S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

04/10/2018 - 03:26

పరకాల, ఏప్రిల్ 9: నిర్మాణ రంగంపై ఉక్కు పిడుగు పడింది. ఇన్నాళ్లు ఊసురుమన్న నిర్మాణ రంగం ఎట్టకేలకు పుంజుకుంటున్న సమయంలో ఉక్కు ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ధరలు బాగా పెరగటంతో నిర్మాణదారులను ఇబ్బందుల్లోకి నెట్టింది. మార్చి చివరి నాటికి టన్ను ధర సాధారణ కంపెనీల ఉక్కు రూ. 53వేలు, బ్రాండెడ్ కంపెనీల ఉక్కు రూ. 60 వేలకు చేరిందనే వ్యాఖ్యలు వ్యక్తం అవుతున్నాయి.

04/10/2018 - 03:25

హైదరాబాద్, ఏప్రిల్ 9: తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ టర్నోవర్ ఈ ఆర్థిక సంవత్సరంలో నూరు శాతం వృద్ధి సాధించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. 2015-16, 2016-17లో సరాసరి టర్నోవర్ రూ.113 కోట్లు ఉండగా, 2017-18లో రూ.220 కోట్లకు చేరి రికార్డు స్ధాయిలో 95 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు.

04/09/2018 - 17:18

ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆది నుంచి ఇనె్వస్టర్ల నుంచి పాజిటివ్ టాక్ రావటంతో లాభాల బాటలో పయనించాయి. సెనె్సక్స్ 162 పాయింట్ల వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల వద్ద లాభాలతో ముగిశాయి.

04/09/2018 - 04:22

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన రూ.13,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి పూర్తి విజిలెన్స్ నివేదిక కోసం ఎదు రు చూస్తున్నామని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తెలియజేసింది. కాగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సమగ్ర వివరాలతో బ్యాంకుకు సంబంధించిన ఆడిటర్లను విచారణకు హాజరు కావాలంటూ ఆదివారం ఆదేశించినట్టు కూడా వెల్లడించింది.

04/09/2018 - 00:57

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: కార్పొరేట్ కంపెనీల ఫలితాలు వెలువడనున్న తరుణంలో స్థూలార్థిక గణాంకాల వంటి దేశీయ పరిణామాలు, వాణిజ్య సుంకాల పోరు వంటి ప్రపంచ పరిణామాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో భారత స్టాక్ మార్కెట్ల ధోరణిని నిర్దేశించనున్నాయని నిపుణుల అంచనా.

04/09/2018 - 00:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ఈ సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంకు కీలక వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది. అప్పటికి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం2కానుండటంతో, ఆర్‌బీఐ ఈ చర్యకు ఉపక్రమించవచ్చునని, మోర్గాన్ స్టాన్లీ నివేదిక అంచనా వేసింది. తన అంచనాకు ఈ సంస్థ ప్రధానంగా రెండు కారణాలను సూచించింది.

04/09/2018 - 00:54

న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: ముంబయి ప్రత్యేక సీబీఐ న్యాయస్థానం, నీరవ్ మోదీ ఆయన బంధువు మెహుల్ ఛోక్సీలపై నాన్ బెయిలబుల్ వారంట్లను జారీచేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న 2 బిలియన్ల యుఎస్‌డి అక్రమాలపై వీరికి ఈ వారంట్లు జారీ అయినట్ల అధికార్లు ఆదివారం వెల్లడించారు.

04/08/2018 - 04:41

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (జియో)కు తన ఆస్తుల విక్రయ వ్యవహారంలో అతని సోదరుడు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కు న్యాయస్థానాలు తాజా గా వెలువరించిన రెండు ఆదేశాలు కొంత మేరకు కలిసివచ్చాయి.

04/08/2018 - 04:17

ముంబయి, ఏప్రిల్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోవారం లాభపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో 658.29 పాయింట్లు పుంజుకొని, 33,626.97 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ కీలకమయిన 10,300 స్థాయికి పైన 10,331.60 పాయింట్ల వద్ద స్థిరపడింది.

04/08/2018 - 04:15

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 7: వేసవి నిమ్మ సీజన్ మొదలైంది. తూర్పు గోదావరి జిల్లా చాగల్నాడు ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు నిమ్మ ఎగుమతులు పెరుగుతున్నాయి. మూడు నాలుగేళ్ల క్రితం మొదలైన రియల్ బూమ్ నేపథ్యంలో రియల్ ఎస్టేట్లుగా మారిన భూముల్లో మళ్లీ నిమ్మ తోటలు విస్తృతంగా పెరగడంతో ఉత్పత్తి పెరిగింది.

Pages