S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/12/2017 - 00:03

న్యూఢిల్లీ, జూన్ 11: దేశీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. జనవరి మినహా, ఫిబ్రవరి నుంచి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయ. ప్రస్తుత నెల జూన్‌లో కూడా దాదాపు 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయ. కేవలం వారం రోజుల్లో 11 వేల కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చారు విదేశీ మదుపరులు.

06/11/2017 - 01:59

ముంబయి, జూన్ 10: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్)ను విభజించే ప్రసక్తే లేదని కేంద్ర విద్యుత్, బొగ్గు, నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి (స్వతంత్ర హోదా) పియూష్ గోయల్ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ ఇటీవల కోల్ ఇండియాలోని అనుబంధ సంస్థలను విడదీయాలని సూచించిన నేపథ్యంలో మంత్రి పైవిధంగా స్పందించారు. ‘నీతి ఆయోగ్ సిఫార్సులను మేము పరిగణనలోకి తీసుకోవడం లేదు.

06/11/2017 - 02:04

శనివారం కొచ్చి సముద్ర తీరానికి ప్రపంచంలోని అత్యంత లగ్జరీ ప్రయాణ నౌకల్లో ఒకటైన మెజిస్టిక్ ప్రినె్సస్ నౌక వచ్చింది. దీన్ని ఆసక్తిగా చూస్తున్న ఓ కుటుంబం. 19 అంతస్తులు, 1,780 క్యాబిన్లు కలిగిన ఈ నౌక వేగం గంటకు
41 కిలోమీటర్లు. దీని బరువు లక్షా 43 వేల 700 టన్నులు. ఈ ఏడాది మార్చి 31న దీన్ని ప్రారంభించారు

06/11/2017 - 01:54

న్యూఢిల్లీ, జూన్ 10: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు సంబంధించి ఎదురయ్యే సమస్యల పరిష్కారానికిగాను ఎగుమతిదారులతోసహా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక భాగస్వాములతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కలిసి పనిచేస్తోంది. ఇందులో భాగంగానే సదరు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్‌టి).. ఓ జిఎస్‌టి ఫెసిలిటేషన్ సెల్‌ను తాజాగా ఏర్పాటు చేసింది.

06/11/2017 - 01:51

ఒంగోలు, జూన్ 10: పొగాకు ముడిసరుకుపై కేంద్ర ప్రభుత్వం 23 శాతం వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) విధించటాన్ని నిరసిస్తూ నవ్యాంధ్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పొగాకు వేలం కేంద్రాల్లో పొగాకు లావాదేవీలను ఒకరోజు నిలిపివేయాలని నిర్ణయంచారు. ఈ నెల 12వ తేదీ (సోమవారం)న అమ్మకాలను, కొనుగోళ్లను ఆపేయాలని రాష్ట్రంలోని పొగాకు వేలం కేంద్రాల పరిధిలోని రైతు సంఘాల నాయకులు నిర్ణయం తీసుకున్నారు.

06/11/2017 - 01:51

హైదరాబాద్, జూన్ 10: కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ జెనీవాకు వెళ్లనున్నారు. ఈ నెల 12-16 మధ్య అక్కడ జరిగే అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) 106వ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ప్రపంచ బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా 12వ తేదీ (సోమవారం)న తాను ఐఎల్‌ఒ సమావేశంలో మాట్లాడనున్నట్లు శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు.

06/11/2017 - 01:49

హైదరాబాద్, జూన్ 10: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంక్‌కు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఎక్స్‌లెన్స్ అవార్డు లభించింది. 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల (ఆర్‌ఎస్‌ఇటిఐఎస్)కు కేటగిరి ‘సి’ క్రింద నేతృత్వం వహించినందుకుగాను ఈ అవార్డు లభించిందని ఆంధ్రాబ్యాంక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.

06/10/2017 - 00:44

న్యూఢిల్లీ, జూన్ 9: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) వ్యాపార మండలికి ఫిక్కీని భారతీయ వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎస్‌సిఒ బిజినెస్ కౌన్సిల్‌లో ఇండియన్ ఇండస్ట్రీకి ఫిక్కీ ప్రాతినిథ్యం వహిస్తుందని ఫిక్కీ అధ్యక్షుడు పంకజ్ పటేల్ శుక్రవారం తెలియజేశారు. కాగా, రెండేళ్ల కృషి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాలకు శుక్రవారం ఎస్‌సిఒ పూర్తిస్థాయి సభ్యత్వం దక్కింది.

06/10/2017 - 00:42

ముంబయి, జూన్ 9: భారతీయ విదేశీ మారకద్రవ్య (్ఫరెక్స్) నిల్వలు మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెల 2తో ముగిసిన వారంలో 2.404 బిలియన్ డాలర్లు పెరిగి 381.167 బిలియన్ డాలర్లను తాకాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తెలియజేసింది. కాగా, అంతకుముందు వారం 547 మిలియన్ డాలర్లు పెరిగి 378.763 బిలియన్ డాలర్ల వద్ద ఉన్నట్లు ఆర్‌బిఐ స్పష్టం చేసింది.

06/10/2017 - 00:41

న్యూఢిల్లీ, జూన్ 9: దేశీయ ప్రముఖ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్ విదేశీ అమ్మకాలు గత నెలలో ఒక శాతానికిపైగా క్షీణించాయి. మే నెలలో 86,385 యూనిట్ల విక్రయాలు జరిగినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో టాటా మోటార్స్ తెలియజేసింది. నిరుడు మే నెలలో 87,414 యూనిట్ల అమ్మకాలు జరిగాయంది. ప్యాసింజర్ వాహన విభాగంలో అమ్మకాలు 6 శాతం పెరిగినా.. వాణిజ్య వాహన విభాగంలో మాత్రం 13 శాతం తగ్గాయని చెప్పింది.

Pages