S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/14/2017 - 00:08

విజయవాడ, జూన్ 13: కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని గెయిల్, హెచ్‌పిసిఎల్ ప్రతినిధులకు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నెలకొల్పేందుకు గల సాధ్యాసాధ్యాలపై గెయిల్, హెచ్‌పిసిఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి మంగళవారం సాయంత్రం నివేదిక సమర్పించారు.

06/14/2017 - 00:06

ముంబయ, జూన్ 13: ఆర్‌బిఐ త్వరలో నూతన 500 రూపాయల నోట్లను జారీ చేయనుంది. మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌లో ఈ బ్యాంక్ నోట్లు విడుదల కానున్నాయి. ‘ఎ’ ఇన్‌సెట్ లెటర్‌తో, ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఇవి రానున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే.

06/13/2017 - 00:30

టెక్నాలజీ దిగ్గజం గూగుల్.. భారతీయ మార్కెట్‌లోకి తమ ‘డేడ్రీమ్ వ్యూ’ను విడుదల చేసింది. దీని ధర 6,499 రూపాయలు. సామ్‌సంగ్, హెచ్‌టిసి ఉత్పత్తులకు పోటీగా దీన్ని విపణిలోకి ప్రవేశపెట్టింది గూగుల్. ఫ్లిప్‌కార్ట్‌లో లభించే ఈ డేడ్రీమ్ వ్యూతో వినియోగదారులు సరికొత్త దృశ్య అనుభూతిని పొందగలరంది. నిరుడు నవంబర్‌లో అమెరికాతోపాటు బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల మార్కెట్‌కు దీన్ని గూగుల్ పరిచయం చేసింది

06/13/2017 - 00:28

బ్రిటన్‌కు చెందిన సూపర్‌బైక్‌ల తయారీ సంస్థ
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ సోమవారం భారతీయ మార్కెట్‌కు తమ న్యూ స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ సూపర్‌బైక్‌ను పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం దీని ధర 8.5 లక్షల రూపాయలు. 2018కల్లా బైక్ అమ్మకాల్లో 90 శాతం స్థానికంగా తయారు చేసినవే ఉంటాయని సంస్థ దేశీయ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ విమల్ సుంబ్లే ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు

06/13/2017 - 00:26

న్యూఢిల్లీ, జూన్ 12: బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) సమస్య పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తీవ్రంగా కృషి చేస్తోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. సోమవారం ఇక్కడ ఆయన ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో సమావేశమయ్యారు.

06/13/2017 - 00:25

న్యూఢిల్లీ, జూన్ 12: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) వృద్ధిరేటు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 3.1 శాతానికి పతనమైంది. తయారీ, గనులు, విద్యుత్ రంగాల్లో పేలవమైన ప్రదర్శన నమోదైంది. అంతకుముందు నెల మార్చిలోనూ 3.8 శాతంగా ఉండగా, ఈసారి ఇది మరింత క్షీణించింది. ఇక నిరుడు ఏప్రిల్‌లో 6.5 శాతంగా ఉన్న వృద్ధిరేటు కాస్తా తాజాగా 3.1 శాతానికి దిగజారింది.

06/13/2017 - 00:25

న్యూఢిల్లీ, జూన్ 12: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో రికార్డు స్థాయి కనిష్టానికి తగ్గింది. మే నెలలో 2.18 శాతంగా నమోదైనట్లు సోమవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) తెలియజేసింది. కూరగాయలు, పప్పు్ధన్యాలు తదితర కీలక ఆహారోత్పత్తుల ధరలు దిగిరావడం వల్లే వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది.

06/13/2017 - 00:24

హైదరాబాద్, జూన్ 12: అక్టోబర్‌లో ఫార్మాసిటీని ప్రారంభించనున్నట్టు, ఈ నెల 17న మెడికల్ డివైజెస్ పార్క్‌ను మొదలు పెట్టనున్నట్టు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి సోమవారం ఇక్కడ విడుదల చేశారు. ఫార్మాసిటీ మొదటి దశ 8,200 ఎకరాల్లో ప్రారంభం అవుతుందని, ఇప్పటికే 6,300 ఎకరాలు సేకరించినట్టు చెప్పారు.

06/13/2017 - 00:21

న్యూఢిల్లీ, జూన్ 12: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని 4జి టెలికామ్ సంస్థ జియో.. సోమవారం దేశీయ టెలికామ్ పరిశ్రమ లాభాలు బాగానే ఉన్నాయంది. కేవలం ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థల కుట్రల వల్లే మొత్తం పరిశ్రమ, ముఖ్యంగా చిన్న టెలికామ్ సంస్థలు ఇబ్బందుల్లో పడుతున్నాయని ఆరోపించింది. జియో ఉచిత ఆఫర్లపై ఈ మూడు సంస్థలు పోరాటం చేస్తున్నది తెలిసిందే.

06/13/2017 - 00:20

న్యూఢిల్లీ, జూన్ 12: బీమా రంగ నియంత్రిత వ్యవస్థ ఐఆర్‌డిఎఐ.. సోమవారం సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజ్‌మెంట్‌ను టేకోవర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారం పర్యవేక్షణకు తమ జనరల్ మేనేజర్లలో ఒకరైన ఆర్‌కె శర్మను అడ్మినిస్ట్రేటర్‌గా నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది.

Pages