S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/06/2017 - 00:56

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: రైల్వేల ఆధునీకరణ కోసం ట్రాకులను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం త్వరలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తుందని, దీని ద్వారా ఏడాది వ్యవధిలో 10 లక్షల ఉద్యోగాలను సృష్టించేందుకు వీలుంటుందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పష్టం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో భారత ఆర్థిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా గురువారం న్యూఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

10/06/2017 - 00:54

భీమవరం, అక్టోబర్ 5: మత్య్స ఉత్పత్తుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌ఎఫ్‌డిబి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాణికుముదిని అన్నారు. ఆక్వా సాగులో నిషేధించిన యాంటీ బయోటిక్స్ వినియోగానికి రైతులు దూరంగా ఉండాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో గురువారం ఆమె పర్యటించారు.

10/06/2017 - 00:52

హైదరాబాద్, అక్టోబర్ 5: దేశంలోనే రెండో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ హుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన ‘నెక్స్‌ట్ జెన్ వెర్నా’ సెడాన్‌కు విపరీతమైన స్పందన లభించింది. గడచిన 40 రోజుల్లో 15 వేల కార్లు కొనుగోలుకు నమోదు కాగా, 1,24,000 ఎంక్వయిరీలు వచ్చాయని హుందాయ్ మోటార్స్ ఎండి, సిఈఓ వైకె కూ వెల్లడించారు.

10/06/2017 - 00:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చి, ఉద్యోగాలను సృష్టించేందుకు ఆర్థికపరమైన రాయితీలను ఇవ్వడంతో పాటు విధానపరమైన చర్యలను చేపట్టేందుకు ఆర్థిక శాఖతో పాటు ఇతర మంత్రిత్వ శాఖలతో కలసి పనిచేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు వెల్లడించారు.

10/06/2017 - 00:51

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: దేశంలోని ఆటోమొబైల్ సంస్థల్లో అతిపెద్దదైన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) లిమిటెడ్ గురువారం సరికొత్త వెర్షన్ ‘సెలెరియో’ హ్యాచ్‌బ్యాక్ కారును మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.4.15 లక్షల నుంచి రూ.5.34 లక్షల మధ్య నిర్ణయించారు.

10/06/2017 - 00:50

ముంబయి, అక్టోబర్ 5: విలాసవంతమైన కార్లను తయారు చేయడంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఖ్యాతి పొందిన జర్మన్ ఆటోమొబైల్ సంస్థ ఆడీ గురువారం భారత్‌లో ఎ-5 స్పోర్ట్‌బ్యాక్, ఎ-5 కాబ్రియోలెట్, ఎస్-5 స్పోర్ట్‌బ్యాక్ పేర్లతో మూడు కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఆ సంస్థ మన దేశంలో తమ వాహనాల పోర్ట్ఫులియోను మరింత విస్తరించింది.

10/05/2017 - 21:14

కాకినాడ, అక్టోబర్ 4: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌జిజిఎస్) పనుల గ్రౌండింగ్‌లో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాకు ప్రథమ స్థానం లభించింది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఉపాధి హామీ పనులను జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా ఈ రికార్డు లభించింది. రాష్ట్రంలో భౌగోళికంగా పెద్ద జిల్లాగా, వ్యవసాయపరంగా అగ్రస్థానంలో ఉన్న తూర్పు గోదావరిలో ఉపాధి హామీ పథకం ఆరంభం నుండి పనులు భారీగానే జరుగుతున్నాయి.

10/05/2017 - 01:19

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: అతి పెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బిఐ కొత్త చైర్మన్‌గా రజనీష్‌కుమార్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎస్‌బిఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన రజనీష్‌కుమార్‌కు పేరుకుపోయిన రానిబాకీల సమస్య ఓ పెద్ద సవాలుగా మారబోతోంది. అక్టోబర్ 7న చార్జి తీసుకున్న నాటినుంచి మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు సిబ్బంది శిక్షణా వ్యవహారాల విభాగం బుధవారం ఓ ప్రకటన జారీచేసింది.

10/05/2017 - 01:18

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఇంధన రంగంలోనూ, స్మార్ట్‌సిటీల నిర్మాణంలోనూ భారత్‌తో తమ సాంకేతిక విజ్ఞానాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఫిన్లాండ్ ప్రకటించింది. బుధవారం ఇక్కడ ఇరు దేశాల వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులనుద్దేశించి మాట్లాడిన ఫిన్లాండ్ ఇంధన గృహనిర్మాణ మంత్రి కిమ్మో తిలికైనన్ భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటని అభివర్ణించారు.

10/05/2017 - 21:10

హైదరాబాద్, అక్టోబర్ 4: కోమియో ఇండియా తన నాల్గవ స్మార్ట్ఫోన్ సి2ను బుధవారం మార్కెట్‌లో విడుదల చేసింది. అన్నీ ఒకే హ్యాండ్‌సెట్‌లో పొందుపరిచిన సి2 శక్తివంతమైన బ్యాటరీ, సెక్యూరిటీ ప్రత్యేకతలు, స్క్రాచ్ రహిత బ్యాక్ కవర్, అసాధారణ మ్యూజిక్ నాణ్యతతో అందుబాటులోకి తెచ్చామని ఆ సంస్ధ డైరెక్టర్ సంజయ్ కుమార్ కలిరోనా తెలిపారు. తమ సంస్ధకు న్యూ ఢిల్లీలో ప్రధాన కార్యాలయం ఉందని చెప్పారు.

Pages