S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/19/2017 - 01:06

న్యూఢిల్లీ, జూన్ 18: పెద్దగా చెప్పుకోదగ్గవేమీ లేకపోవంతో ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను వర్ష సమాచారం అమితంగా ప్రభావితం చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నిర్ణయాలూ కీలకమేనని పేర్కొంటున్నారు. వచ్చే నెల 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి వస్తున్నది తెలిసిందే.

06/19/2017 - 01:05

న్యూఢిల్లీ, జూన్ 18: కొత్త ఆటోమెటిక్ ఎక్స్‌చేంజ్ విండో ద్వారా స్విస్ బ్యాంకుల్లోని డిపాజిట్ల వివరాలను అందుకుంటే, ఆ వివరాలను చాలా గోప్యంగా ఉంచాలని భారత్‌ను స్విట్జర్లాండ్ కోరింది. మరోవైపు నల్లధనంపై కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు కొనే్ననని ఆ దేశానికి చెందిన ప్రైవేట్ బ్యాంకర్లు చెబుతున్నారు.

06/19/2017 - 01:04

న్యూఢిల్లీ, జూన్ 18: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రిటర్న్ ఫైలింగ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించింది. జూలై 1 నుంచే జిఎస్‌టి అమల్లోకి వస్తుందన్న జిఎస్‌టి కౌన్సిల్.. జిఎస్‌టి రిటర్న్ ఫైలింగ్‌కు రెండు నెలల గడువు ఇచ్చింది. సెప్టెంబర్ నుంచి మాత్రం తప్పక జిఎస్‌టి రిటర్న్ ఫైలింగ్ జరగాల్సిందేనని చెప్పింది.

06/19/2017 - 01:03

భీమవరం, జూన్ 18: కేవలం వ్యవసాయ రంగం కోసమే ప్రవేశపెట్టిన చంద్రన్న రైతు క్షేత్రాలు ఇప్పుడు ఆక్వా రంగానికి అండగా నిలువనున్నాయి. అన్నదాతలు మాదిరిగా ఆక్వా రైతులు ఆర్థిక ఇబ్బందులతో సమమతమవుతున్నారు. ప్రతీసారి పంట చేతికి వచ్చే సమయంలో వాతావరణంలో వచ్చిన మార్పులు, వైరస్ తదితర కారణాల వల్ల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. దీంతో వారికి వెన్నుదన్నుగా ఉండేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

06/19/2017 - 01:01

న్యూఢిల్లీ, జూన్ 18: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. జనవరి మినహా, ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయ. ప్రస్తుత నెల జూన్‌లో కూడా 3.55 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయ. 15 రోజుల్లో 23 వేల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను తెచ్చారు విదేశీ మదుపరులు.

06/18/2017 - 00:23

పప్పుధాన్యాలు, ఉల్లిగడ్డ, కూరగాయలు, పండ్లు, బంగాళదుంప, గుడ్లు, మాంసం, చేపల ధరలు దిగిరావడంతో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది

06/18/2017 - 00:21

న్యూఢిల్లీ, జూన్ 17: దేశంలో మొబైల్ డేటా వినియోగం గడచిన మూడేళ్లలో 142 శాతం పెరిగింది. స్మార్ట్ఫోన్ వాడుతున్న ఒక్కో వినియోగదారుడు తన ఇంటర్నెట్ వినియోగాన్ని ఈ మూడేళ్లలో 142 శాతం పెంచుకున్నట్లు నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ శనివారం తెలిపారు. 2014-15, 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో భారత్‌లో డిజిటల్ యాక్సెస్‌లో చెప్పుకోదగ్గ ప్రగతి చోటుచేసుకుందని ట్విట్టర్‌లో కాంత్ పేర్కొన్నారు.

06/18/2017 - 00:26

న్యూఢిల్లీ, జూన్ 17: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలును వాయిదా వేయాలని వ్యాపార, పారిశ్రామిక సంఘం అసోచామ్.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసింది. ఐటి నెట్‌వర్క్ ఇంకా సిద్ధం కాలేదని, పన్ను చెల్లింపుదారులు ఈ కొత్త పరోక్ష పన్నుల విధానం క్రింద ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయడం కష్టతరంగా ఉంటుందని అందులో పేర్కొంది.

06/18/2017 - 00:19

హైదరాబాద్, జూన్ 17: వచ్చే ఆరు నెలల కాలంలో పలు భారీ పరిశ్రమల ఏర్పాటు కోసం తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రణాళిక రూపొందించింది. సాధారణ ఎన్నికలకు మరో 21 నెలల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమల స్థాపన ద్వారా పాజిటివ్ సంకేతాలు పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తొలిసారిగా హైదరాబాద్ బయట ఐటి పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లాలో ఐటి పార్క్‌కు కెటిఆర్ శంకుస్థాపన చేశారు.

06/18/2017 - 00:17

హైదరాబాద్, జూన్ 17: దేశంలో వినూత్నమైన ఉత్పత్తులను విక్రయించే ఆన్‌లైన్ వేదిక క్రాఫ్ట్‌లీ.. సరికొత్త ముందడుగు వేసింది. విక్రయదారులకు ఎస్‌ఎంబిఎస్‌కు సొంత వెబ్‌సైట్‌ను రూపొందించి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలను ఆ సంస్థ సిఇఒ సాహిల్ గోయల్ తెలిపారు. ఈ వెబ్‌సైట్‌లో అత్యాధునిక ఫీచర్లతోపాటు విస్తృతమైన మరెన్నో ఫీచర్లు ఉంటాయి.

Pages