S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/09/2017 - 00:50

విశాఖపట్నం, జూలై 8: భారత్-శ్రీలంక దేశాల మధ్య పర్యాటక సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతి రాజు అన్నారు. శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ఆధ్వర్యంలో కొలంబో నుంచి విశాఖ విమాన సర్వీసును విశాఖ విమానాశ్రయంలో శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకాభివృద్ధిలో విమానయాన సంస్థలు కీలక భూమిక పోషిస్తాయన్నారు.

07/08/2017 - 00:47

న్యూయార్క్, జూలై 7: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తోంది. తమ అమ్మకాలు, మార్కెటింగ్ యూనిట్లలో భారీ పునర్‌వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్న ఈ అమెరికా సంస్థ.. దాదాపు 4,000 మందిని తీసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోయేవారిలో అత్యధికులు అమెరికాయేతరులే కావడం గమనార్హం.

07/08/2017 - 00:46

న్యూఢిల్లీ, జూలై 7: కోల్‌కతాకు చెందిన ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సిజి సంస్థ ఇమామీ.. హెయిర్ ఆయిల్ ధరలను తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు నేపథ్యంలో కలిగిన ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో 50, 100, 200 మిల్లీలీటర్ల బాటిళ్లపై 2 రూపాయల నుంచి 10 రూపాయల వరకు తగ్గింపునిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

07/08/2017 - 00:45

న్యూఢిల్లీ, జూలై 7: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసి.. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ)లో మరో 3 శాతానికిపైగా వాటాను సొంతం చేసుకుంది. 450.88 కోట్ల రూపాయలతో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ అయిన బిఒఐలో 3.12 శాతం ఈక్విటీని బహిరంగ మార్కెట్ ద్వారా ఎల్‌ఐసి కొనుగోలు చేసింది. దీంతో బిఒఐలో ఎల్‌ఐసి వాటా 14.25 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఇది 11.13 శాతంగా ఉంది.

07/08/2017 - 00:45

ముంబయి, జూలై 7: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 8.71 పాయింట్లు కోల్పోయి 31,360.63 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8.75 పాయింట్లు పడిపోయి 9,665.80 వద్ద నిలిచింది. గురువారం సూచీలు రికార్డు స్థాయికి చేరినది తెలిసిందే.

07/08/2017 - 00:44

తిరుపతి, జూలై 7: చిత్తూరు జిల్లాలోని పుత్తూరు, నగరి మధ్యలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం (స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ) ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి చెప్పారు. శుక్రవారం తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో జాతీయ యంత్ర పరికరాల ప్రదర్శన ‘మెగా పరిశ్రమల మిషనరీ ఎక్స్‌పో 2017’ను మంత్రి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.

07/08/2017 - 00:43

విశాఖపట్నం, జూలై 7: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వలన వ్యాపారులకు అధికారుల వేధింపులు ఇక ఉండబోవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అలాగే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన అన్నారు. టాక్స్ అసెస్‌మెంట్‌లో లోపాలను అధికారులు ఒకవేళ కనుగొంటే వాటిని ఆన్‌లైన్ ద్వారానే వ్యాపారులకు తెలియచేస్తారని స్పష్టం చేశారు.

07/08/2017 - 00:41

హైదరాబాద్, జూలై 7: ప్రీమియర్ కన్స్యూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ సింక్రోనీ ఫైనాన్షియల్.. హైదరాబాద్‌లో తమ రెండవ కార్యాలయాన్ని హైటెక్‌సిటీలోని నాలెడ్జ్‌సిటీ వద్దనున్న సలార్‌పురియా సత్వాలో శుక్రవారం ప్రారంభించింది. 2 లక్షల చదరపు అడుగులలో మూడు అంతస్తులలో విస్తరించిన ఈ కార్యాలయం.. వైవిధ్యమైన ఆర్కిటెక్చర్, ప్రోగ్రెసివ్ డిజైన్ కలిగింది.

07/08/2017 - 00:39

ముంబయి, జూలై 7: కాల్గేట్ పామోలివ్ (ఇండియా).. తమ టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్‌ల ధరలను 8-9 శాతం మేర తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) విధానంలో పన్నుల భారం తగ్గడమే దీనికి కారణం. జిఎస్‌టిలో టూత్‌పేస్ట్‌లపై పన్ను దాదాపు 24 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దేశీయ టూత్‌పేస్ట్ మార్కెట్‌లో కాల్గేట్ పామోలివ్ వాటా సుమారు 56 శాతం.

07/08/2017 - 00:38

న్యూఢిల్లీ, జూలై 7: అమెరికాకు చెందిన లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీదారు పొలారిస్ భారతీయ బ్రాండైన ఇండియన్ మోటార్‌సైకిల్ సంస్థ.. వివిధ రకాల మోడళ్ల ధరలను 2.21 లక్షల రూపాయల మేర తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు నేపథ్యంలో ఇండియన్ స్కౌట్, ఇండియన్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ క్లాసిక్ శ్రేణుల్లోని బైక్‌ల ధరలను 9 శాతం నుంచి 12 శాతం మేర తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.

Pages