S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/30/2017 - 00:33

న్యూఢిల్లీ, జూన్ 29: చరిత్రాత్మకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రయోజనాలు ఒనగూడుతాయని భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (్ఫక్కీ) గురువారం స్పష్టం చేసింది. స్వతంత్ర భారత దేశంలో అతిపెద్దది, అత్యంత కీలకమైనది అయిన ఈ పన్ను సంస్కరణ విజయవంతంగా అమలు కావాలని ఆకాంక్షిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని ఫిక్కీ తెలిపింది.

06/30/2017 - 00:32

న్యూఢిల్లీ, మే 29: టెలికామ్ ఆపరేటర్ల నుంచి వసూలు చేస్తున్న పన్ను రేటును వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టం కింద మరో 3 శాతం పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో ఈ రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని కేంద్ర టెలికామ్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా గురువారం స్పష్టం చేశారు.

06/30/2017 - 00:32

న్యూఢిల్లీ, జూన్ 29: గృహోపకరణాల తయారీలో పేరెన్నికగన్న చైనా సంస్థ ‘మిడెయా’ భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. భారత్‌లో కార్యకలాపాల కోసం 2013 నుంచే పెట్టుబడులు పెడుతున్న ఈ సంస్థ తాజాగా 800 కోట్ల రూపాయల పెట్టుబడులతో పుణెలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు గురువారం వెల్లడించింది.

06/30/2017 - 00:31

హైదరాబాద్, జూన్ 29: క్లౌడ్ డేటా భద్రత, నిర్వహణకు సంబంధించి పరిష్కారాలను అందించేందుకు గాను దేశీయ ప్రీమియర్ ఐటి సర్వీసెస్ కంపెనీ హెచ్‌సిఎల్ ఇన్ఫో సిస్టమ్స్, పారాబ్లూతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది.

06/29/2017 - 03:48

న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 28: మార్కెట్‌లో ధరలు దడ పుట్టిస్తున్నాయి. సామాన్యుడు కూరగాయలను కూడా కొని తినలేని పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే దుస్థితి కనిపిస్తోంది మరి. అది.. ఇది.. అనే తేడా లేకుండా కరివేపాకు దగ్గర్నుంచి కొత్తిమీరదాకా అటు ఆకు కూరలు, ఇటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి.

06/28/2017 - 00:45

చిత్రం.. మంగళవారం ఆమ్‌స్టర్‌డామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే సమక్షంలో జరుగుతున్న ఒప్పందాలు

06/28/2017 - 00:42

చిత్రం.. మంగళవారం ఆమ్‌స్టర్‌డామ్‌లో నెదర్లాండ్స్ సిఇఒలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం, చిత్రంలో నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే సైతం ఉన్నారు.

06/28/2017 - 00:40

వాషింగ్టన్, జూన్ 27: భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం బలోపేతానికి ఇటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అటు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో తొలిసారి మోదీ సమావేశమవగా, అనంతరం ఆ వివరాలను భారత విదేశాంగ కార్యదర్శి ఎస్ జయశంకర్ విలేఖరులకు తెలియజేశారు.

06/28/2017 - 00:37

న్యూఢిల్లీ, జూన్ 27: శీతల పానియాల తయారీ దిగ్గజం కోక-కోలా ఇండియా.. మంగళవారం తమ ఫిజీ డ్రింక్స్ ధరలను పెంచింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రానున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఈ కారణంగానే తమ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ కినే్ల ధరలను తగ్గించింది. జిఎస్‌టి క్రింద 40 శాతం పన్ను భారం పడుతోందని, అందుకే కొన్ని కూల్‌డ్రింక్స్ ధరలను పెంచాల్సి వస్తోందని చెప్పింది.

06/28/2017 - 00:37

న్యూఢిల్లీ, జూన్ 27: కృష్ణా-గోదావరి (కెజి) బేసిన్‌లో షేల్ గ్యాస్, చమురు అనే్వషణ కోసం ఐదు బావులను తవ్వేందుకు ప్రభుత్వరంగ చమురు, సహజవాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్‌జిసికి పర్యావరణ అనుమతులు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌లోగల ఈ బేసిన్‌లో జరుగుతున్న ఈ తవ్వకాల అంచనా వ్యయం 217 కోట్ల రూపాయలుగా ఉంది. గత 35 ఏళ్లకుపైగా ఇక్కడ ఒఎన్‌జిసి గ్యాస్, చమురు ఉత్పత్తి చేస్తోంది.

Pages