S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/13/2017 - 00:19

ముంబయి, జూన్ 12: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్.. సోమవారం తమ జనరల్ ఇన్సూరెన్స్ వెంచర్ పబ్లిక్ ఆఫర్ ప్రణాళికను ప్రకటించింది. ఈ వాటా అమ్మకం ద్వారా వ్యూహాత్మక భాగస్వామిని కూడా సంస్థ అనే్వషిస్తోంది. కాగా, సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు పబ్లిక్ ఇష్యూకు ఆమోదం తెలిపారు.

06/13/2017 - 00:19

ముంబయి, జూన్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని మొండి బకాయిల ప్రభావం మదుపరులపై పడింది. దీంతో బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ విలువ 1.88 శాతం, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ షేర్ విలువ 1.20 శాతం, యాక్సిస్ బ్యాంక్ షేర్ విలువ 1.18 శాతం మేర దిగజారింది.

06/13/2017 - 00:18

ముత్తుకూరు, జూన్ 12: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సాగరమాల ప్రాజెక్టులో భాగంగా నీతి ఆయోగ్ ప్రతినిధుల బృందం సోమవారం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించింది. అనంతరం పోర్టు ఆవరణలో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటారు.

06/13/2017 - 00:16

ఒంగోలు, జూన్ 12: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లో 28 శాతం విధించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్టవ్య్రాప్తంగా పొగాకు కొనుగోళ్ళను నిలిపివేసి సోమవారం రైతు సంఘం నాయకులు నిరసన వ్యక్తంచేశారు.

06/12/2017 - 00:34

న్యూఢిల్లీ, జూన్ 11: స్థూల ఆర్థిక గణాంకాలు, ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వర్ష సమాచారం, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నిర్ణయాలూ కీలకమేనని పేర్కొంటున్నారు. వచ్చే నెల 1 నుంచి జిఎస్‌టి అమల్లోకి వస్తున్నది తెలిసిందే.

06/12/2017 - 00:32

చేబ్రోలు, జూన్ 11: నిత్యం వంటల్లో వాడే కొత్తిమీర ధర మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. స్థానికంగా సాగు లేక కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో ధర విపరీతంగా పెరిగిందని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు. కొత్తిమీర చలికాలంలో మాత్రమే మన ప్రాంతంలో పండుతుందంటున్నారు. కాగా, రంజాన్ ఉపవాస దీక్షలు జరుగుతుండటంతోపాటు వాతావరణ అననుకూల పరిస్థితి కారణంగా కొత్తిమీరకు గిరాకీ ఏర్పడింది.

06/12/2017 - 00:39

అనంతపురం, జూన్ 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుపుతామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి జెపి నడ్డా తెలిపారు. వేరుశనగ పంటను ఫసల్ బీమా యోజన పథకంలో చేర్చేందుకు కేంద్రం ఆలోచిస్తోందన్నారు. వచ్చే ఏడాదిలో దేశంలో ప్రతి గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించి వంద శాతం కరెంటు గల దేశంగా తీర్చిదిద్దుతామన్నారు.

06/12/2017 - 00:31

భీమవరం, జూన్ 11: వాతావరణంలో వస్తున్న మార్పులతో ఆక్వా రంగం కుదేలవుతోంది. ఎప్పుడు భానుడు తన ప్రతాపాన్ని చూపుతాడో, మరెప్పుడు వరుణుడు ఆగ్రహించి ముంచెత్తుతాడో తెలియక ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రాన్ని కుదిపేసిన ఉష్ణోగ్రతల ప్రభావానికి చాలామంది ఆక్వా రైతులు నష్టపోగా, ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న భారీ వర్షాలకు మిగిలిన రైతులు కూడా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

06/12/2017 - 00:30

న్యూఢిల్లీ, జూన్ 11: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, కాకతీయ నీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులకు పన్ను మినహాయింపులు ఇచ్చేందుకు కేంద్రం సానుకులంగా లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన జిఎస్‌టి సమావేశం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగింది. ఈ సమావేశానికి ఈటల హాజరైయ్యారు.

06/12/2017 - 00:29

న్యూఢిల్లీ, జూన్ 11: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి (టిటిడి) పన్ను మినహాయింపు ఇవ్వాలన్న ఏపి విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించినట్టు సూత్రప్రాయంగా తెలుస్తొంది. ఆదివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జిఎస్‌టి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు హాజరయ్యారు.

Pages