S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/05/2017 - 01:13

ముంబయి, అక్టోబర్ 4: మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా రిజర్వుబ్యాంక్ పరపతి విధానాన్ని ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో కొత్త ఉత్సాహం నెలకొంది. వరుసగా నాలుగో రోజు కూడా మార్కెట్ పుంజుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్లు బాగా బలపడ్డాయి. స్వదేశీ సంస్థాగత ఇనె్వస్టర్లు కూడా గుణాత్మక రీతిలో మార్కెట్‌కు ఊతాన్ని ఇచ్చారు.

10/05/2017 - 21:10

భీమవరం, అక్టోబర్ 4: సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధిసంస్థ (ఎంపెడా)లో కీలకమైన మార్కెటింగ్ విభాగానికి నేతృత్వం వహించే అవకాశం తొలిసారిగా తెలుగువారికి దక్కింది. దేశీయంగా జరిగే ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌దే సింహభాగం అనేది అందరికీ తెలిసిందే.

10/05/2017 - 21:11

హైదరాబాద్, అక్టోబర్ 4: కంపెనీ సెక్రటరీలు దేశ ఆర్థికాభివృద్ధికి పాటుపడాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గతంలో కన్నా ప్రస్తుతం కంపెనీల సెక్రటరీల అవసరం పెరిగిందని, కార్పొరేటీకరణ ఊపందుకోవడంతో వీరికి ప్రాధాన్యత బాగా పెరిగిందని ఆయన అన్నారు. బుధవారం నాడిక్కడ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో కడియం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

10/05/2017 - 01:07

ముంబయి, అక్టోబర్ 4: ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం ద్రవ్య పరపతి విధానాన్ని సమీక్షించిన రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. రెపో రేటును ప్రస్తుతం ఉన్నట్టుగా ఆరు శాతంగానే కొనసాగించాలని, అలాగే రివర్స్ రెపో, సిఆర్‌ఆర్ రేట్లనూ 5.74, 4శాతానికే పరిమితం చేయాలని సంకల్పించింది.

10/05/2017 - 21:39

ముంబయి, అక్టోబర్ 3: దేశ ద్రవ్య విధానంపై సమీక్ష జరిపేందుకు రెండు రోజుల పాటు జరుపనున్న చర్చలను రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) మంగళవారం ముంబయిలో ప్రారంభించింది.

10/04/2017 - 00:14

సింగపూర్, అక్టోబర్ 3: జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే ఆసియా ఖండంలోని నగరాల్లో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు రోజు రోజుకూ మరింతగా పెరుగుతుండటం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని, ఇది సామాజిక విభజనలకు దారితీసే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు మంగళవారం హెచ్చరించింది. పట్టణ ప్రాంతాల్లోని పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు విజ్ఞప్తి చేసింది.

10/04/2017 - 00:12

214 పాయింట్లు పెరిగిన సెనె్సక్స్
9,800 పాయింట్లు దాటిన నిఫ్టీ

10/04/2017 - 00:10

లండన్, అక్టోబర్ 3: మనీ లాండరింగ్ కేసులో ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను బ్రిటన్‌లో అరెస్టు చేశారు. ఈ ఏడాది ఆయనను అరెస్టు చేయడం ఇది రెండోసారి. విజయ్ మాల్యాను అప్పగించాలని భారత్ చేసిన విజ్ఞప్తి మేరకు ఏప్రిల్‌లో బ్రిటన్ అధికారులు ఆయనను మరో కేసులో అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ అరెస్టు జరిగిన కొద్దిసేపటికే బెయిలుపై బయటికి వచ్చిన విజయ్ మాల్యాను ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేశారు.

10/03/2017 - 00:22

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ గుజరాత్‌లోని సనంద్ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ ఇంజన్‌తో నడిచే కాంపాక్ట్ సెడాన్ ‘టైగొర్’ కార్లను ఉత్పత్తి చేయనుంది. 10 వేల ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేయాల్సిందిగా ప్రభుత్వ రంగ సంస్థ ఇఇఎస్‌ఎల్ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) నుంచి రూ.1,120 కోట్ల ఆర్డర్ రావడంతో టాటా మోటార్స్ ఈ వాహనాలను ఉత్పత్తి చేయనుందని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.

10/03/2017 - 00:21

ముంబయి, అక్టోబర్ 2: వ్యాపార రంగంలో భారతదేశం ఇటీవల సాధించిన విజయాలు అనూహ్యమైన ఆర్థిక ఫలితాలను అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా అన్ని రంగాల్లోనూ చైనాతో పోటీపడుతున్న భారత్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్యవేత్తలను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా 2017 సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు ఆధిక్యంలో ఉన్న చైనాను అధిగమించి రిటైల్ రంగంలో తిరుగులేని స్థానాన్ని సంతరించుకుంది.

Pages