S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/17/2017 - 00:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: దేశీయ టెలికామ్ సంస్థల్లో అతిపెద్దదైన భారతీ ఎయిర్‌టెల్ తన ఆన్‌లైన్ స్టోర్ ద్వారా యాపిల్ ఐఫోన్-7, ఐఫోన్-7 ప్లస్ హ్యాండ్‌సెట్లను సులభ వాయిదాల పద్ధతిలో అమ్ముతోంది. సోమవారం నుంచి ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 32జీబీ స్టోరేజి సామర్ధ్యాన్ని కలిగివున్న ఐఫోన్-7ను కొనుగోలు చేయదలుచుకున్న వారు 7,777 రూపాయల డౌన్ పేమెంట్‌ను చెల్లించి ఈ హ్యాండ్‌సెట్లను పొందవచ్చు.

10/17/2017 - 00:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఐదు నెలల్లో (ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు) ప్రవాస భారతీయుల నికర డిపాజిట్లు గణనీయంగా 98 శాతం తగ్గాయి. చమురు ధరల్లో ఒడిదుడుకులే ఇందుకు ప్రధాన కారణమని, దీంతో గత ఏడాది తొలి ఐదు నెలల్లో 3.84 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రవాస భారతీయుల డిపాజిట్లు ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 434 మిలియన్ డాలర్లకు పడిపోయాయని అసోచామ్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

10/17/2017 - 00:09

విజయవాడ, అక్టోబర్ 16: ఆహార ఉత్పత్తిలో అగ్రపథాన ఉన్న భారతదేశం పౌష్టికాహార లోపాన్ని ఎదుర్కోవడం విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పెద్దఎత్తున ఉద్యాన పంటలు సాగవుతున్నా తగినంత సంఖ్యలో ఆహారశుద్ధి పరిశ్రమలు లేకపోవడమే దీనికి కారణమని చెప్పారు. ఆహారశుద్ధి రంగంలో ప్రసిద్ధి చెందిన 23 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టామని అన్నారు.

10/16/2017 - 00:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: జిఎస్‌టి కాంపోజిషన్ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఇటీవల ఏర్పాటైన మంత్రుల గ్రూపు (జిఓఎం) కేవలం వారం రోజుల వ్యవధిలోనే తొలి సమావేశాన్ని నిర్వహించింది.

10/16/2017 - 00:38

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఇటు నిఫ్టీ, అటు సెనె్సక్స్ మరింత బలాన్ని పుంజుకోవడం, అలాగే ఇతరత్రా చోటుచేసుకున్న సానుకూల పరిణామాల నేపథ్యంలో కొత్త వారంలో మార్కెట్ మరింతగా పరుగులుపెట్టే అవకాశం కనిపిస్తోంది. యాక్సిస్ బ్యాంక్, విప్రో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్‌ను కొత్త మలుపు తిప్పగలవని నిపుణలు చెబుతున్నారు.

10/16/2017 - 00:37

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థం (ఏప్రిల్-సెప్టెంబర్)లో బంగారం దిగుమతులు రెండు రెట్లకు పైగా పెరిగి 16.95 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. కేంద్ర వాణిజ్య శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బంగారం దిగుమతులు దేశ కరెంటు ఖాతా లోటు (సిఎడి)పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్న విషయం తెలిసిందే.

10/16/2017 - 00:36

మదనపల్లె, అక్టోబర్ 15: చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాల్లో సాగు చేస్తున్న టమోటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత వారం రోజులుగా కిలో టమోటా రూ.25 నుంచి రూ.30లు పలుకుతుండగా ఆదివారం ఏకంగా 40 రూపాయలు పలికింది. గత సెప్టెంబర్ చివరి వరకు ధరలు తగ్గుముఖం పట్టి మరలా యథాస్థితికి చేరుకోవడం తర్వాత ధరలు తగ్గింది లేదు.

10/16/2017 - 00:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: రియల్ ఎస్టేట్ రంగాన్ని వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తీసుకురావాలని మరోసారి డిమాండ్ చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఆదివారం లేఖ రాశారు. దేశంలో జిఎస్‌టి అమలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ డిమాండ్ చేస్తున్న సిసోడియా, ఇప్పుడు అదే డిమాండ్‌ను మరోసారి పునరుద్ఘాటించారు.

10/16/2017 - 00:32

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: దేశీయ టెలికామ్ మార్కెట్‌లో పెను సంచలనాలను సృష్టిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) దీపావళి పండుగ తర్వాత మళ్లీ జియోఫోన్ బుకింగ్‌లను ప్రారంభించనుంది.

10/16/2017 - 00:30

హైదరాబాద్, అక్టోబర్ 15: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగర కేంద్రంగా పని చేస్తున్న ఆరు సంస్థలు కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తమ సంస్థలను నెలకొల్పి పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తీకరిస్తూ లేఖలు ఇచ్చాయని తెలంగాణ రాష్ట్ర సమితి ఆస్ట్రేలయా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Pages