S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/17/2017 - 00:34

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఏకకాలంలో 104 ఉపగ్రహాలను రోదసీలోకి విజయవంతంగా పంపడం వెనుక ఎల్ అండ్ టి ఏరోస్పేస్ విభాగం కూడా కీలక పాత్ర పోషించింది. తమ సంస్థలో భాగంగా ఉన్న ఏరోస్పేస్ విభాగం ఈ ప్రయోగంలో కీలక సేవలను అందించిందని ఎల్‌అండ్‌టి సంస్థ స్పష్టం చేసింది. ఏ రకంగా చూసినా ఇస్రో సాధించిన ఘనవిజయంలో తాము కూడా పాలు పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించింది.

02/17/2017 - 00:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పెద్దనోట్ల రద్దు అనంతరం జరిగిన వందలాది కోట్ల రూపాయల డిపాజిట్లపై ఆదా యం పన్ను విభాగం దృష్టి పెట్టింది. గత కొన్ని వారాలుగా ఈ డిపాజిట్ల తీరుతెన్నులను పరిమాణాన్ని లోతు గా విశే్లషించిన ఐటి విభాగం మొత్తం 9 లక్షల ఖాతాలు అనుమానాస్పదమైనవేనని వెల్లడించింది.

02/17/2017 - 00:30

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పెద్దనోట్ల రద్దు అనంతరం డిజిటల్ ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలవల్ల స్థూల జాతీయ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు. స్థూల జాతీయ ఉత్పత్తిపై పెద్దనోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు.

02/17/2017 - 00:29

మొట్టమెదటి ఎయర్‌బస్ 320 నియో విమానం గురువారం నాడు ఢిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. ఎయర్ ఇండియా తొలిసారి ఎయర్‌బస్ 320 విమానాన్ని తన జాబితాలో చేర్చుకుంది. మరో 13 విమానాలను లీజుకు తీసుకోబోతుంది.
చిత్రం..విమానం రాక సందర్భంగా ఎయర్ ఇండియా అధికారుల విజయదరహాసం.

02/17/2017 - 00:23

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: నాణ్యమైన, ఛాయ కలిగి ఎటువంటి రసాయనాలు కలపని కుంకుమను గిరిజన సహకార సంస్థ ఉత్పత్తి చేస్తోంది. సహజసిద్ధపైన ఈ కుంకుమను ఆర్డర్లపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు అందజేస్తోంది. దీంతో ఇప్పటి వరకు మార్కెట్లలో, షాపింగ్ మాల్స్‌ల్లో విక్రయించే నాణ్యత కొరవడిన కుంకుమకు ఉండే డిమాండ్ కాస్త పడిపోయింది.

02/16/2017 - 01:05

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారతీయ ఎగుమతులు గత నెలలో 4.32 శాతం పెరిగాయి. జనవరిలో 22.11 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు బుధవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పెట్రోలియం ఉత్పత్తుల్లో వృద్ధి కనిపించిందని, ఇంజినీరింగ్ గూడ్స్, ఐరన్ ఓర్ ఎగుమతులూ పెరిగాయని తెలిపింది. అయితే అంతకుముందు నెల డిసెంబర్‌తో చూస్తే 5.72 శాతం తగ్గాయి.

02/16/2017 - 01:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: గడచిన ఎనిమిదేళ్లలో కేవలం ఆరు ప్రభుత్వరంగ సంస్థలే స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించడంతో రాబోయే 2-3 ఏళ్లలో లాభాల్లో ఉన్న అన్ని ప్రభుత్వరంగ సంస్థలను స్టాక్ మార్కెట్లలోకి తీసుకురావాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఓ నిర్ణయానికొచ్చింది. దీనికి సంబంధించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్ళాలని నిశ్చయించుకుంది.

02/16/2017 - 01:03

ముంబయి, ఫిబ్రవరి 15: వ్యాపారపరంగా తాను ఎన్నో వైఫల్యాలను చవిచూశానని, అయితే ఎప్పుడూ కూడా వెనకడుగు వేయలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. బుధవారం ఇక్కడ నాస్కామ్ లీడర్‌షిప్ ఫోరమ్‌లో మాట్లాడిన ఆయన మన సొమ్ము కంటే మదుపరుల సొమ్ము భద్రంగా ఉన్నప్పుడే సంస్థ విజయపథంలో నడుస్తుందన్నారు. నాలుగో దశ పారిశ్రామిక విప్లవానికి చోదక శక్తి డేటానేనంటూ రిలయన్స్ జియో గురించి ప్రస్తావించారు.

02/16/2017 - 01:03

జర్మనీకి చెందిన లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ పోర్షే.. బుధవారం భారతీయ మార్కెట్‌కు రెండు సరికొత్త మోడళ్లను పరిచయం చేసింది.
718 కేమన్, 718 బాక్స్‌టర్ పేర్లతో వచ్చిన వీటి ధరలు ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం
81.63 లక్షల రూపాయలు, 85.53 లక్షల రూపాయలుగా ఉన్నాయ

02/16/2017 - 01:01

దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి.. బుధవారం మార్కెట్‌లోకి తమ మల్టీ-పర్పస్ వాహనం ఎర్టిగా లిమిటెడ్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 7.85 లక్షల రూపాయల నుంచి 8.10 లక్షల రూపాయల మధ్య ఉంది. ఈ నూతన ఎడిషన్ విఎక్స్‌ఐ, విడిఐ వేరియంట్లలో మూడు రంగుల్లో లభిస్తుంది

Pages