S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/24/2017 - 00:16

న్యూఢిల్లీ, జూలై 23: దేశీయ సంస్థల్లో సిఇఒకు సగటు ఉద్యోగికి మధ్య వేతనాల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. అగ్రశ్రేణి సంస్థల్లో ఈ వ్యత్యాసం గరిష్ఠంగా 1,200 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. స్టాక్ మార్కెట్లలో చేరిన పెద్ద సంస్థల్లో ఉన్నతోద్యోగుల వేతనాలతో క్రిందిస్థాయి ఉద్యోగుల వేతనాలు ఏమాత్రం సరితూగడం లేదు.

07/24/2017 - 00:16

న్యూఢిల్లీ, జూలై 23: దేశ జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2017-18)లో 7.5 శాతంగా నమోదు కావచ్చని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా అంచనా వేశారు. అయినప్పటికీ దేశంలో ఉద్యోగ, ఉపాధి కల్పన పెద్ద సవాల్‌గానే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

07/24/2017 - 00:15

న్యూఢిల్లీ, జూలై 23: కేంద్రంలోని మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా దేశంలో సూపర్ కంప్యూటర్లను తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు దశల్లో వీటి తయారీ ఉంటుందని వారు స్పష్టం చేశారు.

07/24/2017 - 00:15

న్యూఢిల్లీ, జూలై 23: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతు న్నాయ. ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 15,400 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే స్టాక్ మార్కెట్లలోకి కేవలం 2,977 కోట్ల రూపాయల పెట్టుబడులే రాగా, రుణ మార్కెట్లలోకి మాత్రం 12,371 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయ.

07/23/2017 - 03:22

న్యూఢిల్లీ, జూలై 22: పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నిర్ణయాలతో నగదు లావాదేవీలు కష్టతరమైపోయాయని, పన్ను ఎగవేతలకూ ఇక అవకాశం లేకుండా పోయిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.

07/23/2017 - 00:28

న్యూఢిల్లీ, జూలై 22: పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బయటపడిన అక్రమ సంపద విలువ 5 వేల కోట్ల రూపాయలపైనే ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్లమెంట్‌కు లిఖితపూర్వక సమాధానంగా శుక్రవారం తెలిపారు.

07/23/2017 - 00:27

హైదరాబాద్, జూలై 22: తెలంగాణలోని పారిశ్రామిక వాడల్లో ఈ నెల 24న 50వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టకుంది టిఎస్‌ఐఐసి. తద్వారా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుదామని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు పిలుపునిచ్చారు. శనివారం బాలమల్లు టిఎస్‌ఐఐసి చేపట్టిన మూడవ విడత హరితహారంపై సమీక్షించారు.

07/23/2017 - 00:26

న్యూఢిల్లీ, జూలై 22: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 21.16 శాతం పెరిగి 372.40 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 307.35 కోట్ల రూపాయలుగా ఉందని తెలిపింది.

07/23/2017 - 00:26

హైదరాబాద్, జూలై 22: జాతీయ స్థాయి వేడుక, 10వ అర్బన్ మొబిలిటీ ఇండియా (యుఎంఐ) సమావేశం ప్రదర్శనకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ ఏడాది నవంబర్ 4 నుంచి హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు ఇప్పటి నుంచే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్ సచివాలంలో శనివారం ఈ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై కీలక సమావేశం నిర్వహించారు.

07/23/2017 - 00:22

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ ప్రభుత్వ అధీనంలోని ‘విజయ’ డెయిరీని 300 కోట్ల రూపాయల పెట్టుబడితో మెగా డెయిరీగా విస్తరిస్తామని రాష్ట్ర పశుసంవర్థక, పాడిపరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలిపారు. విజయ డెయిరీపై శనివారం ఆయన లాలాపేటలోని డెయిరీ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయ డెయిరీపట్ల ప్రజల్లో సంతృప్తి, నమ్మకం ఉన్నాయని గుర్తుచేశారు.

Pages