S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

06/08/2017 - 01:13

న్యూఢిల్లీ, జూన్ 7: దేశీయ ఆటో రంగ సంస్థ టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) రిటైల్ అమ్మకాలు గత నెల మేలో 1 శాతం పెరిగాయి. ఈసారి 45,487 యూనిట్ల విక్రయాలు జరిగాయని బుధవారం జెఎల్‌ఆర్ తెలియజేసింది. వీటిలో జాగ్వార్ బ్రాండ్ కార్ల అమ్మకాలు 28 శాతం వృద్ధితో 13,613 యూనిట్లుగా నమోదైతే, లాండ్ రోవర్ విక్రయాలు మాత్రం 7.1 శాతం దిగజారి 31,874 యూనిట్లకు పరిమితమయ్యాయి.

06/07/2017 - 02:07

న్యూఢిల్లీ, జూన్ 6: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష మంగళవారం ప్రారంభమైంది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండు రోజులు జరిగే ఈ సమీక్షలో బుధవారం కీలక వడ్డీరేట్లపై నిర్ణయాలు రానున్నాయి. అయితే ఈసారి ఆర్‌బిఐ.. కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే వీలుందన్న అంచనాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

06/07/2017 - 02:02

న్యూఢిల్లీ, జూన్ 6: సొనాలిక ట్రాక్టర్ల అమ్మకాలు గత నెలలో 26 శాతం పెరిగాయి. ఈ ఏడాది మే నెలలో 8,335 యూనిట్లుగా నమోదైతే, నిరుడు మే నెలలో ఇవి 6,604 యూనిట్లుగా ఉన్నాయి. ఇక ఈసారి మే నెల అమ్మకాల్లో దేశీయంగా జరిగినవి 7,267 యూనిట్లుగా ఉన్నాయి. అంతకుముందుతో పోల్చితే ఇవి 26.6 శాతం పెరిగాయని మంగళవారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. ఎగుమతులు కూడా 23.3 శాతం పెరగగా, 1,068 యూనిట్లుగా నమోదయ్యాయి.

06/07/2017 - 02:02

న్యూఢిల్లీ, జూన్ 6: నిర్మాణ రంగ సంస్థ ఒమాక్స్ లిమిటెడ్ విక్రయాల బుకింగ్స్ గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో 43 శాతం క్షీణించి 946 కోట్ల రూపాయలకు పరిమితమయ్యాయి. మదుపరులకు తెలియజేసిన వివరాల ప్రకారం 2016-17లో 3.2 మిలియన్ చదరపు అడుగుల విక్రయాలు జరిగాయని ఓమాక్స్ తెలిపింది. 2015-16లో ఇది 4.89 మిలియన్ చదరపు అడుగుల అమ్మకాలుగా ఉన్నాయంది.

06/07/2017 - 02:01

ముంబయి, జూన్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. దీంతో వరుస లాభాలతో రోజుకో సరికొత్త స్థాయిలను చేరుకుంటున్న సూచీల రికార్డులకు బ్రేక్ పడినట్లైంది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 118.93 పాయింట్లు పతనమై 31,190.56 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 37.95 పాయింట్లు కోల్పోయి 9,637.15 వద్ద నిలిచింది.

06/07/2017 - 02:00

హైదరాబాద్, జూన్ 6: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో (ఇఒడిబి) ర్యాంక్‌లు సాధించడం ఇక ముందు అంత ఈజీ కాదు. రాష్ట్రాలు పంపించే సమాచారం ఆధారంగా ఇంతకాలం ర్యాంక్‌లు ఇచ్చిన కేంద్రం.. ఇక నుంచి క్షేత్రస్థాయి పరిశీలన జరిపిన తర్వాతనే ర్యాంక్‌లు ఇవ్వాలని నిర్ణయించింది.

06/07/2017 - 01:58

హైదరాబాద్, జూన్ 6: తెలంగాణలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయిలో ఉన్నందున విద్యుత్తు ప్లాంట్లలో తగినంత బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉండేలా బొగ్గు ఉత్పత్తి, రవాణాకు తగు చర్యలు తీసుకోవాలని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీ్ధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో డైరెక్టర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో ఆయన సమీక్షించారు.

06/07/2017 - 01:58

విజయవాడ, జూన్ 6: సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూలై 1 నుంచి కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్టు నవ్యాంధ్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ చెప్పారు. మద్యాన్ని కల్తీచేస్తే ఆ షాపు లైసెన్స్ రద్దు చేసేలా ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

06/07/2017 - 01:57

భీమవరం, జూన్ 6: అందరూ ఎయిర్‌పోర్టులు కావాలని అడుగుతున్నారని, అయితే ఎయిర్‌పోర్టులు రావాలంటే రైతులు భూములను త్యాగం చేయాల్సి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. ‘అందరితో కలిసి అందరి అభివృద్ధి’ సమ్మేళన్‌లో భాగంగా అశోక్ గజపతిరాజు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండవ రోజు పర్యటించారు.

06/07/2017 - 01:55

న్యూఢిల్లీ, జూన్ 6: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలైతే దేశ జిడిపి వృద్ధిరేటు 9 శాతాన్ని తాకగలదన్న విశ్వాసాన్ని నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ వ్యక్తం చేశారు. వచ్చే నెల 1 నుంచి ఈ చారిత్రాత్మక పరోక్ష పన్నుల విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తున్నది తెలిసిందే. ఇప్పటికే కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అందుకు తగిన ఏర్పాట్లన్నింటినీ చకచకా చేసేస్తోంది.

Pages