S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

07/03/2017 - 00:28

హైదరాబాద్, జూలై 2: వస్త్ర పరిశ్రమ, రెడీమేడ్ దుస్తులు, బీడి పరిశ్రమకు సంబంధించి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తగ్గించే విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో చర్చిస్తానని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అలాగే బ్యాంకు లావాదేవీలపై విధిస్తున్న రెండు శాతం సేవా పన్నునూ జైట్లీ దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు.

07/03/2017 - 00:25

హైదరాబాద్, జూలై 2: తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర పన్నుల రాబడి ఈ ఏడాది 14.5 శాతం పెరగవచ్చని హైదరాబాద్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీసు ట్యాక్స్ కమిషనర్ సునీల్ జైన్ అన్నారు. జిఎస్‌టి వల్ల ఈ రాబడి పెరుగుతుందనే విశ్వాసం ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘రాష్ట్రంలో నిరుడు కేంద్ర, రాష్ట్రాలకు 50 వేల కోట్ల రూపాయల వరకు పన్ను రూపేణా ఆదాయం వచ్చింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వల్ల ఈ ఆదాయం 14.5 శాతం పెరుగుతుంది.

07/03/2017 - 00:24

న్యూఢిల్లీ, జూలై 2: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో భారతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అభిప్రాయపడింది. దేశ జిడిపి వృద్ధిరేటు పెరుగుతుందన్న మూడీస్.. పన్నుల ద్వారా ఖజానాకు ఆదాయం కూడా అధికమవుతుందని చెప్పింది. ఈ క్రమంలో భారత్..

07/03/2017 - 00:24

న్యూఢిల్లీ, జూలై 2: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) తమ ఉత్పత్తుల్లో కొన్నింటి ధరలను తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో డిటర్జెంట్లు, సబ్బుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులకు జిఎస్‌టి ప్రయోజనాలను అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ అధికార ప్రతినిధి పిటిఐకి తెలిపారు.

07/03/2017 - 00:23

న్యూఢిల్లీ, జూలై 2: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. జనవరి మినహా, ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతూనే ఉన్నాయ. గత నెలలో కూడా 4.55 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయ. జూన్‌లో మొత్తం 29 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చారు విదేశీ మదుపరులు.

07/02/2017 - 00:26

న్యూఢిల్లీ, జూలై 1.: నిజాయతీగా వ్యవహరించాలని, విశ్వసనీయతను కోల్పోరాదని చార్టెడ్ అకౌంటెంట్ల (సిఎ) కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. శనివారం ఇక్కడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెం ట్స్ ఇన్ ఇండియా (ఐసిఎఐ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిఎలనుద్దేశించి మాట్లాడుతూ ప్రత్యక్షంగా, పరోక్షంగా చురకలు వేశారు.

07/02/2017 - 00:26

న్యూఢిల్లీ, జూలై 1: ప్రీ-జిఎస్‌టి సేల్స్ అదిరిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) శుక్రవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చినది తెలిసిందే. అయితే అంతకుముందే పన్ను భారం తగ్గించుకోవడానికి వ్యాపారులు ముందస్తు జిఎస్‌టి అమ్మకాలకు తెరతీశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా భారీ ఎత్తున అమ్మకాలు జరిగాయి.

07/02/2017 - 00:25

న్యూఢిల్లీ, జూలై 1: దేశీయ మొబైల్ ఫోన్ తయారీదారులకు జిఎస్‌టితో లాభం చేకూరింది. దేశంలోకి దిగుమతి అయ్యే మొబైల్ ఫోన్లపై 10 శాతం కస్టమ్స్ సుంకాన్ని విధించింది కేంద్రం. దీంతో విదేశీ సంస్థల మొబైల్ ఫోన్ల ధరలు మార్కెట్‌లో పెరగనున్నాయి. దీంతో దేశీయ సంస్థల మొబైల్స్ ధరలు తక్కువగా ఉండి, కస్టమర్లను ఆకర్షించేందుకు అవకాశాలు ఏర్పడనున్నాయి.
ధరలను తగ్గించిన యాపిల్

07/02/2017 - 00:25

హైదరాబాద్, జూలై 1: దేశంలోనే తొలిసారిగా క్రంబ్ రబ్బర్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తోంది ఆప్టిమస్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాడేసిన పాత టైర్ల నుంచి వచ్చే ఈ క్రంబ్ రబ్బర్‌ను చాలావరకు పెద్ద, చిన్నతరహా పరిశ్రమల్లో రకరకాలుగా వినియోగిస్తున్నారు. ఎన్నో ఉత్పత్తులకు ఈ క్రంబ్ రబ్బర్ ముడి సరకుగా ఉందని సంస్థ నిర్వహకులు శనివారం ఇక్కడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెలిపారు.

07/02/2017 - 00:24

న్యూఢిల్లీ, జూలై 1: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. తమ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు మరింత డేటా లభించే ఆఫర్లను ప్రకటించింది. శనివారం నుంచే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్ల విషయానికొస్తే.. ప్రస్తుత పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై ఆరు రెట్లు అధికంగా డేటా లభించనుంది. ‘ప్లాన్ 99 వినియోగదారులకు 250 ఎమ్‌బి డేటా వస్తుందని బిఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌తో ఎలాంటి డేటా లేదు.

Pages