S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/21/2017 - 00:53

బెంగళూరు, జూలై 20: దేశంలో మూడవ అతిపెద్ద ఐటి సంస్థ అయిన విప్రో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అంచనాలను మించి వృద్ధి సాధించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన రూ. 2076.7 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.2052 కోట్లుగా నమోదై కంపెనీ నికర లాభంతో పోలిస్తే ఇది 1.2 శాతం ఎక్కువ. మరో వైపు కంపెనీ ఒక్కో షేరు రూ. 320 చొప్పున రూ.

07/21/2017 - 00:51

న్యూఢిల్లీ, జూలై 20: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కార్పొరేట్ దిగ్గజం రిలయెన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 28 శాతం పెరిగి రూ. 9,108 కోట్లకు చేరుకొంది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం 7,113 కోట్లు కాగా, అది ఇప్పుడు 28 శాతం పెరిగి రూ. 9,108 కోట్లకు చేరుకొందని రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

07/21/2017 - 00:49

ముంబయి, జూలై 20: రిలయెన్స్ ఇండస్ట్రీస్, విప్రోలాంటి ప్రముఖ కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో గురువారం దేశీయ మార్కెట్ సూచీలు నష్టాల్లో మునిగాయి.

07/21/2017 - 00:49

హైదరాబాద్, జూలై 20: పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య సంస్కరణల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను వేగవంతం చేసేందుకు సెంట్రల్ ఇన్‌స్పెక్షన్ సిస్టమ్ (కేంద్రియ తనిఖీ వ్యవస్ధ) అమలు చేసేందుకు పలు అంశాలను వివరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ పలు ఇతర శాఖలతో సంప్రదించిన అనంతరం ఈ జివో జారీ చేసింది.

07/21/2017 - 00:48

తిరుపతి, జూలై 20: ఆటోమేటిక్ బ్యాటరీ తయారీ సంస్థ అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫస్ట్ అవార్డును 14వ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్‌మెంట్ 2016ను మ్యానిఫ్యాక్చరింగ్ విభాగంలో లభించింది.

07/21/2017 - 00:47

న్యూఢిల్లీ, జూలై 20: సూపర్ బైక్‌ల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి పొందిన ఇటాలియన్ సంస్థ డుకాటీ శనివారం భారత్‌లో స్క్రాంబ్లర్ డెజర్ట్ స్లెడ్ మోడల్ బైక్‌ను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో ఈ బైక్ ప్రారంభ ధరను రూ.9.32 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

07/21/2017 - 00:45

న్యూఢిల్లీ, జూలై 20: ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2017-18) తొలి త్రైమాసికం (క్యూ-1)లో వేదాంత గ్రూపునకు చెందిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్‌జడ్‌ఎల్) నికర లాభం 81 శాతం పెరిగి రూ.1,876 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సర (2016-17) తొలి త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం రూ.1,037 కోట్లుగా నమోదైంది.

07/21/2017 - 00:45

ముంబయి, జూలై 20: దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఐసిఐసిఐ బ్యాంకు తమ ఎటిఎంల ద్వారా ఖాతాదారులకు రూ.15 లక్షల వరకు వ్యక్తిగ రుణాలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గతంలో రుణం కోసం ఎటువంటి దరఖాస్తు చేసుకోకపోయినప్పటికీ ముందుగా ఎంపిక చేసిన కొంత మంది ఖాతాదారులు (వేతనాలు పొందేవారు) ఈ వ్యక్తిగత రుణాలను పొందవచ్చని ఆ బ్యాంకు స్పష్టం చేసింది.

07/21/2017 - 00:44

దేవరపల్లి, జూలై 20: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్‌ఎల్‌ఎస్ పొగాకు రేట్లు రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. కిలోకు నాలుగైదు రూపాయల వంతున పెరుగుదల కనిపిస్తుండటంతో ఒకటి రెండ్రోజుల్లోనే గరిష్ఠ ధర రూ.200కు చేరుకోవచ్చని రైతులు భావిస్తున్నారు. అదే జరిగితే ఐదేళ్ల క్రితం నాటి రికార్డును బ్రేక్‌చేసినట్టే. జిల్లాలోని దేవరపల్లి పొగాకు కేంద్రంలో గురువారం జరిగిన వేలంలో కిలో గరిష్ఠ ధర రూ.197 పలికింది.

07/20/2017 - 03:04

న్యూఢిల్లీ/ముంబయి, జూలై 19: భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల మధ్య ఈ నెల 24న హైదరాబాద్‌లో 16 దేశాల ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) సమావేశం మొదలవుతోంది. అయితే ఈ మెగా ఆసియా వాణిజ్య ఒప్పందం ఈసారి కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో కమ్ముకున్న ఉద్రిక్త వాతావరణమే ఇందుకు కారణం.

Pages