S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/10/2017 - 00:47

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఈసారి కూడా దేశ రాజధాని నగరంలో దీపావళి వెలుగులు కనిపించే అవకాశం లేదు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సిఆర్) పరిధిలో బాణాసంచా విక్రయాన్ని నిలిపివేస్తూ గత ఏడాది నవంబర్‌లో తీసుకున్న నిర్ణయాన్ని అక్టోబర్ 31 వరకూ పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం నిర్ణయించింది. న్యాయమూర్తి ఎ.కె.సిక్రీ సారథ్యంలోని ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

10/10/2017 - 00:47

వడోదర, అక్టోబర్ 9: గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (జిఎన్‌ఎఫ్‌సి) తన వేప ఆధారిత ఉత్పత్తుల ద్వారా రానున్న మూడేళ్లలో తన వ్యాపార మొత్తాన్ని (టర్నోవర్‌ను) రూ. 500 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సోమవారం తెలిపింది.

10/10/2017 - 00:46

హైదరాబాద్, అక్టోబర్ 9: వినియోగదారులకు నిత్యం నాణ్యమైన ఉత్పత్తులను అందించే డాబర్ ఇండియా ఏడు వనమూలికలతో కూడిన వాటికా కొబ్బరి నూనెను అందుబాటులోకి తెచ్చింది. సోమవారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ హెడ్ రజత్ నందా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు.

10/10/2017 - 00:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ (ఐఇఇ) జారీ చేసిన ఐపిఒ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)లో బిడ్డింగ్ తొలి రోజయిన సోమవారం 15 శాతాన్ని సాధించింది. రూ. 1,001 కోట్లు సమీకరించేందుకు 60,65,009 షేర్ల విక్రయానికి ఇష్యూ జారీ చేయగా, సోమవారం 6,53,022 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఐఇఇ జారీ చేసిన ఐపిఒ ద్వారా ఒక్కో షేర్ ధర శ్రేణిని రూ. 1,645- 1,650గా నిర్ణయించింది. ఈ ఐపిఒ గడువు బుధవారంతో ముగియనుంది.

10/09/2017 - 00:39

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: రెస్టారెంట్లకు విధించిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రేట్లను సమీక్షించడంతో పాటు కాంపోజిషన్ స్కీమ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు జిఎస్‌టి కౌన్సిల్ అస్సాం ఆర్థిక శాఖ మంత్రి హిమంత్ బిశ్వ శర్మ సారథ్యంలో మంత్రుల గ్రూపు (జిఓఎం)ను ఏర్పాటు చేసింది.

10/09/2017 - 00:37

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: జిఎస్‌టి విషయంలో కేంద్రం కల్పించిన ఊరట, అలాగే ఐటి దిగ్గజం టిసిఎస్ ఆదాయం పెరగడం, ఐపిపి పుంజుకోవడం, ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా సానుకూలంగా ఉన్న నేపథ్యంలో వచ్చే వారం మార్కెట్ మరింత వేగాన్ని సంతరించుకుని కొత్త పుంతలు తొక్కే అవకాశం కనిపిస్తోంది.

10/09/2017 - 00:37

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: బంగారం కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను మరింత పారదర్శకంగా మార్చి, వాటిని అధికార వర్గాలు సులభంగా గుర్తించేలా వీలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో స్పష్టమైన విధానాలను ప్రకటించనుంది.

10/09/2017 - 00:35

వాషింగ్టన్, అక్టోబర్ 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి), పెద్ద నోట్ల రద్దు లాంటి సంస్కరణలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.

10/09/2017 - 00:34

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: అంతర్జాతీయ టెక్ దిగ్గజం, ఐఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ భారత్‌లో తమ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు కొన్ని రాయితీలను కోరుతోందని, ఈ రాయితీలకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని డిఐపిపి (పారిశ్రామిక విధాన, అభివృద్ధి విభాగం) కార్యదర్శి రమేష్ అభిషేక్ వెల్లడించారు. దేశంలో ఇప్పటికే 90 మొబైల్ సంస్థలు హ్యాండ్‌సెట్లను తయారు చేస్తున్నాయని ఆయన తెలిపారు.

10/09/2017 - 00:32

కొత్తగూడెం, అక్టోబర్ 8: మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యుత్తమ ఫలితాలు సాధిస్తోంది. దేశంలో ఎంపిక చేయబడ్డ అత్యుత్తమ 25 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సింగరేణి థర్మల్ కేంద్రం ఎనిమిదో ర్యాంకు సాధించింది. గత ఆరునెలల కాలంలో అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పిఎల్‌ఎఫ్) సాధించిన థర్మల్ కేంద్రాలను పరిశీలించగా, తొలి 25 కేంద్రాల్లో సింగరేణికి చోటు లభించింది.

Pages