S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/28/2017 - 00:36

ముంబయి, జూన్ 27: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. గడచిన నెల రోజుల్లో ఎన్నడూ లేనంతగా మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు పతనమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 179.96 పాయింట్లు పడిపోయి 31 వేల స్థాయికి దిగువన 30,958.25 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 63.55 పాయింట్లు కోల్పోయి 9,511.40 వద్ద నిలిచింది.

06/28/2017 - 00:35

న్యూఢిల్లీ, జూన్ 27: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తున్న క్రమంలో మొదట్లో కొన్ని ఇబ్బందులు ప్రజలకు ఎదురు కావచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అయితే తర్వాత జిఎస్‌టి ప్రయోజనకరంగా ఉంటుందని, దీర్ఘకాలంలో లబ్ధి చేకూరగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పన్నుల ఎగవేత, ధరల అదుపు వంటివి జిఎస్‌టితోనే సాధ్యపడగలవన్నారు.

06/28/2017 - 00:33

మేడ్చల్, జూన్ 27: కాలం చెల్లిన విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారనే సమాచారం మేడ్చల్ మండలంలో తీవ్ర దుమారం రేపింది.

06/28/2017 - 00:30

న్యూఢిల్లీ, జూన్ 27: ఇరు దేశాల మధ్య రోడ్డు, సముద్ర, విమానయాన రవాణా పెరిగేలా సహకారమివ్వాలని మయన్మార్‌ను భారత్ కోరింది. భారత్-మయన్మార్ ద్వైపాక్షిక వాణిజ్యం పెంపులో భాగంగా రెండు దేశాల వాణిజ్య మంత్రులు మంగళవారం ఇక్కడ కలుసుకున్నారు. మయన్మార్ వాణిజ్య మంత్రి థన్ మింట్.. భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇరువురు ఈ సందర్భంగా వాణిజ్య, పెట్టుబడులపై చర్చించారు.

06/28/2017 - 00:28

న్యూఢిల్లీ, జూన్ 27: అమెరికా ఆటో రంగ దిగ్గజం జనరల్ మోటార్స్‌కు చెందిన దేశీయ డీలర్లు మంగళవారం జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. భారతీయ మార్కెట్ నుంచి జనరల్ మోటార్స్ వైదొలుగుతున్న క్రమంలో దాదాపు 15,000 ఉద్యోగాలు గల్లంతవుతాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా జనరల్ మోటార్స్‌కు 96 మంది డీలర్లుండగా, 140 షోరూంలు నడుస్తున్నాయి.

06/28/2017 - 00:27

హైదరాబాద్, జూన్ 27: సహకార సంఘాల్లో సభ్యులు కానివారి నుంచి డిపాజిట్లు తీసుకోవద్దని సహకార సంఘాలకు రిజర్వు బ్యాంక్ సూచించింది. అలాగే సహకార సంఘాల్లో నామమాత్రపు సభ్యులు, అనుబంధ సభ్యుల నుంచి కూడా డిపాజిట్లను స్వీకరించరాదని ఆర్‌బిఐ రీజనల్ డైరక్టర్ ఆర్ సుబ్రమణియన్ తెలిపారు.

06/28/2017 - 00:26

హైదరాబాద్, జూన్ 27: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వల్ల వస్త్ర పరిశ్రమ పూర్తిగా కుదేలవుతుందని తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ అసోసియేషన్స్ (టిఎస్‌ఎఫ్‌టిఎ) అధ్యక్షుడు అమ్మనబోలు ప్రకాశ్ పేర్కొన్నారు. వస్త్ర వ్యాపారాన్ని జిఎస్‌టి నుండి ఉపసంహరించాలని డిమాం డ్ చేస్తూ మూడు రోజుల బంద్‌ను పాటిస్తున్నారు.

06/28/2017 - 00:26

విజయవాడ, జూన్ 27: విద్యుత్ ఉపకరణాలపై 28 శాతం వరకు జిఎస్‌టి విధించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. విద్యుత్ పొదుపు కోసం కోట్లాది రూపాయల సబ్సిడీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఎల్‌ఇడి బల్బులపై సైతం అధిక పన్ను విధింపు ఆశ్చర్యం గొలుపుతున్నది. పన్నుల భారం వల్ల ప్రభుత్వాలకు ఆశించిన ఆదాయం రాకపోగా పన్ను ఎగవేతకు..

06/27/2017 - 00:29

న్యూఢిల్లీ, జూన్ 26: ఔషధ రంగ దిగ్గజం లుపిన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ దేశ్ బంధు గుప్తా కన్నుమూశారు. సోమవారం ఉదయం ముంబయిలో ఆయన మరణించారు. అయతే గుప్తా మరణానికి కారణాలు తెలియరాలేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, ఆకస్మికంగా మృతి చెందారని సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. గుప్తాకు భార్య, నలుగురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

06/27/2017 - 00:27

న్యూఢిల్లీ, జూన్ 26: అమెరికాకు చెందిన ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్.. భారత్‌లో ఇకపైనా తమ పెట్టుబడులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. భారత్‌లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని అమెజాన్ ప్రకటించింది. ఈ క్రమంలో అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో అమెజాన్ సంస్థ సిఇఒ జెఫ్ బేజోస్ భేటీ అయ్యారు.

Pages