S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/12/2017 - 00:46

న్యూఢిల్లీ, జూలై 11: ‘ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్’ (జిఈఎం) విధానంలో ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాయ. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో జిఈఎంపై రెండు రోజులుగా ఢిల్లీలో వర్క్‌షాప్ జరిగింది. ఈ వర్క్‌షాప్‌కు మంగళవారం ఏపి సాంఘిక, గిరిజన శాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు కూడా హాజరైయ్యారు.

07/12/2017 - 00:45

న్యూఢిల్లీ, జూలై 11: దేశంలోని వస్త్ర వ్యాపారుల ప్రయోజనాలను కాపాడేందుకు వస్త్రాలపై విధించిన 5 శాతం వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ను తొలగించాలని వైఎస్‌ఆర్‌సిపి లోక్‌సభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. సుబ్బారెడ్డి ఈ మేరకు అరుణ్‌జేట్లీకి మంగళవారం ఒక లేఖ రాశారు.

07/11/2017 - 00:29

న్యూఢిల్లీ, జూలై 10: ధిక్కార కేసులో విజయ్ మాల్యా సుప్రీం కోర్టులో మళ్లీ హాజరుకాలేదు. ఈ కేసులో సోమవారం వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ మాల్యాను అత్యున్నత న్యాయస్థానం గతంలో ఆదేశించింది. అయినప్పటికీ ఆయన మాత్రం రాలేదు. దీంతో ఈ కేసు విచారణను జస్టిస్ ఎకె గోయల్, జస్టిస్ యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 14కు వాయిదా వేసింది. అంతేగాక సొలిసిటర్ జనరల్ సాయాన్ని కూడా కోరింది.

07/11/2017 - 01:05

న్యూఢిల్లీ, జూలై 10: ఇకపై పన్ను చెల్లింపులు, శాశ్వత ఖాతా నెంబర్ (పాన్) దరఖాస్తు.. సిబిడిటి మొబైల్ యాప్ ద్వారా చేసేసుకోవచ్చు. సోమవారం ఆదాయ పన్ను శాఖ ఈ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పాన్ కార్డుతో ఆధార్ నెంబర్ అనుసంధానం కూడా ఈ యాప్‌తో ఇట్టే అయిపోతుంది.

07/11/2017 - 00:27

న్యూఢిల్లీ, జూలై 10: తమతమ ఉద్యోగులకు ఆయా సంస్థలు ఇచ్చే నగదు బహుమతులకు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లో మినహాయింపును ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 50,000 రూపాయల వరకు జిఎస్‌టి వర్తించదని పేర్కొంది. అలాగే క్లబుల్లో, హెల్త్, ఫిట్నెస్ సెంటర్లలో సభ్యత్వం ఉచితమని స్పష్టం చేసింది. ఏ సంస్థ అయినాసరే తమ ఉద్యోగులకు క్లబ్, హెల్త్, ఫిట్నెస్ సెంటర్ సభ్యత్వాన్ని అందిస్తే.. అది జిఎస్‌టి పరిధిలోకి రాదని తెలిపింది.

07/11/2017 - 00:25

న్యూఢిల్లీ, జూలై 10: విశాఖపట్నంలోని తమ యూనిట్‌పై అమెరికా హెల్త్ రెగ్యులేటర్ (యుఎస్‌ఎఫ్‌డిఎ) ఇంపోర్ట్ అలర్ట్‌ను ఎత్తివేసిందని ఔషధ రంగ సంస్థ దివీస్ లాబొరేటరీస్ సోమవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది. యూనిట్-2పై విధించిన ఇంపోర్ట్ అలర్ట్ 99-32ను ఉపసంహరించుకుందని చెప్పింది. మరోవైపు సోమవారం ట్రేడింగ్‌లో దివీస్ ల్యాబ్ షేర్ విలువ ఒకానొక దశలో 20 శాతానికిపైగా పుంజుకుంది.

07/11/2017 - 00:25

తడ, జూలై 10: నెల్లూరు, చిత్తూరు జిల్లాలో సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో వెలసిన శ్రీసిటీ పారిశ్రామిక వాడకు టైమ్స్ నెట్‌వర్క్స్ అందజేసే మోస్ట్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీ అవార్డు దక్కింది. ముంబయిలోని తాజ్‌ల్యాండ్స్ ఎన్‌డ్ హోటల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీసిటీ బిజినెస్ విభాగం అధిపతి ఆర్ శివశంకర్ ఈ అవార్డును అందుకున్నారు.

07/11/2017 - 00:23

ముంబయి, జూలై 10: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. మదుపరుల కొనుగోళ్ల జోరుతో సరికొత్త స్థాయిలకు చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 355.01 పాయింట్లు ఎగబాకి, మునుపెన్నడూ లేనివిధంగా 31,715.64 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 105.25 పాయింట్లు ఎగిసి, ఇంతకుముందెప్పుడూ లేనివిధంగా 9,771.05 వద్ద నిలిచింది.

07/11/2017 - 00:21

దేశీయ ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్.. వినియోగదారుల సేవల పెంపునకుగాను ‘ప్రాజెక్టు నెక్స్ట్’ పేరుతో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీలో ప్రకటించింది. కస్టమర్ల ప్రైవసీనే తమకు తొలి ప్రాధాన్యత అని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇదిలావుంటే ఐదు రాష్ట్రాల్లో వాయిస్ ఓవర్ లాంగ్-టర్మ్ ఎవల్యూషన్ (వోల్ట్) టెక్నాలజీని ఎయిర్‌టెల్ పరీక్షిస్తోంది.

07/11/2017 - 00:20

కొత్తగూడెం, జూలై 10: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కాలరీస్ బొగ్గుకు డిమాండ్ పెరుగుతోంది. సింగరేణి కాలరీస్ యాజమాన్యం నుంచి 81 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసుకునేందుకు కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ సోమవారం ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి కాలరీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ శ్రీ్ధర్, కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిసిఎల్) ఎండి కుమార్ నాయక్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు.

Pages