంఖ్య పెరుగుతోంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మిలియనీర్లకు సంబంధించి భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. మన దేశంలో 2,19,000 మంది దాదాపు 877 బిలియన్ల అమెరికన్ డాలర్ల విలువైన సంపదను కలిగి ఉన్నట్టు తాజా నివేదికలో వెల్లడైంది. మంగళవారం విడుదలైన ‘ఆసియా పసిఫిక్ సంపద నివేదిక-2017’లో ఈ వివరాలు వెలుగు చూశాయి.

Pages