S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/14/2017 - 00:53

లండన్, మే 13: బ్యాంకు రుణాల ఎగవేతదారుడు విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించడానికి సంబంధించి లండన్ కోర్టులో ఉన్న కేసు విచారణ జూన్ 13కు వాయిదా పడిందని బ్రిటన్‌కు చెందిన క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సిపిఎస్) తెలిపింది. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్న ఈ కేసు జూన్ 13న విచారణకు వచ్చినప్పుడు భారత ప్రభుత్వం తరపున సిపిఎస్ వాదించనుంది.

05/14/2017 - 00:51

హైదరాబాద్, మే 13: నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా పే-నియర్ ఫిన్ టెక్ స్టార్టప్ ఐటి సొల్యూషన్స్‌కు మంచి స్పందన లభిస్తున్నదని ఆ సంస్ధ ఎండి, చీఫ్ స్ట్రాటేజీ ఆఫీసర్ ప్రభు రామ్ తెలిపారు. పే-నియర్ ఒన్ సొల్యూషన్ ద్వారా స్మార్ట్ఫోన్, టాబ్లెట్, పిసిల్లో ఈ సాఫ్ట్‌వేర్‌ను అమర్చుకోవాలన్నారు. చిప్, పిన్, ఇఎంవిసిఒతో అనుసంధానమవుతుందన్నారు.

05/14/2017 - 00:51

చెన్నై, మే 13: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా కొనసాగుతున్న ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తమ మొబైల్ వ్యాలెట్ ద్వారా వినియోగదారులు జరిపే లావాదేవీలపై చార్జీలు విధించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బిఇఎఫ్‌ఐ) డిమాండ్ చేసింది.

05/14/2017 - 00:49

పారిస్, మే 13: భారత్ సహా దాదాపు వంద దేశాలపై సైబర్ నేరగాళ్లు పంజా విసరడంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది కంప్యూటర్లు హ్యాకింగ్‌కు గురై వివిధ రంగాలకు చెందిన పలు పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్పష్టమవుతోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఈ సైబర్ దాడితో తమకూ నష్టం వాటిల్లిందని ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘రెనాల్ట్’ యాజమాన్యం శనివారం వెల్లడించింది.

05/14/2017 - 00:47

సింగపూర్, మే 13: భారత్‌లో పౌర విమానయాన రంగం శరవేగంగా వృద్ధి చెందుతుండటంతో అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతి పొందిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఎ) దేశీయ విమానయాన సంస్థ ‘విస్తారా’లో 10 కోట్ల సింగపూర్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.

05/14/2017 - 00:46

ముంబయి, మే 13: గత వారం దేశీయ మార్కెట్లలో లాభాల పంట పండింది. రుతు పవనాలు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉంటాయన్న వాతావరణ శాఖ అంచనాలతో గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పరుగులు తీశాయి. ఫలితంగా బిఎస్‌ఇ సెనె్సక్స్, జాతీయ స్టాక్ ఎఖ్స్‌చేంజి సూచీ నిఫ్టీలు జీవిత కాల గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి.

05/14/2017 - 00:44

హైదరాబాద్, మే 13: నగరాలు, పట్టణాల్లో ఉద్యోగాలు చేసే మహిళల్లో 35 శాతం మంది ఒక సంతానానికే పరిమితమవుతున్నారు. పిల్లలను కనడం, పెంచడం, ఆర్ధిక భారం వల్ల నగరాల్లో మహిళలు రెండో డెలివరీకి వెళ్లడం లేదు. ఈ సర్వేను అసోచామ్ సోషల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ సంస్ధ నిర్వహించింది. ప్రతి ఏడాది మే 2వ తేదీన తల్లుల దినోత్సవాన్ని పాటిస్తారు. ఆ రోజు తమ సంస్ధ శాంపిల్ సర్వే నిర్వహించిందని అసోచామ్ పేర్కొంది.

05/14/2017 - 00:43

ముంబయి, మే 13: ఏడాది క్రితం మార్కెట్లోకి ప్రవేశించినప్పటినుంచి ఉచిత ఆఫర్లతో సంచనాలు సృష్టిస్తున్న రియలన్స్ జియో దెబ్బకు టెలికాం సంస్థలు వరసగా నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. దేశంలో మూడో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఐడియా సెల్యులార్ లిమిటెడ్ వరసగా రెండో త్రైమాసికంలో నష్టాలను మూటగట్టుకుంది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో ఐడియా రూ.326 కోట్ల నష్టాలను చవి చూసింది.

05/14/2017 - 00:43

చెన్నై/ముంబయి, మే 13: త్వరలో మార్కెట్లోకి రానున్న ఎస్‌బిఐ లైఫ్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) దాదాపు ఏడేళ్ల కాలంలో వస్తున్న అతి పెద్ద ఐపిఓగా నిలవనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఎస్‌బిఐ 6500 కోట్ల రూపాయల నిధులను సేకరించాలని అనుకుంటోంది. వాస్తవానికి ఎస్‌బిఐ లైఫ్ ప్రధాన ప్రమోటర్లయిన ఎస్‌బిఐ, ఐరోపాకు చెందిన ఇన్సూరెన్స్ దిగ్గజం కార్డ్ఫి కలిపి మొత్తం 12 శాతం వాటాను విక్రయించాలని అనుకుంటున్నాయి.

05/14/2017 - 00:42

హైదరాబాద్, మే 13: ట్రేడ్ హైదరాబాద్.కామ్, టెరాబైట్ ఐటి సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 166 మందికి ఉద్యోగాలు లభించాయి. కొత్తపేటలోని టెరాబైట్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఉద్యోగ మేళాను రాచకొండ డిసిపి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తరహా ఉద్యోగ మేళా నిర్వహించడం నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

Pages