S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/28/2017 - 01:30

న్యూఢిల్లీ, జనవరి 27: దాదాపు దశాబ్దకాలం తర్వాత ప్రభుత్వరంగ గ్యాస్ యుటిలిటి సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్.. బోనస్ షేర్లను జారీ చేసింది. 10 రూపాయల విలువైన మూడు ఈక్విటీ షేర్లకు 10 రూపాయల విలువ కలిగిన ఒక షేర్‌ను బోనస్‌గా ఇవ్వనుంది. దీనికి ఈ నెల 25న జరిగిన సంస్థ బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో గెయిల్ స్పష్టం చేసింది.

01/28/2017 - 01:30

న్యూఢిల్లీ, జనవరి 27: బహుళ వ్యాపార సంస్థ ఐటిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 2,646.73 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 5.71 శాతం అధికం. నాడు సంస్థ లాభం 2,503.76 కోట్ల రూపాయలు. ఆదాయం కూడా 4.69 శాతం పెరిగి 13,569.97 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 12,961.85 కోట్ల రూపాయలుగా ఉంది.

01/28/2017 - 01:28

ఆర్థిక సంస్కరణలు భేష్

01/28/2017 - 01:25

విశాఖపట్నం, జనవరి 27: పారిశ్రామిక ప్రగతికి చోదక శక్తిగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆస్ట్రేలియన్ కాన్సల్ (దక్షిణ భారతదేశం) జనరల్ ప్రతినిధి సేన్ కెల్లీ స్పష్టం చేశారు.

01/28/2017 - 01:23

తిరుపతి, జనవరి 27: ఇండస్ట్రియల్ అండ్ ఆటోమోటివ్ బ్యాటరీ తయారీలో దూసుకెళ్తున్న అమర రాజా బ్యాటరీ సంస్థ.. తాజాగా 15వ ఏబికే ఏఓటిఎస్ పోటీల్లో మూడు ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. 5 ఎస్ (స్టార్, సెట్ ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్టైజ్, సస్టైన్) కొలమానాల్లో అమర రాజా బ్యాటరీస్ పలు విభాగాల్లో అవార్డులను అందుకుంది. వీటిని సంస్థ ఆపరేషన్ హెడ్ జగన్మోహన్..

01/28/2017 - 01:22

న్యూఢిల్లీ, జనవరి 27: పన్నులను తప్పించుకోవడం కోసం కంపెనీలు వేరే దేశాలగుండా లావాదేవీలను జరపడాన్ని నిరోధించడానికి ఉద్దేశించిన జనరల్ యాంటీ-అవాయిడెన్స్ రూల్స్ (గార్) ఏప్రిల్ 1నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) తెలిపింది.

01/28/2017 - 01:21

హైదరాబాద్, జనవరి 27: ఇప్పటిదాకా భారత్‌లో పదివేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న పవన విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పినట్లు సుజ్లాన్ సంస్థ ప్రకటించింది. దీనివల్ల దేశంలో ఐదు మిలియన్ల గృహాలకు విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని ఆ సంస్థ ఎండి తులసి తంతి తెలిపారు. కాలుష్య రహిత పవన విద్యుత్ ఉత్పాదన అంటే సాలీనా 1,500 మిలియన్ల మొక్కలను నాటడంతో సమానమన్నారు.

01/28/2017 - 01:21

హైదరాబాద్, జనవరి 27: వచ్చే బడ్జెట్‌లో డిజిటలైజేషన్, ఆర్థిక సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నట్లు పేటిఎమ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సిఎఫ్‌ఒ) మధుర దేవ్ అన్నారు. వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్ ఉండగా, దేశంలో ఇంతవరకు బ్యాంకింగ్ రంగం పరిధిలో రాని వారిని నగదు రహిత లావాదేవీల పరిధిలోనికి తెచ్చేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందన్నారు.

01/28/2017 - 01:20

విశాఖపట్నం, జనవరి 27: పారిశ్రామిక రంగంలో అత్యంత ప్రతిభ కనబరచడంతోపాటు ప్రగతి పథంలో సాగుతున్న పలు కంపెనీలకు టైమ్ ఇండియా అవార్డులను ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా టైమ్ ఇండియా వైస్ చైర్మన్ నార్మన్ పెర్‌స్ట్రీన్, మెకినే్స కంపెనీ సీనియర్ పార్ట్‌నర్ రాజ్ థావన్‌లు సంయుక్తంగా ఈ అవార్డులను ప్రకటించారు.

01/27/2017 - 01:01

న్యూఢిల్లీ, జనవరి 26: పెద్ద నోట్ల ఆకస్మిక రద్దు అనంతరం దేశంలో వివిధ రకాల వస్తువులకు డిమాండ్ గణనీయంగా తగ్గి ప్రభుత్వం సతమతమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న సార్వత్రిక బడ్జెట్‌లో పన్నులను తగ్గించడం ద్వారా వస్తు వినిమయాన్ని పెంపొందించేందుకు తగిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Pages