S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/17/2017 - 00:27

న్యూఢిల్లీ, జూన్ 16: వచ్చే వారం కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం.. 7వ వేతన సంఘం సిఫార్సులపై దృష్టి పెట్టనుంది. హెచ్‌ఆర్‌ఎ తదితర అలవెన్సుల ప్రతిపాదనలపై చర్చించనుందని నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ (ఎన్‌జెసిఎ) కన్వీనర్ శివ్ గోపాల్ మిశ్రా ఓ ప్రముఖ జాతీయ వార్తా చానెల్‌తో చెప్పారు.

06/17/2017 - 00:27

ముంబయి, జూన్ 16: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ నష్టాలను అందుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ లాభాలను పొందింది. సెనె్సక్స్ 19.33 పాయింట్లు కోల్పోయి 31,056.40 వద్ద నిలవగా, నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 9,588.05 వద్ద నిలిచింది. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 205.66 పాయింట్లు, నిఫ్టీ 80.20 పాయింట్లు కోల్పోయాయి.

06/16/2017 - 00:30

న్యూఢిల్లీ, జూన్ 15: మార్కెట్‌లో జిఎస్‌టి ఆఫర్లు పోటెత్తాయి. వచ్చే నెల 1 నుంచి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమల్లోకి వస్తున్న క్రమంలో వినియోగదారులను ఆకట్టుకునే పనిలోపడ్డారు దుకాణదారులు. ఆ వస్తువు, ఈ వస్తువు అని తేడా లేకుండా అన్నింటిపైనా డిస్కౌంట్లు దర్శనమిస్తున్నాయిప్పుడు. కార్లు, ఎయిర్ కండీషనర్లు, టెలివిజన్లు, స్మార్ట్ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, పాదరక్షలు, వస్త్రాలు ఇలా..

06/16/2017 - 00:27

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. ప్రీ-పెయిడ్ కస్టమర్లను ఆకట్టుకునేందుకు గురువారం సరికొత్త పథకాన్ని పరిచయం చేసింది. 90 రోజుల కాలపరిమితితో 444 రూపాయలకు 3జి వేగానికి రోజుకు 4జిబి డేటాను ఇస్తామని తెలిపింది. ఈ పథకంలో ఒక గిగాబైట్ 3జి మొబైల్ డేటాకు కస్టమర్ చెల్లించేది రూపాయి కంటే తక్కువేనని బిఎస్‌ఎన్‌ఎల్ కన్జ్యూమర్ మొబిలిటి డైరెక్టర్ ఆర్‌కె మిట్టల్ తెలిపారు.

06/16/2017 - 00:26

న్యూఢిల్లీ, జూన్ 15: రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ (రెరా)తో దేశ జిడిపి వృద్ధిరేటు బలోపేతమవుతుందని పారిశ్రామిక సంఘం పిహెచ్‌డి చాంబర్ అభిప్రాయపడింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రాగా, దానివల్ల కొనుగోలుదారుల్లో అనవసర భయాలు తొలగిపోయాయని పిహెచ్‌డి చాంబర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ తల్వార్ ఓ సదస్సులో గురువారం ఇక్కడ అన్నారు.

06/16/2017 - 00:26

న్యూఢిల్లీ, జూన్ 15: ప్రపంచ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2017లో భారత్.. నిరుడుకన్నా తన స్థానాన్ని మరింత మెరుగుపర్చుకొని 60వ స్థానానికి చేరింది. 130 దేశాలున్న ఈ జాబితాలో భారత్ నిరుడు 66వ స్థానంలో ఉండగా, ఈ సారి 60వ స్థానానికి చేరుకొంది. ఫలితంగా మధ్య, దక్షిణాసియాలో టాప్ ర్యాంక్ పొందిన దేశంగా నిలిచింది.

06/16/2017 - 00:25

న్యూఢిల్లీ, జూన్ 15: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వస్త్ర వ్యాపారులు గురువారం బంద్ పాటించారు. దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి, రోడ్లపై ఆందోళనలు నిర్వహించారు. అధిక పన్ను తో తమకు నష్టం వాటిల్లుతోందని, వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

06/16/2017 - 00:24

న్యూఢిల్లీ, జూన్ 15: దేశీయ ఎగుమతులు గత నెలలో 8.32 శాతం పెరిగాయి. మే నెలలో 24.01 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. నిరుడు మే నెలలో 22.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయ. పెట్రోలియం, కెమికల్స్, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు పుంజుకున్నాయి.

06/16/2017 - 00:23

చిత్రం.. కేజి-డి6 బేసిన్‌లో గ్యాస్ క్షేత్రాల పునఃప్రారంభానికి 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు రిలయన్స్, బ్రిటీష్ పెట్రోలియం ముందుకొచ్చాయ. గురువారం ఇక్కడ ఇరు సంస్థల అధిపతులు భేటీ అయ్యారు

06/16/2017 - 00:21

కొత్తగూడెం, జూన్ 15: వారసత్వ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా సింగరేణి కాలరీస్ సంస్థలో గురువారం సమ్మె ప్రారంభమయింది. ఐదు జాతీయ కార్మిక సంఘాలతోపాటు విప్లవ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనటంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనులు వెలవెలబోతుండగా, ఓపెన్ కాస్ట్‌లలో మాత్రం కార్మికులు విధులకు హాజరవుతున్నారు.

Pages