S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/23/2016 - 08:15

ముంబయి, జూన్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. మంగళవారం సూచీలు నష్టపోయినది తెలిసిందే. గురువారం బ్రెగ్జిట్‌పై రెఫరెండం జరుగుతున్న క్రమంలో మదుపరులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించారు.

06/23/2016 - 08:14

బెంగళూరు, జూన్ 22: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్‌బిఐ మిగులు నగదు నిల్వలను అందించాలన్న ప్రతిపాదనను గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యతిరేకించారు. నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వద్దనున్న మిగులు నగదును ఇవ్వాలంటూ వస్తున్న సూచనలను బుధవారం రాజన్ తోసిపుచ్చారు.

06/22/2016 - 01:04

న్యూఢిల్లీ, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ సామర్థ్యాన్ని ఏషియన్ పెయింట్స్ పెంచుతోంది. దశలవారీగా ఈ ప్లాంట్ గరిష్ఠ వార్షిక సామర్థ్యాన్ని 5 లక్షల లీటర్లకు పెంచనున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఏషియన్ పెయింట్ మంగళవారం తెలిపింది. పెట్టుబడులు కూడా స్వల్పంగా పెరుగుతాయని స్పష్టం చేసింది.

,
06/22/2016 - 01:03

న్యూఢిల్లీ, జూన్ 21: ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడేవారికి (విల్‌ఫుల్ టాక్స్ డిఫాల్టర్) అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఆదాయ పన్ను (ఐటి) శాఖ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. అలాంటివారి శాశ్వత ఖాతా సంఖ్య (పర్మినెంట్ అకౌంట్ నెంబర్ లేదా పాన్)ను నిలిపివేయాలని, వంటగ్యాస్ రాయితీ (ఎల్‌పిజి సబ్సిడీ)ని రద్దు చేయాలని ఐటి శాఖ నిర్ణయించింది.

06/22/2016 - 01:00

న్యూఢిల్లీ, జూన్ 21: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ నిష్క్రమణ నిర్ణయం.. దేశీయ స్టాక్ మార్కెట్లపై నిజంగా ప్రభావం చూపలేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సోమవారం మార్కెట్లు లాభాల్లో ముగిసిన నేపథ్యంలో చిన్నచిన్న అంశాలకు ప్రభావితమయ్యే మదుపరులు.. రాజన్ నిష్క్రమణను తేలిగ్గా తీసుకున్నారనే అంతా అనుకున్నారు మరి.

06/22/2016 - 00:58

అనంతపురం, జూన్ 21: అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా మారనుంది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. 2010- 15లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఐఐపిపిలో మార్పులు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ (2015-20)ని తీసుకువచ్చింది. నూతన విధానాల్లో భాగంగా రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది.

06/22/2016 - 00:56

ముంబయి, జూన్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 54.14 పాయింట్లు నష్టపోయి 26,812.78 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 18.60 పాయింట్లు కోల్పోయి 8,219.90 వద్ద నిలిచింది. ఐరోపా యూనియన్‌లో ఉండాలా? లేదా? అన్నదానిపై గురువారం బ్రిటన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న క్రమంలో విదేశీ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు.

06/22/2016 - 00:55

విశాఖపట్నం, జూన్ 21: ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ మరింత పటిష్ఠ పరిచేందుకు వీలుగా నిర్మాణాత్మక ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఇందులోభాగంగా ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ఆధ్వర్యంలో వెయ్యి కోట్ల రూపాయలతో భారీ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయ. ఈ ప్రతిపాదనలను మంగళవారం ఈపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయానికి వచ్చిన ప్రపంచ బ్యాంకు బృందం పరిశీలించింది.

06/22/2016 - 00:54

ఇండోర్, జూన్ 21: నెలకు ఐదుసార్లు మించి ఎటిఎమ్ లావాదేవీలు జరిపేవారు ఎక్కువ కావడంతో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఎటిఎమ్ ఆదాయం 47 శాతం పెరిగింది. నెలకు ఉచితంగా ఐదుసార్లు ఎటిఎమ్‌ను వినియోగించుకునే అవకాశం ఉన్నది తెలిసిందే. అయితే ఆరోసారి వినియోగం నుంచి ఒక్కో లావాదేవీకి 20 రూపాయల చొప్పున ఖాతాదారుడి వద్ద డబ్బులు వసూలు చేస్తుంది ఎస్‌బిఐ.

06/22/2016 - 00:53

విశాఖపట్నం, జూన్ 21: సరకు రవాణాలో విశాఖపట్నం పోర్టు ట్రస్టు మరో కీలక భూమిక పోషించనుంది. ఇప్పటి వరకూ కోల్‌కతా పోర్టు నుంచి సరిహద్దు దేశం నేపాల్‌కు సరకు రవాణా జరిగేది. తాజాగా విశాఖ పోర్టును సైతం కేంద్ర ప్రభుత్వం గేట్‌వే పోర్టుగా ప్రకటించడంతో ఎగుమతి, దిగుమతుల్లో మరింత పురోగతి సాధించేందుకు ఆస్కారమేర్పడనుంది. రైలు, రోడ్డు మార్గాల అనుసంధానం ఈ మేరకు విశాఖ పోర్టుకు ఈ అవకాశాన్ని దక్కించింది.

Pages