S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/17/2017 - 00:59

న్యూఢిల్లీ, మే 16: పెద్ద నోట్ల రద్దు అనంతరం అప్రకటిత సొమ్ము రహస్యతను కోల్పోయిందని, దీంతో 91 లక్షల మంది పన్నుల వ్యవస్థ పరిధిలోకి వచ్చారని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. న్యూఢిల్లీలో మంగళవారం ఆయన అక్రమ సంపదను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

05/17/2017 - 00:58

విశాఖపట్నం, మే 16: బెల్జియం దేశంలో విస్తృత వాణిజ్యావకాశాలు ఉన్నాయని, భారత్‌లోని వ్యాపార వేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని బెల్జియం ట్రేడ్ అండ్ ఇనె్వస్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ కమిషనర్ జయంత్ నడిగర్ అన్నారు.

05/17/2017 - 00:56

న్యూఢిల్లీ, మే 16: దేశంలోని ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అతిపెద్దదైన ఐసిఐసిఐ బ్యాంకు సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఎదురుచూస్తున్న మధ్యతరగతి ప్రజలకు తీపి కబురు అందించింది. 30 లక్షల రూపాయల లోపు గృహ రుణాలపై ఆ బ్యాంకు వడ్డీ రేటును 0.3 శాతం తగ్గించింది.

05/17/2017 - 00:54

ముంబయి, మే 16: టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఆపరేటింగ్ లాభాలు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 10.2 శాతం తగ్గి రూ. 11,784 కోట్లకు చేరుకున్నాయి. ప్రధానంగా రియలెన్స్ జియో రంగ ప్రవేశం తర్వాత ధరల విషయంలో పోటీయే వొడాఫోన్ లాభాలు తగ్గడానికి ముఖ్య కారణంగా కనిపిస్తోంది.

05/17/2017 - 00:53

ముంబయి, మే 16: గత కొంతకాలంలో మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతుండడంతో దేశంలోని అతి పెద్ద ఫైనాన్షియల్ ఇనె్వస్టర్ అయిన జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో పెట్టిన పెట్టుబడులకుగాను అంతకు ముందు సంవత్సరంకన్నా ఏకంగా 72 శాతం ఎక్కువ లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా ఎల్‌ఐసి 19 వేల కోట్ల రూపాయల లాభం ఆర్జించింది.

05/16/2017 - 00:44

ముంబయి, మే 15: ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో భారత స్టాక్ మార్కెట్లు సోమవారం మరింత పుంజుకున్నాయి. మార్కెట్ లావాదేవీలు ముగిసే సమయానికి కీలక సూచీలైన సెనె్సక్స్ 30,322, నిఫ్టీ 9,445 వద్దకు చేరుకున్నాయి. రాన్సమ్ వేర్ వైరస్ ప్రభావం కూడా పెద్దగా లేకపోవడం కూడా మార్కెట్లు పుంజుకోవడానికి దారితీసింది. అలాగే వివిధ కంపెనీల త్రైమాసిక ఆదాయాలు పెరగడం కూడా మార్కెట్‌కు ఊతాన్ని ఇచ్చింది.

05/16/2017 - 00:43

న్యూఢిల్లీ, మే 15: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్లు భారత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య (్ఫక్కీ) తమ అధ్యయన నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఏడాది వ్యవసాయ రంగ వృద్ధిరేటు 3.5 శాతానికి చేరుకోవడంతో పాటు పారిశ్రామిక, సేవా రంగాల పనితీరు మరింత మెరుగుపడుతుందని వివిధ అంచనాలు స్పష్టం చేస్తుండటమే ఇందుకు కారణమని ఆ నివేదిక పేర్కొంది.

05/16/2017 - 00:42

లేపాక్షి/హిందూపురం రూరల్, మే 15: హెరిటేజ్ డెయిరీ వచ్చే 2020 నాటికి రూ. 6 వేల కోట్ల లావాదేవీలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.

05/16/2017 - 00:40

నెల్లూరు, మే 15: దేశ ఆర్థికాభివృద్ధిలో విమానయాన రంగానిది కీలక పాత్రని కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్‌గజపతి రాజు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదంలో కుమారుడ్ని కోల్పోయిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణను పరామర్శించేందుకు మంత్రి అశోకగజపతిరాజు నెల్లూరు విచ్చేశారు.

05/16/2017 - 00:39

హైదరాబాద్, మే 15: ఐటి రంగంలో ఉద్యోగాల తొలగింపు అనేది సర్వసాధారణమని, దీనికి ఆందోళన చెందడం, అతిగా ప్రచారం చేయడం వద్దని ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు. ఐటి, ఐటి ఆధారిత కంపెనీల్లో సాధారణంగా జరిగే ఉద్యోగుల తొలగింపుపై ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, ఎక్కువ ఉత్సుకత చూపుతున్నారని అయన తెలిపారు. ఉద్యోగుల తోలగింపు అనేది ఈ రంగంలో ప్రతి సంవత్సరం జరిగేదేనని చెప్పారు.

Pages