S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/02/2017 - 00:01

న్యూఢిల్లీ, నవంబర్ 1: డిమాండ్ సన్నగిల్లిన కారణంగా కొత్త ఆర్డర్లు నిలిచిపోవడంతో దేశంలో అక్టోబర్ నెలలో తయారీ రంగ (మానుయఫాక్చరింగ్) కార్యకలాపాలు తగ్గిపోయాయి. ప్రధానంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ప్రతికూల ప్రభావం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఒక నెలవారీ సర్వే వెల్లడించింది.

11/01/2017 - 23:59

ముంబయి, నవంబర్ 1: ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో భారత్ ఏకంగా 30 స్థానాలు ఎగబాకి వందవ స్థానాన్ని ఆక్రమించడం దేశీయ మార్కెట్లకు ఊతమిచ్చింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) నిఫ్టీ తొలిసారి బుధవారం 10,400 పాయింట్ల మార్కుకు పైన ముగిసి సరికొత్త రికార్డును సృష్టించింది. బిఎస్‌ఇ సెనె్సక్స్ ఏకంగా 387 పాయింట్లు పుంజుకొని సరికొత్త రికార్డు స్థాయికి ఎదిగింది.

11/01/2017 - 23:56

న్యూఢిల్లీ, నవంబర్ 1: దేశీయ మార్కెట్ల సూచీలు బుధవారం బాగా పుంజుకోవడంతో మదుపరుల సంపద రూ. ఒక లక్ష కోట్లకు పైగా పెరిగింది. ఈక్విటి మార్కెట్లలో మంచి లాభాలు సాధించిన కారణంగా బిఎస్‌ఇలో లిస్ట్ అయిన కంపెనీలలో మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ (ఎం-క్యాప్) రూ. 1.08 లక్షల కోట్లు పెరిగి, రూ. 145 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి కావడం విశేషం.

11/01/2017 - 23:55

విశాఖపట్నం, నవంబర్ 1: విశాఖ విమానాశ్రయం నుంచి ఇకపై అంతర్జాతీయ కార్గో రవాణాకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డైరక్టర్ జనరల్ బుధవారం అనుమతులు మంజూరు చేసినట్టు విశాఖ ఎయిర్‌పోర్ట్ డైరక్టర్ ప్రకాష్‌రెడ్డి తెలియచేశారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఇంటర్నేషనల్ కార్గో రవాణా కోసం మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తుంటే ఇప్పటికి సాకారమైంది.

11/01/2017 - 23:51

హైదరాబాద్, నవంబర్ 1: వడోదర కేంద్రంగా ఉన్న వెన్విక్ టెక్ సొల్యూషన్స్ సంస్థ దేశ వ్యాప్తంగా 25 వేల జిఎస్టీ సువిధ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. కొత్తగా అమల్లోకి వచ్చిన జిఎస్టీకి అనుగుణంగా పని చేసేందుకు పన్ను చెల్లింపుదారులు, ఇతర స్టేక్ హోల్డర్లకు సౌకర్యవంతమైన, సృజనాత్మక పద్దతులను అందిస్తోందని ఆ సంస్థ ఆపరేషన్స్ హెడ్ శరత్ సతీంద్రన్ తెలిపారు.

11/01/2017 - 00:31

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: వ్యవసాయ పరికరాలు ఇంజనీరింగ్ సంస్థ ఎస్కార్ట్స్ లిమిటెడ్ రెండో త్రైమాసిక ఫలితాలు నికర లాభాల పంటను పండించాయి. ఏకంగా ఈ సంస్థ నికర లాభం 148 శాతం పెరిగి 77.56కోట్ల రూపాయలకు చేరుకుంది. డిసెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ఈ సంస్థ మంగళవారం విడుదల చేసింది.

11/01/2017 - 03:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: భారత రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు సారధ్యం వహించే అవకాశం ఉందా? అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల పత్రిక ‘బ్యారన్’ ఔను అనే సమాధానమే ఇస్తోంది. అమెరికా సెంట్రల్ బ్యాంకుకు సారథ్యం వహించడానికి రాజన్ అన్ని విధాలా యోగ్యుడని ఈ పత్రిక తెలిపింది.

11/01/2017 - 00:28

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: దేశంలో ఉల్లిపాయలు, టమాటా ధరలు పెరగడం అన్నది ఆయా సీజన్లలో సహజమేనని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మంగళవారం నాడక్కడ స్పష్టం చేశారు. తాజా పంటలు చేతికి రావడంతో వీటి సరఫరాలు మెరగవుతాయని, వారంలోనే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

11/01/2017 - 00:26

ముంబయి: గత నాలుగు సెషన్లుగా రికార్డుల మీద రికార్డులను సృష్టిస్తూ వచ్చిన సెనె్సక్స్ వేగం తగ్గింది. మంగళవారం జరిగిన లావాదేవీల్లో ఇటీవలి కాలంలో తొలిసారిగా 53.03 పాయింట్లు కోల్పోయి 33,213.13 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 28.35 పాయింట్లు కోల్పోయి 10,335.30 వద్ద ముగిసింది.

11/01/2017 - 00:22

విజయవాడ (క్రైం), అక్టోబర్ 31: జాతీయ సమగ్రత పరిరక్షణ ప్రతి ఒకరి బాధ్యతని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు అన్నారు. మారుతున్న కాలం, సాంకేతిక పరిఙ్ఞనానికి అనుగుణంగా తపాలాశాఖ అందిస్తున్న సేవలు గణనీయమన్నారు. మరింత ఆధునికతను సంతరించుకుని పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

Pages