S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/21/2017 - 00:58

హైదరాబాద్, అక్టోబర్ 20: మతపరమైన లేదంటే ఆధ్యాత్మిక పరమైన కారణాల వల్ల కాకుండా ఇతర అంశాల కారణంగానే తీర్థయాత్రలు చేస్తున్నామని 65 శాతం మంది పేర్కొన్నారు. మరో 55 శాతం మంది తీర్థ యాత్రలు తప్పనిసరి అయి చేస్తున్నట్లు వెల్లడించారు. భారత దేశపు అతిపెద్ద హాస్పిటాలిటీ కంపెనీ ఓయో నిర్వహించిన సర్వేలో భారతీయులు ఉత్తేజకరమైన యాత్రల వివరాలు వెల్లడయ్యాయని తెలిపింది.

10/21/2017 - 00:57

హైదరాబాద్, అక్టోబర్ 20: ఎల్‌ఈడి బల్బుల తయారీలో అగ్రగామిగా విస్తరిస్తున్న స్టాంజో ఇండియా లిమిటెడ్ సంస్థ కొత్తగా ఫైబర్ టెక్నాలజీ రంగంలో ప్రవేశించింది. ఇందుకు గాను బ్రిటన్‌కు చెందిన కార్బన్ 8 లిమిటెడ్ సంస్థతో శుక్రవారం హైదరాబాద్‌లో స్టాంజో ఎల్‌ఈడి లిమిటెడ్ ఫ్యాక్టరీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. స్టాంజో ద్వారా రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కార్బన్ 8 ఈ ఒప్పందం చేసుకుంది.

10/21/2017 - 00:54

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: నిబంధనలకు విరుద్ధంగా మహింద్రా అండ్ మహింద్రా లిమిటెడ్ (ఎంఎంఎల్) కంపెనీ షేర్లలో లావాదేవీలు జరిపిన ఆ సంస్థ ఉద్యోగి విజయ్ అనంత్ దోంగ్డేకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబి రూ. 1లక్ష జరిమానా విధించింది. ఆంక్షలు అమలులో ఉన్న వ్యవధిలో వాటాల క్రయవిక్రయాలు జరిపినందుకు ఈ జరిమానా విధించినట్లు సెబి జనరల్ మేనేజర్ డి.సూరారెడ్డి బుధవారం జారీ చేసిన తన ఆదేశాలలో పేర్కొన్నారు.

10/18/2017 - 22:51

గత రెండు రోజులుగా సాగుతున్న బిఎస్‌ఇ, నిఫ్టీ రికార్డులకు బుధవారం బ్రేక్ పడింది. కొన్ని బ్లూచిప్ కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు నిస్తేజంగా ఉండటం, మదుపుదారులు అమ్మకాలతో లాభాల స్వీకరణకు భారీగా ఒడిగట్టడంతో సెనె్సక్స్ వంద పాయింట్లు కోల్పోయి 32,508.42 పాయింట్ల వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మిశ్రమ పరిణామాలే చోటుచేసుకున్నాయి.

10/18/2017 - 22:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ప్రారంభించిన ఆరు నెలల్లోనే పేటియం ద్వారా 120 కోట్ల రూపాయల మేర బంగారం లావాదేవీలు జరిగాయని, దంతేరాస్ రోజున తమ ద్వారా ఈ కొనుగోళ్లు చేసిన వారి సంఖ్య పది లక్షలు దాటిందని మొబైల్ వాలెట్ కంపెనీ పేటియం బుధవారం తెలిపింది. దంతేరాస్ రోజున తమ ద్వారా బంగారం అమ్మకాలు 12 శాతం పెరిగాయని వెల్లడించింది.

10/18/2017 - 22:48

లక్నో, అక్టోబర్ 18: ఓ పక్క పెద్దనోట్ల రద్దు, మరోపక్క జిఎస్‌టి అమలుతో వ్యాపారపరంగా తీవ్రస్థాయిలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న కార్పొరేట్ సంస్థలు సిబ్బందికి గిఫ్టులను ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన బడ్జెట్‌ను 35 నుంచి 40 శాతం వరకు కుదించుకున్నాయని, అందుకే ఈసారి దీపావళి బహుమతులు పేలవంగానే ఉండే అవకాశం ఉందని అసోచామ్ వెల్లడించింది.

10/18/2017 - 22:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన వౌలికమైన ప్రశ్నలు, సందేహాలు తీర్చేందుకు ఆదాయపు పన్ను విభాగం కొత్తగా ఆన్‌లైన్ చాట్ సర్వీసును ప్రవేశపెట్టింది. దీనిద్వారా ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన అన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు, సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుందని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.

10/18/2017 - 22:47

తిరుపతి, అక్టోబర్ 18: ఇండిగో విమానయాన సంస్థ ప్రాంతీయ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు ఆదిత్యఘోష్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటి వరకు తన ఏటిఆర్ పనితీరును హైదరాబాదు, చెన్నయ్, బెంగళూరు, మంగళూరు, మధురై, నాగ్‌పూర్ మధ్యతోపాటు టూ టయర్ నగరాలైన తిరుపతి, రాజమండ్రిల మధ్య విమానాలు నడుపుతున్నట్లు వివరించారు.

10/18/2017 - 22:44

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: తామున్న ప్రాంతం గురించి, స్థలం గురించి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేసేందుకు దోహదం చేసే ఒక కొత్త ఫీచర్‌ను వాట్సప్ ప్రవేశపెట్టింది. దీనిద్వారా తాము ఎక్కడున్నామనే విషయాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేసే అవకాశం ఉంటుందని ‘లైవ్ లొకేషన్’ పేరుతో అందుబాటులోకి వచ్చే ఈ కొత్త ఫీచర్ అనేక రకాలుగా వినియోగదారులకు ఉపయోగపడుతుందని తెలిపింది.

10/18/2017 - 22:44

ఒంగోలు, అక్టోబర్ 18: ఒంగోలులోని పయనీరు హోండా షోరూం లో కొత్త స్కూటర్ హోండా క్లిక్యూ ను బుధవారం డిఎస్‌పి గుంటుపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లిక్యూ స్కూటర్ గురించి షోరూమ్ అధినేత చెన్నుపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ దీనిలో రెండు రకాలు స్టాండర్డ్, డీలర్ (విత్ గ్రాఫిక్స్), నాలుగు రంగులు ఎరుపు, బ్లూ, నలుపు, గ్రే కలరు కలిగినవి ఉన్నట్లు తెలిపారు.

Pages