S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/13/2017 - 00:57

ముంబయి, మే 12: వరసగా నాలుగు రోజుల పాటు లాభాల బాటలో పరుగులు తీసిన దేశీయ స్టాక్ మార్కెట్లు వారం చివరి రోజున నష్టాలను చవి చూశాయి. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు మదుపరులు రికార్డు స్థాయికి చేరిన కంపెనీల స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు దిగడంతో సెనె్సక్స్ 63 పాయింట్లు నష్టపోయి 30,188.15 పాయింట్ల వద్ద ముగిసింది.

05/13/2017 - 00:54

న్యూఢిల్లీ, మే 12: ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్‌టిపిసి శుక్రవారం లండన్ స్టాక్ ఎక్స్‌చేంజిలో తన మసాలా బాండ్ల లిస్టింగ్‌ను ప్రారంభించింది. విద్యుత్ రంగంపై ఇండో-బ్రిటన్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఎన్‌టిపిసి ఈ మసాలా బాండ్ల లిస్టింగ్‌ను ప్రారంభించింది.

05/13/2017 - 00:53

ముంబయి, మే 12: ఈ నెల 5వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ ద్రవ్య నిల్వలు అంతకు ముందు వారంకన్నా 2.985 బిలియన్ డాలర్లు పెరిగి గతంలో ఎన్నడూ లేనంతగా 375.71 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు వారంలో విదేశీ ద్రవ్య నిల్వలు 1.594 బిలియన్ డాలర్లు పెరిగి 372.73 బిలియన్ డాలర్లుగా ఉండినట్లు ఆ ప్రకటన తెలిపింది.

05/13/2017 - 00:53

న్యూఢిల్లీ, మే 12: ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్) డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ చెల్లించాలన్న ప్రతిపాదనకు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అంగీకరించారు. విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తున్న నీట్ పరీక్షల విధానాన్ని పునఃపరిశీలించేందుకు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆమోదించారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు.

05/13/2017 - 00:51

న్యూఢిల్లీ, మే 12: ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రణాళికలో భాగంగా దేశంలోని దాదాపు 1000 ప్రధాన రైల్వే స్టేషన్లలో జన ఔషధి దుకాణాలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జన ఔషధి దుకాణాల నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరించేందుకు వివిధ రాష్ట్రాల్లోని బస్టాండ్లలో కూడా ఇటువంటి దుకాణాలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

05/13/2017 - 00:49

బీజింగ్, మే 12: ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఓ) నియమ నిబంధనలను పట్టించుకోకుండా తమ వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఏకపక్షంగా సుంకాలను విధిస్తే అమెరికాతో వాణిజ్య యుద్ధం తప్పదని చైనా హెచ్చరించింది.

05/13/2017 - 00:48

న్యూఢిల్లీ, మే 12: ఆహార వస్తువులతో పాటుగా ఉత్పాదక ఐటంల ధరలు తగ్గుముఖం పట్టడంతో ఏప్రిల్ నెలలో ద్రవ్యోల్బణం తగ్గింది. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెలలో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం నాలుగు నెలల కనిష్టస్థాయి అయిన 3.85 శాతానికి తగ్గింది. అలాగే వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సైతం 2.99 శాతానికి పడిపోయింది.

05/13/2017 - 00:48

హైదరాబాద్, మే 12: త్వరలోనే తెలంగాణ బ్రాండ్‌తో పసుపు, మిర్చి పొడులను విక్రయించాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మిర్చిని సేకరిస్తారు. అటవీ ఉత్పత్తులను గిరిజనుల నుంచి సేకరిస్తూనే గిరిజన సహకార సంస్థ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 180 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే విధంగా వ్యాపారం సాగించనున్నట్టు అటవీ శాఖ మంత్రి చందూలాల్ తెలిపారు.

05/13/2017 - 00:47

హైదరాబాద్, మే 12: నగరానికి చెందిన బిజినెస్ సొల్యూషన్ ప్రొవైడర్ జిజికె టెక్ ఉప్పల్‌లోని ఎరెనా సెజ్‌లో శుక్రవారం అత్యాధునిక సదుపాయాలతో కూడిన కార్యాలయాన్ని ప్రారంభించింది. ఐటి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యాలయం ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆ సంస్థ ప్రకటించింది.

05/12/2017 - 01:15

సీటెల్, మే 11: బహుళ జాతి సంస్థలు (ఎంఎన్‌సిలు) స్థానికులకు వెన్నుదన్నుగా నిలిచి వారికోసం ఉపాధి అవకాశాలు కల్పించాలని మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల అన్నారు. వారికోసం కొత్త వ్యాపారాలను సృష్టించడం వల్ల దీర్ఘకాలంలో వృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదని, అదే సమయంలో అగ్రరాజ్యాల రాజకీయ నేతలు లేవనెత్తుతున్న జాతీయత అంశాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు.

Pages