S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/18/2017 - 00:17

హైదరాబాద్, జూన్ 17: దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం జిఎస్‌టి బిల్లులను తయారు చేసేందుకు దేశీయ అతిపెద్ద ఆదాయ పన్ను రిటర్న్స్ ఈ ఫైలింగ్ సర్వీస్ ప్రొవైడర్ క్లియర్ ట్యాక్స్ సంస్థ బిల్ బుక్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది.

06/18/2017 - 00:16

హైదరాబాద్, జూన్ 17: తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మకమైన రెండు అవార్డులను అందుకున్నట్లు హైదరాబాద్‌లోని మెర్క్యురీ కెసిపి సంస్థ ప్రకటించింది. నాలుగు నక్షత్రాల హోటళ్ల కేటగిరీలో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్‌లో విన్నర్‌గా ఎంపికైనట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ అవార్డులను సంస్థ జనరల్ మేనేజర్ దినేష్ రాయ్, చీఫ్ చెఫ్ వినయ్ టి, మేనేజర్ రమేష్ అందుకున్నారు.

06/18/2017 - 00:14

గోదావరిఖని, జూన్ 17: వారసత్వ ఉద్యోగాల సాధనే ధ్యేయంగా కార్మికులకు, సింగరేణి సంస్థకు మధ్య జరుగుతున్న పోరు నేపథ్యంలో యాజమాన్యం ప్రకటనలు.. సింగరేణి అభివృద్ధికి కార్మికులే ఆటంకాలా? అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయ.

06/17/2017 - 02:35

ముంబయి, జూన్ 16: పశ్చిమాది దేశాల మార్కెట్లలో నెలకొన్న రక్షణాత్మక ధోరణుల మధ్య కూడా తమ సంస్థకు వచ్చిన ఇబ్బందులేమీ లేవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు దేశీయ ఐటి రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్. భారతీయ ఐటి సంస్థల ఆదాయంలో అధిక శాతం అమెరికా, తదితర పశ్చిమ దేశాల నుంచే వస్తున్నది తెలిసిందే. ముఖ్యంగా అమెరికానే భారతీయ ఐటి మార్కెట్లకు కీలకం.

06/17/2017 - 00:35

న్యూఢిల్లీ, జూన్ 16: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పోర్టల్‌పై వ్యాపారులు తమ విక్రయ వివరాలను అప్‌లోడ్ చేసేందుకు వీలుగా ఈ నెల 25న ఓ ఆఫ్‌లైన్ ఎక్సెల్ షీట్ ఫార్మాట్‌ను జిఎస్‌టి నెట్‌వర్క్ విడుదల చేయనుంది. వచ్చే నెల 1 నుంచి జిఎస్‌టి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్నది తెలిసిందే.

06/17/2017 - 00:34

న్యూఢిల్లీ, జూన్ 16: దేశీయ ఆటో రంగ దిగ్గజం, ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారైన హీరో మోటోకార్ప్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ పవన్ ముంజల్.. గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 59.66 కోట్ల రూపాయల వేతనాన్ని అందుకున్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే ఇది 3.94 శాతం అధికం. ఈ మేరకు 2016-17కుగాను సంస్థ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడైంది.

06/17/2017 - 00:33

శుక్రవారం గురుగ్రామ్‌లోని ఏరోసిటి వద్ద యు11 స్మార్ట్ఫోన్‌ను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న హెచ్‌టిసి దక్షిణాసియా అధ్యక్షుడు ఫైజల్ సిద్ధిఖి. దీని ధర 51,990 రూపాయలు

06/17/2017 - 00:31

చిత్రం.. దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఇజిఆర్ టెక్నాలజీతో తయారైన ట్రక్కులను శుక్రవారం న్యూఢిల్లీలో ప్రదర్శించింది అశోక్ లేలాండ్ సంస్థ. వీటి గురించిన వివరాలను మీడియాకు సంస్థ తెలియజేసింది

06/17/2017 - 00:29

హైదరాబాద్, జూన్ 16: వ్యవసాయ యంత్రాల తయారీలో అంతర్జాతీయంగా పేరుపొందిన శక్తిమాన్ ఆగ్రో కంపెనీ.. తెలంగాణ రాష్ట్రంలో కర్మాగారం స్థాపనకు ముందుకు వచ్చింది. శుక్రవారం పరిశ్రమ భవన్‌లో టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లుతో శక్తిమాన్ ఆగ్రో కంపెనీ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ దినేష్ వశిష్ట సమావేశమయ్యారు.

06/17/2017 - 00:28

న్యూఢిల్లీ, జూన్ 16: రాబోయే నాలుగేళ్లలో భారత డిజిటల్ ఎకానమీ సామర్థ్యం 4 ట్రిలియన్ డాలర్లకు చేరనుందని శుక్రవారం టెక్నాలజీ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి తెలిపాయి. 2022 నాటికి దేశ డిజిటల్ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్లను తాకుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్న క్రమంలో దాన్ని అధిగమించి 4 ట్రిలియన్ డాలర్లకు వెళ్తుందన్నారు ప్రముఖ టెక్కీలు.

Pages