S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

10/08/2016 - 02:21

హైదరాబాద్, అక్టోబర్ 7: పండగల సందర్భంగా వైడర్ అనే సంస్థ పలు అన్‌లైన్ రుణ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. తక్కువ డాక్యుమెంటేషన్‌తో రిటైలర్లకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలను ఇస్తామని వైడర్ పేర్కొంది.

10/08/2016 - 02:20

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరానికి వసూలు చేసే చెరకు కొనుగోలు పన్ను (పర్చేజ్ టాక్స్)ను రైతులకే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చక్కెర మిల్లుల్లో టన్ను చెరకుపై 60 రూపాయలు, ఖండసారి మిల్లుల్లో టన్ను చెరకుపై 22 రూపాయలు పర్చేస్ టాక్స్ వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తారు.

10/08/2016 - 02:19

హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు మధ్య, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల ప్రయోజనాలను పొందాలని కేంద్ర ప్రభుత్వ చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ అరవింద్ పట్వారి సూచించారు.

10/07/2016 - 00:27

ముంబయి, అక్టోబర్ 6: యూరోపియన్ యూనియన్‌నుంచి బ్రిటన్ వైదొలగడంపై ఆందోళన కొనసాగుతుండడం, అలాగే ఇటీవలి కాలంలో రాణించిన కంపెనీల షేర్లలో లాభాల స్వీకరణలాంటి కారణాల వల్ల వరసగా రెండో రోజు కూడా దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఫలితంగా బుధవారం 114 పాయింట్లు కోల్పోయిన బిఎస్‌ఇ సెనె్సక్స్, గురువారం కూడా మరో 115 పాయింట్ల దాకా నష్టపోయింది.

10/07/2016 - 00:25

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రజలను తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనల్లో పాల్గొంటున్న సెలబ్రిటీలపై నిషేధం విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం వెల్లడించారు. అయితే ఇటువంటి ప్రకటనల విషయంలో నిందితులుగా తేలిన సెలబ్రిటీలకు జైలు శిక్ష విధించాలని సంబంధిత పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసును అమలు చేస్తారా? లేదా?

10/07/2016 - 00:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: దేశంలోని ప్రముఖ రుణ వితరణ సంస్థల్లో ఒకటైన డిహెచ్‌ఎఫ్‌ఎల్ (దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్) గృహ రుణాలపై వడ్డీ రేటును 0.2 శాతం తగ్గించింది. ప్రస్తుత పండుగల సీజన్‌లో కొత్త ఖాతాదారులను ఆకర్షించేందుకు డిహెచ్‌ఎఫ్‌ఎల్ ఈ చర్య చేపట్టింది.

10/07/2016 - 00:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసి)కు ప్రాధాన్యత ప్రాతిపదికపై 7.17 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యూ బ్యాంక్ తెలిపింది. దీనిద్వారా బ్యాంక్‌కు రూ 270కోట్లు లభిస్తాయి. సెబి నిర్ణయించిన ధరకు ఎల్‌ఐసికి ప్రాధాన్యత ప్రాతిపదికపై 7.17 ఓట్ల షేర్లను విక్రయించడానికి ఇటీవల జరిగిన బోర్డు సమావేశం నిర్ణయించింది. దీంతో బ్యాంకులో ఎల్‌ఐసి వాటా 5.5 శాతానికి పెరుతుంది.

10/07/2016 - 00:22

హైదరాబాద్, అక్టోబర్ 6: భారతదేశానికి బయోఫార్మా, బయో జెనెటిక్స్ రంగాల్లో ఉజ్వల భవిష్యత్తు ఉందని, 2030 సంవత్సరం నాటికి బయో ఉత్పత్తుల టర్నోవర్ రూ. 40 బిలియన్ డాలర్లకు చేరుతుందని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ డైరక్టెర్ జనరల్ ప్రొఫెసర్ డి.స్వామినాథన్ అన్నారు. బయోఫార్మాపై గురువారం ఇక్కడ అసోచామ్, కేంద్ర ఫార్మాసూటికల్స్ శాఖ సదస్సు నిర్వహించాయ.

10/07/2016 - 00:20

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పారదర్శక ప్రఅకియలు, వ్యాపారాన్ని సులభతరం చేయడం లాంటి కారణాల వల్ల దేశం రాబోయే ఒకటి, రెండు దశాబ్దాల్లో 8 శాతానికి పైగా వృద్ధి సాధించడానికి తోడ్పడతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ దిశగా రాష్ట్రాలు కేంద్రంతో కలిసికట్టుగా కృషి చేస్తున్నాయని ఆమె అన్నారు. ‘8 శాతం వృద్ధి సాధ్యమే.

10/07/2016 - 00:17

న్యూఢిల్లీ అక్టోబరు 6: తెలంగాణలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడమే తెరాస ప్రభుత్వ లక్ష్యమని, డిజిటల్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.టి.రామరావు స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సిఐఐ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఎకనమిక్ సమ్మిట్‌లో కెటిఆర్ పాల్గొన్నారు.

Pages