S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/01/2017 - 00:54

అమరావతి, డిసెంబర్ 31: ఏపిలో స్పిన్నింగ్ మిల్లుల పునరుజ్జీవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జిన్నింగ్, స్పిన్నింగ్‌లతోపాటు వీవింగ్, ప్రాసెసింగ్, గార్మెంటింగ్ రంగాల అభివృద్ధికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని ప్రకటించారు.

01/01/2017 - 00:53

కాకినాడ, డిసెంబర్ 31: తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంతంలో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా, ప్రజల భద్రతకు తిలోదకాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ యంత్రాంగం.. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ, తమను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

01/01/2017 - 00:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: బంగారం, వెండి ధరలు శనివారం క్షీణించాయి. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు.. ఈ ఏడాది చివరి రోజైన శనివారం మాత్రం తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర శుక్రవారం ముగింపుతో పోల్చితే 200 రూపాయలు పడిపోయి 28,300 రూపాయలకు చేరింది. 99.5 స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర కూడా 28,150 రూపాయల వద్ద నిలిచింది.

01/01/2017 - 00:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశీయ బ్యాంకింగ్ రంగ ఉనికిని మొండి బకాయలు ప్రశ్నార్థకం చేస్తున్నాయ. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు మొండి బకాయల సెగ అధికంగా తగులుతోంది. వీటిలో ఎస్‌బిఐ ముందు వరుసలో ఉండగా, తర్వాతి వరుసలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. ఎస్‌బిఐ నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ) విలువ గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 55,807 కోట్ల రూపాయలుగా నమోదైంది.

12/31/2016 - 00:38

విజయ్ మాల్యా వ్యవహారం

12/31/2016 - 00:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: పన్నులకు సంబంధించి తమ పాత వివాదాలను పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వొడాఫోన్, కెయర్న్ ఎనర్జీలాంటి కంపెనీలకు మరో నెల గడువు ఇచ్చింది. ఈ నెల 31తో ముగియనున్న ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కార పథకాన్ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు జనవరి 31 దాకా పొడిగించింది.

12/31/2016 - 02:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: రద్దయిన పాత పెద్ద నోట్ల డిపాజిట్లకు సంబంధించిన మొత్తం వివరాలను తక్షణం తమకు తెలియజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) దేశంలోని అన్ని బ్యాంకులను ఆదేశించింది.

12/31/2016 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: ద్వంద్వ పన్నులకు సంబంధించి ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను సవరించి ఈ ఏడాది మారిషస్, సైప్రస్‌తో కొత్త ఒప్పందాలను కుదుర్చుకున్న భారత్.. శుక్రవారం తాజాగా సింగపూర్‌తోనూ అలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. భారత్‌లో సింగపూర్ హైకమిషనర్ లిమ్ తువాన్ కువాన్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ సుశీల్ చంద్ర ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

12/30/2016 - 00:55

ముంబయి, డిసెంబర్ 29: లావాదేవీల చివర్లో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరగడంతో దేశీయ మార్కెట్లు గురువారం మంచి లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఇ సూచీ సెనె్సక్స్ 155 పాయింట్లు పెరిగి 2 వారాల గరిష్ఠస్థాయి అయిన 26,366 పాయింట్ల వద్ద ముగియగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం తిరిగి 8,100 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఉదయం స్టాక్ మార్కెట్లు సానుకూల ధోరణిలోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కూడా నిలకడగానే కొనసాగాయి.

12/30/2016 - 00:54

ముంబయి, డిసెంబర్ 29: వస్తు సేవల పన్ను(జిఎస్‌టి), పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులనే పూర్తిగా మార్చివేయగలవని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయ పడింది. నోట్లరద్దు నిర్ణయం ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు కలగజేసినప్పటికీ, అలాగే వృద్ధి రేటుపై ఆ క్షణానికి ప్రతికూల ప్రభావం చూపించినప్పటికీ అది దేశ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చి వేయగలదని ఆర్‌బిఐ పేర్కొంది.

Pages