S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/06/2017 - 01:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: దేశంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఇటు వినియోగదారులకు, అటు వర్తకులకు పన్నుల పరంగా లబ్ధితోపాటు ఇతర ప్రోత్సాహకాలను అందించాలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సిఏఐటి) మంగళవారం సూచించింది.

09/06/2017 - 01:01

హైదరాబాద్, సెప్టెంబర్ 5: లక్ష్మీ విలాస్ బ్యాంకుకు ఉత్తమ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుగా అవార్డు లభించింది. ఈ అవార్డును ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో ఆ బ్యాంకు రిటైల్ విభాగం అధ్యక్షుడు ఏజె విద్యాసాగర్ అందుకున్నారు. ఈ అవార్డును రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇచ్చినందుకు అవార్డు లభించినట్లు ఆ బ్యాంకు తెలిపింది.

09/06/2017 - 01:00

హైదరాబాద్,సెప్టెంబర్ 5: వచ్చే మూడేళ్లలో ఎంటర్‌ప్రైజ్‌సొల్యూషన్స్‌లో రూ.150 కోట్ల రెవెన్యూను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బోద్‌ట్రీ సంస్ధ ప్రకటించింది.

09/06/2017 - 01:00

హైదరాబాద్, సెప్టెంబర్ 5: కరూర్ వైశ్యాబ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారిగా పిఆర్ శేషాద్రి నియమితులయ్యారు. రిటైల్ కమర్షియల్ బ్యాంకింగ్‌లో ఆయను 25 సంవత్సరాల అనుభవం ఉంది. 1992లో సిటీ బ్యాంక్‌లో ఆయన ఉద్యోగంలో చేరారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి సిటీ ఫైనాన్షిల్ కంజ్యూమర్ ఫైనాన్స్ సంస్ధ ఎండిగా పనిచేశారు. ఆసియా పసిఫిక్ సిటీ బ్యాంక్ ఎండిగా మపనిచేశారు.

09/06/2017 - 00:59

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన వృద్ధి యంత్రాలుగా ఎరువులు, ఫార్మా, రసాయన ఫార్మాస్యూటికల్ రంగాలు పనిచేస్తున్నాయని, వీటి మొత్తం టర్నోవర్ 13.5 లక్షల కోట్ల రూపాయలని రసాయన ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంలో ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ అత్యంత కీలకమైన భూమిక పోషిస్తోందని తెలిపారు.

09/06/2017 - 00:59

ముంబై, సెప్టెంబర్ 5:ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పరీక్షతో సోమవారం భారీగా పడ్డ సెనె్సక్స్ మంగళవారం భారత్-చైనా మధ్య చోటుచేసుకున్న సరికొత్త సయోధ్యతో బలంగా పుంజుకుంది. మంగళవారం జరిగిన లావాదేవీల్లో వివిధ దశల వద్ద ఊగిసలాడిన సెనె్సక్స్ 107.3 పాయింట్లు పుంజుకుని 31,809.55 వద్ద ముగిసింది. అనేక సానుకూల పరిణామాలు సెనె్సక్స్ పుంజుకోవడానికి దోహదం చేశాయి.

09/06/2017 - 00:58

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: భారత ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన జిఎస్‌టి విధానం వల్ల వరుసగా రెండో నెలలో కూడా సేవా రంగం నత్తనడక నడుస్తున్నట్లుగా తాజాగా జరిపిన సర్వేలో స్పష్టమైంది. జిఎస్‌టి కారణంగా ఇటు వ్యాపార కార్యకలాపాలు, కొత్త వర్క్ ఆర్డర్లు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఈ సర్వే తెలిపింది. ముఖ్యంగా జూలై నెల కంటే కూడా ఆగస్టు నెలలో వ్యాపార ఆర్డర్లు, ఉద్యోగాల రేటు మందగించినట్లుగా ఈ సర్వే తెలిపింది.

09/06/2017 - 00:58

కాకినాడ, సెప్టెంబర్ 5: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరంలో ఆంధ్రప్రదేశ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల వౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలుచేపట్టింది. ఎపి పెట్రోకెమికల్ ప్రాజెక్టును గెయిల్, హెచ్‌పిసిఎల్, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సంయుక్తంగా ఏర్పాటుచేయనున్నాయి.

09/06/2017 - 00:57

అనంతపురం, సెప్టెంబర్ 5: వరుణుడు కరుణించకపోవడంతో సీమ జిల్లాల రైతాంగం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. వానలు కురుస్తాయని, ఏదో ఒక పంట సాగు చేసి కొంతైనా గత ఏడాది చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న వారి ఆశలు ఆవిరైపోయాయి. రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లో తీవ్ర వర్షాభావంతో రైతాంగం దయనీయ పరిస్థితిని అనుభవిస్తోంది.

09/06/2017 - 00:55

హైదరాబాద్, సెప్టెంబర్ 5: ఈనెల 8 నుంచి హైటెక్‌సిటీ మాదాపూర్‌లో మూడవ ఇండస్ట్రియల్ ఎక్స్‌పో జరుగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ఎఫ్‌టిఏపిసిసిఐ అధ్యక్షుడు గౌర శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎక్స్‌పోను ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శన ఉ.గం. 11:00 నుంచి సా.గం. 7:00ల వరకు తెరచి ఉంటుంది.

Pages