S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/29/2017 - 01:03

కోల్‌కతా, జనవరి 28: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మనీలాండరింగ్ కోసం మెజారిటీ జన్‌ధన్ ఖాతాలు దుర్వినియోగం అయ్యాయనడానికి ఆధారాలు లేవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం అన్నారు. ‘నోట్ల రద్దు తరువాత అన్ని జన్‌ధన్ ఖాతాల ఆధారంగా మనీలాండరింగ్ జరిగిందనేందుకు ఆధారాలు లేవు. సుమారు 25 శాతం జన్‌ధన్ ఖాతాల్లో అంతకుముందు దాదాపు జమలు లేవు. జీరో బ్యాలెన్స్‌తో ఉన్నాయి.

01/29/2017 - 01:02

అమరావతి, జనవరి 28: పురుగు మందుల వాడకం తగ్గించి మిరపకాయల నాణ్యత, ఉత్పత్తిని పెంచి ఎగుమతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎగుమతులు పెరిగితే విదేశీ మారకద్రవ్యంతోపాటు, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉన్నందున ఆ కోణంలో మిరప ఉత్పత్తి, నాణ్యత పెంచడానికి గుంటూరు జిల్లాలోని ఉద్యానవన శాఖ తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది.

01/29/2017 - 01:00

తడ, జనవరి 28: విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా సుమారు 600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి 13 కంపెనీలు శనివారం శ్రీసిటితో ఒప్పందం చేసుకున్నాయి. శ్రీసిటి ఎండి రవీంద్ర సన్నారెడ్డి, ఆయా సంస్థల ప్రతినిధులు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

01/28/2017 - 01:33

ముంబయి, జనవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు మూడు నెలల గరిష్ఠాన్ని తాకుతూ 174.32 పాయింట్ల లాభంతో 27,882.46 వద్దకు చేరింది. నిరుడు అక్టోబర్ 30 నుంచి ఈ స్థాయికి సెనె్సక్స్ చేరుకోవడం ఇదే ప్రథమం. నాడు 27,930.21 వద్ద స్థిరపడింది.

01/28/2017 - 01:31

హైదరాబాద్, జనవరి 27: హైదరాబాద్ ఆధారిత మినీ రత్న కేటగిరి 1 రక్షణ సంస్థ మిధాని.. గత ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను 35.41 కోట్ల రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది. 2015-16లో పన్నుల అనంతర లాభం 118.03 కోట్ల రూపాయలుగా నమోదవగా, ఇందులో 30 శాతాన్ని ఇప్పుడు డివిడెండ్‌గా ఇస్తోంది మిధాని.

01/28/2017 - 01:30

న్యూఢిల్లీ, జనవరి 27: దాదాపు దశాబ్దకాలం తర్వాత ప్రభుత్వరంగ గ్యాస్ యుటిలిటి సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్.. బోనస్ షేర్లను జారీ చేసింది. 10 రూపాయల విలువైన మూడు ఈక్విటీ షేర్లకు 10 రూపాయల విలువ కలిగిన ఒక షేర్‌ను బోనస్‌గా ఇవ్వనుంది. దీనికి ఈ నెల 25న జరిగిన సంస్థ బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో గెయిల్ స్పష్టం చేసింది.

01/28/2017 - 01:30

న్యూఢిల్లీ, జనవరి 27: బహుళ వ్యాపార సంస్థ ఐటిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 2,646.73 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 5.71 శాతం అధికం. నాడు సంస్థ లాభం 2,503.76 కోట్ల రూపాయలు. ఆదాయం కూడా 4.69 శాతం పెరిగి 13,569.97 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 12,961.85 కోట్ల రూపాయలుగా ఉంది.

01/28/2017 - 01:28

ఆర్థిక సంస్కరణలు భేష్

01/28/2017 - 01:25

విశాఖపట్నం, జనవరి 27: పారిశ్రామిక ప్రగతికి చోదక శక్తిగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియన్ కాన్సల్ (దక్షిణ భారతదేశం) జనరల్ ప్రతినిధి సేన్ కెల్లీ స్పష్టం చేశారు.

01/28/2017 - 01:23

తిరుపతి, జనవరి 27: ఇండస్ట్రియల్ అండ్ ఆటోమోటివ్ బ్యాటరీ తయారీలో దూసుకెళ్తున్న అమర రాజా బ్యాటరీ సంస్థ.. తాజాగా 15వ ఏబికే ఏఓటిఎస్ పోటీల్లో మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. 5 ఎస్ (స్టార్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్టైజ్, సస్టైన్) కొలమానాల్లో అమర రాజా బ్యాటరీస్ పలు విభాగాల్లో అవార్డులను అందుకుంది. వీటిని సంస్థ ఆపరేషన్ హెడ్ జగన్మోహన్..

Pages