S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/17/2016 - 02:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నోట్ల రద్దు భారత్‌లో భారీ మార్పును తీసుకు రానుందని, ఈ చర్య ఫలితంగా బ్యాంకుల్లో డిపాజిట్లు, డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్నాయని ఓ నివేదిక అంచనా వేసింది. 2025 నాటికల్లా నగదు రహిత రిటైల్ పేమెంట్లు ఏకంగా పది రెట్లు పెరిగే అవకాశముందని కూడా అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం డచ్ బ్యాంక్ అంచనా వేసింది.

12/17/2016 - 02:55

ముంబయి, డిసెంబర్ 16: మన దేశంతో ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలన్న లక్ష్యంతో కొరియా వాణిజ్య, పెట్టుబడుల అభివృద్ధి సంస్థ (కొట్రా) భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (్ఫక్కీ)తో కలసి ఈ నెల 19, 20 తేదీల్లో ఇక్కడ కొరియన్ ఎక్స్‌పో-2016ను నిర్వహించనుంది.

12/17/2016 - 02:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) ఈ ఏడాది నవంబర్ వరకు ఇటిఎఫ్ (ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లో 10,484 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. సెనె్సక్స్, నిఫ్టీల్లోని టాప్-50 సూచీలను ఆధారంగా చేసుకుని ఇపిఎఫ్‌ఓ ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇటిఎఫ్‌లలో పెట్టుబడులను ప్రారంభించిన విషయం తెలిసిందే.

12/17/2016 - 02:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: పెద్ద నోట్ల రద్దు కారణంగా కొనుగోళ్లు తగ్గిపోవడంతో దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిపోతున్నాయి. శుక్రవారం బంగారం ధర పదిగ్రాములకు ఏకంగా 500 రూపాయలు తగ్గిపోయి రూ. 28 వేల దిగువకు పడిపోవడమే కాక పది నెలల కనిష్టస్థాయి అయిన రూ. 27,750స్థాయికి చేరుకుంది.

12/17/2016 - 02:51

ముంబయి, డిసెంబర్ 16: దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా మరోసారి తగ్గాయి. ఈ నెల 9వ తేదీతో ముగిసిన వారంలో ఈ నిల్వలు 887.2 మిలియన్ డాలర్లు తగ్గి 362.987 బిలియన్ డాలర్లకు పతనమయ్యాయని, విదేశ కరెన్సీ ఆస్తులు తగ్గడమే ఇందుకు కారణమని రిజర్వు బ్యాంకు శుక్రవారం వెల్లడించింది. అంతకుముందు వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు 1.431 బిలియన్ డాలర్లు తగ్గి 363.874 బిలియన్ డాలర్లకు క్షీణించాయి.

12/17/2016 - 02:50

అమరావతి, డిసెంబర్ 16: పారిశ్రామికీకరణకు రాష్ట్రంలో వున్న అనుకూల పరిస్థితుల నేపథ్యంలో వేల పరిశ్రమలు నెలకొల్పడానికి అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయి. వీటిలో అతి భారీ, భారీ నుంచి మధ్యతరహా, చిన్న సూక్ష్మ పరిశ్రమల వరకు వున్నాయి.

12/17/2016 - 02:49

మచిలీపట్నం, డిసెంబర్ 16: కాసులు కురిపించాల్సిన ‘అపరాలు’ రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా పతనమైన మినుముల ధరలకు రైతులు కుదేలయ్యారు. దీంతో పెద్ద ఎత్తున నిల్వలు ఉంచిన రైతులకు పతనమైన ధరలు దిగాలుపడేలా చేశాయి. గత యేడాదితో పోలిస్తే మినుము ధర ఈ యేడాది పాతాళానికి పడిపోయింది. 50 శాతం పైబడి పడిపోయిన ధరలు రైతుల నడ్డి విరిచాయనే చెప్పవచ్చు.

12/16/2016 - 00:37

ముంబయి, డిసెంబర్ 15: అమెరికా ఫెడ్ రిజర్వ వడ్డీ రేట్లను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. వడ్డీ రేట్లను పావు శాతం పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించిన అమెరికా ఫెడ్ రిజర్వ్ వచ్చే ఏడాది మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచే అవకాశముందన్న సంకేతాలను సైతం ఇవ్వడం తెలిసిందే.

12/16/2016 - 00:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్న కొత్త 2000, 500 రూపాయల నోట్లను సరికొత్త భద్రతా ఫీచర్లతో దేశీయంగానే డిజైన్ చేయడం జరిగిందని, కనుక వీటికి నకిలీలను ముద్రించే అవశాకాలు చాలా తక్కువని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది.

12/16/2016 - 00:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు ఉపసంహరణల (విత్‌డ్రాయల్స్)పై విధించిన ఆంక్షలను సడలించే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త కరెన్సీని 80 శాతం మేరకు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత సహకార బ్యాంకులతో మొదలు పెట్టి ఈ ఆంక్షలను సడలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు గురువారం వెల్లడించారు.

Pages