S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/22/2017 - 02:55

హైదరాబాద్, ఆగస్టు 20: అనుసంధానిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో అగ్రగామి సంస్థగా పేరొందిన కాల్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. కాల్‌హెల్త్-హెల్త్‌కేర్ లాంజ్ ను హైదరాబాద్‌లోని ఐటి అనుబంధ రంగాల వ్యాపార కేంద్రం గచ్చిబౌలిలోని ఫోనిక్స్ అవాన్స్ సెజ్ వద్ద ప్రారంభించింది.

08/20/2017 - 23:48

కొవ్వూరు, ఆగస్టు 20: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని ఓ హెయిర్ ప్రాసెసింగ్ యూనిట్‌లో ఆదివారం ఉదయం సంభవించిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. సుమారు 6 కోట్ల రూపాయల విలువైన జుత్తు కాలిపోయిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.

08/20/2017 - 23:46

ముంబయి, ఆగస్టు 20: హైదరాబాద్ ఆధారిత ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్.. విస్తరణ బాట పట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉడాన్ పథకంలో భాగంగా మరిన్ని ప్రాంతాలకు విమాన సర్వీసులను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మార్చికల్లా తమ విమానాల సంఖ్యను ఎనిమిదికి పెంచుకోవాలని చూస్తున్న ట్రూజెట్.. ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు దాదాపు 50 విమానాలు తిరిగేలా ప్రణాళికలు వేస్తోంది.

08/20/2017 - 23:44

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశవ్యాప్తంగా మంగళవారం బంద్ కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న బ్యాంకుల విలీనంపై నిరసనగా, ఇతరత్రా డిమాండ్ల సాధన కోసం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఈ బంద్‌కు పిలుపునిచ్చింది. 9 బ్యాంక్ ఉద్యోగుల సంఘాలకు యుఎఫ్‌బియు నాయకత్వం వహిస్తోంది.

08/20/2017 - 23:44

గోదావరిఖని, ఆగస్టు 20: సింగరేణి బొగ్గు గని కార్మికులకు పదవ వేతన ఒప్పందంలో అన్యాయం చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, 4 శాతం స్పెషల్ అలవెన్సుతో కలిపి వేత న ఒప్పందం చెల్లింపులు జరగాలని, లేకుంటే మిగతా జాతీయ సంఘాలను కలుపుకొని దేశవ్యాప్త సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ఎఐటియుసి కేంద్ర ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య హెచ్చరించారు.

08/20/2017 - 23:42

న్యూఢిల్లీ, ఆగస్టు 20: దేశీయ స్టాక్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరులు (ఎఫ్‌పిఐ) క్రమేణా దూరమైపోతున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్ల నుంచి 7,344 కోట్ల రూపాయల (1.14 బిలియన్ డాలర్లు) విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. దేశీయంగా ఉన్న పలు ఆందోళనలతోపాటు అంతర్జాతీ య స్థాయలో నెలకొన్న విపత్కర పరిస్థితుల మధ్య విదేశీ మదుపరులు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారు.

08/20/2017 - 00:53

ముంబయి, ఆగస్టు 19: కొత్త దివాళా చట్టం రుణ గ్రహీతలకు-రుణ దాతలకు మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఎన్‌పిఎ రెజల్యూషన్ (నిరర్థక ఆస్తులు లేదా మొండి బకాయిల తీర్మానం) అనేది అప్పుల్లో కూరుకుపోయిన సంస్థల నగదీకరణకే కాకుండా, సదరు సంస్థల యాజమాన్యాన్ని రక్షిస్తుందని అన్నారు.

08/20/2017 - 00:51

కొత్తగూడెం, ఆగస్టు 19: సింగరేణి కాలరీస్ సంస్థ గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 395.4 కోట్ల రూపాయల నికర లాభాన్ని పొందింది. 17,853 కోట్ల రూపాయల టర్నోవర్‌ను అందుకుందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) ఎన్ శ్రీ్ధర్ ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ 541వ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2016-17 ఆర్థిక వార్షిక లెక్కలను, ఆమోదం తెలిపిన వివరాలను వెల్లడించారు.

08/20/2017 - 00:49

న్యూఢిల్లీ, ఆగస్టు 19: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రిటర్న్స్ దాఖలు గడువును శనివారం మరో 5 రోజులు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. తీవ్ర రద్దీతో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా జిఎస్‌టిఎన్ పోర్టల్ మొరాయించింది. ఈ క్రమంలోనే ఈ నెల 25 వరకు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఓవర్‌లోడ్‌తో చిన్న సాంకేతిక సమస్య ఎదురైందని జిఎస్‌టిఎన్ చైర్మన్ నవీన్ కుమార్ తెలిపారు.

08/20/2017 - 00:49

న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఇన్ఫోసిస్ బోర్డు షేర్ బైబ్యాక్ ఆఫర్‌ను ఆమోదించింది. 13,000 కోట్ల రూపాయల వరకు ఉన్న ఈ ప్లాన్‌కు శనివారం ఇన్ఫోసిస్ పచ్చజెండా ఊపింది. సంస్థ సిఇఒ విశాల్ సిక్కా శుక్రవారం రాజీనామా చేసిన నేపథ్యంలో బోర్డు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం ఇదే. సిక్కా పనితీరు, ఆయనకు ఇస్తున్న వేతనంపట్ల ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.

Pages