S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/16/2017 - 00:37

ముత్తుకూరు, మే 15: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవులో ఎగుమతులు దిగుమతులు కేంద్రాన్ని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖా మంత్రి అర్జున్‌రాం మేఘవాల్ ప్రారంభించారు. సోమవారం కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటి సర్వీసెస్ ప్రాంగణంలో ఈకార్యక్రమం జరిగింది.అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ కృష్ణపట్నం ఓడరేవు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచిందని ప్రశంసించారు.

05/16/2017 - 00:36

న్యూఢిల్లీ, మే 15: దేశంలోని సాఫ్ట్‌వేర్ సేవల సంస్థల్లో అతిపెద్దదైన టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ఈ నెల 18వ తేదీ నుంచి 16 వేల కోట్ల రూపాయల షేర్ల మెగా బైబ్యాక్ ఆఫర్‌ను ప్రారంభించనుంది. ఇందుకోసం ఆ సంస్థ గత నెలలోనే తమ వాటాదారుల నుంచి అనుమతి పొందింది.

05/16/2017 - 00:34

న్యూఢిల్లీ, మే 15: యూరియా ఉత్పత్తి విషయంలో దేశం స్వయం సమృద్ధి అయ్యేలా చూడడానికి, దిగుమతులు తగ్గించుకోవడం కోసం దేశంలో మూతపడిన నాలుగు ఎరువుల కర్మాగారాలను 2020-21 నాటికల్లా పునరుద్ధరించడానికి మిగులు నిధులు పుష్కలంగా ఉండే బొగ్గు, విద్యుత్, చమురు రంగాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థలు 30 వేల కోట్ల దాకా పెట్టుబడులు పెట్టనున్నాయి.

05/15/2017 - 01:14

న్యూఢిల్లీ, మే 14: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో డిజిటల్ చెల్లింపులు ఆటోమేషన్ ప్రాధాన్యత పెరగటంతో దీని ప్రభావం అనేక ఐటి కంపెనీలపై గణనీయంగానే పడింది. రానున్న రెండేళ్ల కాలంలో ఇన్ఫోసిస్, కాగ్నిజాంట్, టెక్ మహింద్ర సహా పెద్ద ఐటి కంపెనీలు లే ఆఫ్‌లకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

05/15/2017 - 01:13

న్యూఢిల్లీ, మే 14: ఎఫ్‌ఎంసిజి రంగంలో గణనీయమైన ప్రాబల్యం కలిగిన గోద్రేజ్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రజల వ్యక్తిగత అవసరాలు తీర్చే సరికొత్త ఉత్పత్తులతో ముందుకు రాబోతోంది. సబ్బులు, హెయిర్‌డై లకు సంబంధించి కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెస్తామని ఈ సంస్థ తెలిపింది.

05/15/2017 - 01:12

న్యూఢిల్లీ, మే 14: భారత ప్రభుత్వం జారీ చేసిన రూ.500, రూ.2000 కరెన్సీ నోట్ల ముద్రణకు వినియోగించే కాగితం దిగుమతి వివరాలను బహిర్గతం చేయటం వల్ల కొత్త సమస్యలను కొని తెచ్చుకోవటమే అవుతుందని ఆర్బీఐకి చెందిన ప్రింటింగ్ కంపె నీ హెచ్చరించింది. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన అంశాలను బహిర్గతం చేయటం అంటే నేరానికి అవకాశం ఇవ్వటమే కాకుండా, దీని వల్ల దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీయటమే అవుతుందని తెలిపింది.

05/15/2017 - 01:11

హైదరాబాద్, మే 14: ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లపై హ్యాకర్లు ‘రాన్సమ్ వేర్’ వైరస్‌తో దాడి చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో సైబర్ దాడి కలకలం రేపుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రైవేటు సంస్థల వెబ్‌సైట్లు హ్యాక్ అయినట్టు సమాచారం. అయితే తమకు లిఖితపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని టెక్నికల్ సర్వీసుల విభాగం అధికారులు చెబుతున్నారు.

05/15/2017 - 01:09

ముంబయి, మే 14: దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని విధాలుగా పటిష్ఠం కావాలంటే డిజిటల్ విధానమే శరణ్యమని కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్‌వాల్ ఆదివారం ఇక్కడ ఉద్ఘాటించారు. నల్లధనాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయటంతో పాటు ఆర్థిక వ్యవస్థలోని డొల్ల తనాన్ని కూడా ఈ విధానం తొలగిస్తుందని ఆయన పేర్కొన్నారు.

05/15/2017 - 01:08

న్యూఢిల్లీ, మే 14: దేశ వ్యాప్తం గా డిజిటల్ లావాదేవీలను పెం పొందించేందుకు భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్‌పిసిఐ) విస్తృత స్థాయిలో ప్రచార చైతన్య కార్యక్రమాలను చేపట్టబోతోంది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్ లు, రూపే, డెబిట్ కార్డులు తదితర మార్గాల్లో దైనందిన లావాదేవీలను ఏ విధంగా నిర్వహించుకోవచ్చునో సామాన్యులకు తెలియజేస్తారు.

05/15/2017 - 01:06

న్యూఢిల్లీ, మే 14: ఓ కంపెనీని అమ్మేయటం అంటే అది అందులో పని చేస్తున్న ఉద్యోగుల పాలిట శాపమే అవుతుంది. కారణం తమ భవితవ్యం విషయంలో ఆ ఉద్యోగులు ఆందోళన చెందటమే కానీ, స్నాప్ డీల్ విషయంలో సిబ్బందికి పండగే పండగ. ఈ సంస్థ తన ఉద్యోగులకు దాదాపు రూ.193కోట్ల బొనాంజాను ఈ వ్యవహారంలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Pages