S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/08/2017 - 00:48

దేశీయ ద్విచక్ర వాహన తయారీదారు టివిఎస్ మోటార్ కంపెనీ.. గురువారం సరికొత్త విక్టర్ ప్రీమియం ఎడిషన్‌ను పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 55,065 రూపాయలు. 110సిసి సామర్థ్యంతో దీన్ని తీసుకువచ్చినట్లు సంస్థ మార్కెటింగ్
ఉపాధ్యక్షుడు అనిరుద్ధా హల్దార్ తెలిపారు. భారతీయ ద్విచక్ర వాహన (మోటార్‌సైకిల్, స్కూటర్) మార్కెట్‌లో

09/08/2017 - 00:46

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: వాహన తయారీదారులు.. ముఖ్యంగా కార్ల తయారీ సంస్థలు పర్యావరణహిత వాహనాలను తయారుచేయాలని, ప్రస్తుతం తీసుకొస్తున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఆధారిత వాహనాల ఉత్పత్తిని నిలిపివేసే దిశగా వడివడిగా అడుగులు వేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పిలుపునిచ్చారు. ఆటో రంగ సమాజం సియామ్ వార్షిక సదస్సులో ఆయన పాల్గొని పైవిధంగా స్పందించారు.

09/08/2017 - 00:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. గురువారం పిఎసిఎల్ లిమిటెడ్, దాని నలుగురు డైరెక్టర్లపై 2,423 కోట్ల రూపాయల జరిమానాను విధించింది. వివిధ పథకాల పేరిట ప్రజల నుంచి 49 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులను అక్రమంగా సేకరించడంతో సెబీ కనె్నర్ర చేసింది.

09/08/2017 - 00:45

ముంబయి, సెప్టెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ అతి స్వల్పంగా 0.77 పాయింట్లు పెరిగి 31,662.74 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 13.70 పాయింట్లు అందుకుని 9,929.90 వద్ద నిలిచింది.

09/07/2017 - 01:51

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6:రద్దయిన డొల్ల కంపెనీల డైరెక్టర్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఈ సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి నిధులను మళ్లించేందుకు ప్రయత్నిస్తే పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ కంపెనీల నిధులను మళ్లించే ప్రయత్నం చేసే సంబంధిత డైరెక్టర్లు, అధికారులకు ఆర్నెల్లకు తగ్గకుండా పదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఓ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది.

09/07/2017 - 01:50

హైదరాబాద్, సెప్టెంబర్ 6: తెలంగాణ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఎకాఎకిన 20 లక్షల హెక్టార్లలో రైతులు పత్తిపంట వేయడంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లాలు, గ్రామాల వారీగా పత్తిపంట వేసిన రైతుల వివరాలు సేకరించాలని రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వచ్చే అక్టోబర్ నుంచి పత్తిపంట ఉత్పత్తి మార్కెట్‌కు వస్తుంది.

09/07/2017 - 01:50

ముంబయి, సెప్టెంబర్ 6: అణుపరీక్షకు సంబంధించి అమెరికా, ఉత్తర కొరియాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం బుధవారం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. అమ్మకం వత్తిడిని తట్టుకోలేక అనేక కీలక షేర్లు నష్టాలబారిన పడ్డాయి. గత వారంలో ఎన్నడూ లేని విధంగా సెనె్సక్స్ నష్టపోయింది. అలాగే అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే భారత రూపాయి మూడువారాల కనిష్ఠానికి చేరుకుంది.

09/07/2017 - 01:49

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: ప్రజల నుంచి అక్రమంగా 1,200 కోట్ల రూపాయల నిధులను సమీకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది బ్రోకరేజి సంస్థలను సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా) పదేళ్ల పాటు స్టాక్ మార్కెట్ల నుంచి నిషేధించింది.

09/07/2017 - 01:49

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఎస్‌యువి ‘నెక్సాన్’ వాహన అమ్మకాలకు వచ్చే వారం నుంచి బుకింగ్‌లు మొదలు కానున్నాయి.

09/06/2017 - 01:04

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కంపెనీల రిజిష్ట్రార్ జాబితా నుండి తొలగించిన 2లక్షల 90వేల 32ఖాతాల లావాదేవీలపై ఆంక్షలు విధించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్ని బ్యాంకులను ఆదేశించారు. కంపెనీలకు రుణాలు మంజూరు చేసే విషయంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా ఆయన బ్యాంకులకు సూచించారు. కంపెనీలకు రుణాలు మంజూరుచేసే సమయంలో బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Pages