S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/18/2017 - 00:23

న్యూఢిల్లీ, జూలై 17: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అనుబంధ బీమారంగ సంస్థ అయిన ఎస్‌బిఐ లైఫ్.. మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపిఒ) పత్రాలను సమర్పించింది. దాదాపు 6,000-7,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ ఐపిఒకు ఎస్‌బిఐ లైఫ్ వస్తోంది.

07/18/2017 - 00:22

అమరావతి, జూలై 17: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన శ్రీలంక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా సహకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. మరోవైపు శ్రీలంకలో ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

07/18/2017 - 00:20

ముంబయి, జూలై 17: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం మరో సరికొత్త స్థాయిని చేరుకున్నాయి. అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ నూతన ఆల్‌టైమ్ హైని నెలకొల్పాయి. సెనె్సక్స్ 54.03 పాయింట్లు పెరిగి మునుపెన్నడూ లేనివిధంగా 32,074.78 వద్ద ముగియగా, నిఫ్టీ 29.60 పాయింట్లు అందుకుని, తొలిసారిగా 9,900 స్థాయికి ఎగువన 9,915.95 వద్ద నిలిచింది.

07/18/2017 - 00:20

న్యూఢిల్లీ, జూలై 17: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. హైదరాబాద్-పుదుచ్చేరి మధ్య విమాన సేవలను ప్రారంభిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాంతీయ విమాన అనుసంధాన పథకం (ఉడాన్)లో భాగంగా విమానయాన సేవలు లేని దేశంలోని వివిధ నగరాలకు, పట్టణాలకు విమాన సంస్థలు విమానాలను ప్రారంభిస్తున్నది తెలిసిందే.

07/18/2017 - 00:19

భీమవరం, జూలై 17: ఆక్వా రంగానికి ముసురు పట్టింది. ఒడిశా, పశ్చిమ సమీపంలోని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆక్వా రైతులకు శాపంగా మారింది. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇది తీవ్ర అల్పపీడనంగా మారి భారీ వర్షాలు కురువడమేకాకుండ తీరం వెంబడి 50 కిలో మీటర్లు మేర గాలులు వీస్తున్నాయి.

07/18/2017 - 00:17

న్యూఢిల్లీ, జూలై 17: సిగరెట్లపై సెస్సును పెంచుతూ జిఎస్‌టి కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 1న జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత కౌన్సిల్ తొలిసారిగా సోమవారం సమావేశమైంది. జిఎస్‌టిలో సిగరెట్లపై గరిష్ఠంగా 28 శాతం పన్నును విధించినది తెలిసిందే. తాజాగా 5 శాతం సెస్సు పెరిగింది.

07/18/2017 - 00:16

న్యూఢిల్లీ, జూలై 17: సిమెంట్ తయారీ సంస్థ ఎసిసి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 32.57 శాతం పెరిగి 326.23 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఏప్రిల్-జూన్‌లో ఇది 246.07 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆదాయం ఈసారి 3,818.21 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 3,238.69 కోట్ల రూపాయలుగా ఉంది.

07/18/2017 - 00:16

విజయవాడ, జూలై 17: చాలాకాలంగా మూతపడి ఉన్న బజరంగ్ జూట్ మిల్లు ఎట్టకేటలకు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. ఆంధ్ర రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణతో జరిగిన చర్చలు ఫలించడంతో ఆగస్టు 16 నుంచి ప్రారంభించేందుకు యాజమాన్యం అంగీకరించింది. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.

07/18/2017 - 00:15

చిత్రం.. సోమవారం ముంబయలో ఫినో పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభం సందర్భంగా ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి, సిఇఒ చందా కొచ్చర్

07/18/2017 - 00:13

న్యూఢిల్లీ, జూలై 17: దేశీయ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల విలువ ప్రమాదకర స్థాయిలో 8 లక్షల కోట్ల రూపాయలను దాటిపోయిన నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదికపై వారం రోజుల్లోగా స్పందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)కు సుప్రీం కోర్టు గడువిచ్చింది.

Pages